Sri Lanka Shutdown: శ్రీలంకలో మరింత ముదిరిన ఆర్ధిక సంక్షోభం.. దేశంలో కొనసాగుతున్న షట్‌డౌన్..

| Edited By: Ravi Kiran

Jun 21, 2022 | 6:34 AM

Sri Lanka Economic Crisis: ప్రస్తుతం శ్రీలంక వ్యాప్తంగా పెట్రోలు సంక్షోభం మరింత తీవ్రమైంది. దేశంలో పెట్రోలు నిల్వలు పూర్తిగా పడిపోయాయి. విదేశాల నుంచి దిగుమతి చేసుకునేందుకు విదేశీ మారకద్రవ్యం లేదు.

Sri Lanka Shutdown: శ్రీలంకలో మరింత ముదిరిన ఆర్ధిక సంక్షోభం.. దేశంలో కొనసాగుతున్న షట్‌డౌన్..
Srilanka Crisis
Follow us on

Sri Lanka Shutdown: ఆర్థిక సంక్షోభం మరింత దిగజారడంతో శ్రీలంక సర్కార్ అనూహ్య చర్యలు చేపట్టింది. చమురు కొరతను దృష్టిలో పెట్టుకొని సాధారణ సేవలకు రెండు వారాల పాటు షట్‌డౌన్‌ ప్రకటించింది. ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా పాఠశాలలకు సెలవును ప్రకటించారు. ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించుకోవాలని సూచించారు. ఇక ప్రభుత్వ కార్యాలయాలను నామమాత్రపు సిబ్బందితో నడిపిస్తున్నారు. ఆసుపత్రులు, నౌకాశ్రయాలు మాత్రం అత్యవసర సర్వీసులుగా పరిగణించి కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం శ్రీలంక వ్యాప్తంగా పెట్రోలు సంక్షోభం మరింత తీవ్రమైంది. దేశంలో పెట్రోలు నిల్వలు పూర్తిగా పడిపోయాయి. విదేశాల నుంచి దిగుమతి చేసుకునేందుకు విదేశీ మారకద్రవ్యం లేదు. బంకుల దగ్గర వాహనాలు కిలోమీటర్ల కొద్దీ లైన్లలో బారులు తీరి ఎదురు చూస్తున్నారు.

మరోవైపు ప్రధాన మంత్రిని మార్చినా సంతృప్తి చెందని ఆందోళనాకారులు అధ్యక్షుడు గొటబాయ రాజపక్స కూడా రాజీనామా చేయాల్సిందేనని పట్టుబడుతున్నారు. తాజాగా అధ్యక్ష కార్యాలయాన్ని ముట్టడించారు. ఇక్కడి రెండు గేట్ల దగ్గర ఏప్రిల్‌ నుంచి ఆందోళనలు కొనసాగుతుండగా, తాజా మరో రెండు గేట్లను దిగ్భందించారు. ఆందోళనాకారుల్లో కొందరిని పోలీసులు ఆదుపులోకి తీసుకున్నారు.

ఇక ఆర్థిక సంక్షోభంతో అప్పులు ఎగవేస్తున్నట్లు ప్రకటించిన లంక సర్కారుతో బెయిల్‌ఔట్‌ ప్రోగ్రామ్‌పై చర్చించేందుకు ఐఎంఎఫ్ బృందం కొలంబో చేరుకుంది. చెల్లింపు తేదీలను పొడగించాలని శ్రీలంక ప్రభుత్వం కోరింది. శ్రీలంకలో కొన్ని నెలలుగా ఆర్థిక, ఆహార, ఇంధన, విద్యుత్ సంక్షోభం మరింత తీవ్రమవ్వడం, ధరలు మండిపోతుండటంతో ప్రజలు విలవిలలాడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..