Earthquake: ఈ మధ్య కాలంలో భూకంపాలు భారీగా చోటు చేసుకుంటున్నాయి. మనదేశంలో సంభవించే భూకంపాలు పెద్దగా నష్టం ఉండకపోగా, ఇతర దేశంలో సంభవించే భూకంపాలతో భారీ నష్టం సంభవిస్తుంటుంది. ఇక తాజాగా చైనాలోని కింగ్ హై ప్రావిన్స్‌లో భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.9 నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. కింగ్‌హై ప్రావిన్స్‌లోని మెన్యువాన్ కౌంటీలో భూకంపం వచ్చిందని స్థానిక మీడియా వెల్లడించింది.. భూకంప కేంద్రాన్ని 37.77 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 101.26 డిగ్రీల తూర్పు రేఖాంశంలో పరిశీలించారు. జిన్హువా న్యూస్ ఏజెన్సీ ప్రకారం.. శనివారం తెల్లవారుజామున అంటే 1:45 గంటలకు (బీజింగ్ టైమ్) 10 కి.మీ లోతులో భూకంపం సంభవించింది.
ప్రావిన్షియల్ రాజధాని జినింగ్ సిటీలో బలమైన ప్రకంపనలు వచ్చాయి. అయితే భూకంప తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రకంపనలు అధికంగా నమోదైనట్లు అధికారులు తెలిపారు. భూకంపం రాగానే అక్కడి ప్రజలు ఇళ్ల నుంచి పరుగులు తీశారు. జంతువులు సైతం పరుగులు తీశాయి. ఆ దృశ్యాలు సీసీటీవీ పుటేజీలో రికార్డు అయ్యాయి. కాగా, 2010లో కూడా భారీ భూకంపం సంభవించింది. 6.9 భూకం తీవ్రతతో భూప్రకంపనలు రావడం వల్ల సుమారు 3 వేల మంది వరకు మరణించినట్లు అధికారులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి: