AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Singapore Flight: 37వేల అడుగుల ఎత్తులో విమానం.. ఒక్కసారిగా కుదుపు.. ఒకరు మృతి, 30మందికి గాయాలు

సరైన రోడ్డు మార్గాం లేకపోవడం వల్ల బస్సులు కుదుపులకు గురవుతాయి. కానీ ఆకాశంలో విమానం కుదుపులకు గురైతే.. వినటానికి వింతగా ఉన్నా ఇది నిజం. లండన్‌ నుంచి సింగపూర్‌కు బయలుదేరిన సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం బ్యాంకాక్‌ ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండైంది.

Singapore Flight: 37వేల అడుగుల ఎత్తులో విమానం.. ఒక్కసారిగా కుదుపు.. ఒకరు మృతి, 30మందికి గాయాలు
Singapore Airlines Flight
Balaraju Goud
|

Updated on: May 22, 2024 | 8:15 AM

Share

సరైన రోడ్డు మార్గాం లేకపోవడం వల్ల బస్సులు కుదుపులకు గురవుతాయి. కానీ ఆకాశంలో విమానం కుదుపులకు గురైతే.. వినటానికి వింతగా ఉన్నా ఇది నిజం. లండన్‌ నుంచి సింగపూర్‌కు బయలుదేరిన సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం బ్యాంకాక్‌ ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండైంది. ఆకాశంలో ఎగురుతున్న సమయంలో వాతావరణంలో చోటుచేసుకున్న మార్పుల కారణంగా విమానం భారీ కుదుపులకు లోనైంది. ఈ కుదుపులకు ఒక ప్రయాణికుడు చనిపోయాడని, 30 మంది గాయపడ్డారు.

లండన్‌ హీత్రూ విమానాశ్రయం నుంచి సింగపూర్‌ వెళ్తున్న ఎస్‌ క్యూ321 విమానం అండమాన్‌ సముద్రంపై 37వేల అడుగుల ఎత్తులో ఉండగా, కేవలం ఐదు నిమిషాల్లోనే 31వేల అడుగులకు దిగిపోయింది. దీంతో, విమానాన్ని అత్యవసరంగా బ్యాంకాక్‌లోని సువర్ణభూమి అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్‌ చేశారు.

బోయింగ్‌ 777 రకానికి చెందిన ఈ విమానం 211 మంది ప్రయాణికులు, 18 మంది సిబ్బందితో లండన్‌ హీత్రూ ఎయిర్‌పోర్టు నుంచి సింగపూర్‌కు బయలుదేరింది. సింగపూర్‌కు వెళ్తుండగా విమానంలో కుదుపు ఏర్పడింది. దీంతో స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:45 గంటలకు విమానాన్ని బ్యాంకాక్‌లో అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. మరణించిన ప్రయాణీకుడు 73 ఏళ్ల బ్రిటిష్ చెందిన వ్యక్తి అని సువర్ణభూమి విమానాశ్రయం డైరెక్టర్ కిట్టిపాంగ్ కిట్టికాచోర్న్ తెలిపారు. చాలా వరకు గాయాలు తలపై దెబ్బలు తగిలాయని కిట్టిపోంగ్ చెప్పారు. బ్యాంకాక్‌లోని సమితివేజ్ శ్రీనాకరిన్ హాస్పిటల్ 71 మందిని చికిత్స కోసం పంపినట్లు, వారిలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయని వెల్లడించారు.

విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది అందరికీ సాధ్యమైన సహాయం అందించడమే మా ప్రాధాన్యత అని ఎయిర్‌లైన్స్ తెలిపింది. అవసరమైన వైద్య సహాయం అందించడానికి థాయ్‌లాండ్‌లోని స్థానిక అధికారులతో కలిసి పని చేస్తున్నామని పేర్కొన్నారు.

గాలి అల్లకల్లోలం అంటే ఏమిటి?

వాస్తవానికి, ఎగిరే సమయంలో విమానం గాలి ఒత్తిడి, వేగంలో అకస్మాత్తుగా మార్పు వచ్చినప్పుడు గాలి అల్లకల్లోలం అంటారు. దీని కారణంగా, విమానం షాక్ అయినట్లు అనిపిస్తుంది. అది గాలిలో పైకి క్రిందికి కదలడం ప్రారంభిస్తుంది. ఎయిర్ టర్బులెన్స్‌లో, విమానంలో కూర్చున్న ప్రయాణీకులు షాక్‌ కొట్టినట్లు అనుభూతి చెందుతారు. అలాంటి పరిస్థితుల్లో విమానాన్ని నియంత్రించడం చాలా కష్టం అవుతుంది. దీని వల్ల విమాన ప్రమాదం కూడా జరగవచ్చు. ఇంతకు ముందు కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి. సింగపూర్ ఎయిర్‌లైన్స్ చెందిన ఒక విమానం 2000 అక్టోబర్‌లో జరిగింది. తైవాన్ నుండి టేకాఫ్ అవుతున్నప్పుడు మూసివేసిన రన్‌వేపై విమానం కూలి 83 మంది మరణించారు. అదే సమయంలో, ఏవియేషన్ సేఫ్టీ నెట్‌వర్క్ రికార్డుల ప్రకారం, సింగపూర్ ఎయిర్‌లైన్స్‌లో ఇప్పటివరకు ఇలాంటి 7 ప్రమాదాలు జరిగాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..