Sri Lankan Protests: శ్రీలంకలో రోడ్డెక్కిన మాజీ క్రికెటర్ సనత్ జయసూర్య.. ఎందుకంటే

Sri Lankan Protests: శ్రీలంకలో తీవ్ర ఆర్థిక సంక్షోభం నెలకొంది. రోజురోజుకు నిరసనలు తీవ్రతరం అవుతున్నాయి. పెరుగుతున్న ధరలు, నిత్యావసర వస్తువుల కొరతకు వ్యతిరేకంగా శ్రీలంకలో..

Sri Lankan Protests: శ్రీలంకలో రోడ్డెక్కిన మాజీ క్రికెటర్ సనత్ జయసూర్య.. ఎందుకంటే
Follow us
Subhash Goud

|

Updated on: Jul 09, 2022 | 6:17 PM

Sri Lankan Protests: శ్రీలంకలో తీవ్ర ఆర్థిక సంక్షోభం నెలకొంది. రోజురోజుకు నిరసనలు తీవ్రతరం అవుతున్నాయి. పెరుగుతున్న ధరలు, నిత్యావసర వస్తువుల కొరతకు వ్యతిరేకంగా శ్రీలంకలో కొంతకాలంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. నిరసనల నేపథ్యంలో శ్రీలంక శ్రీలంక మాజీ క్రికెటర్‌ సనత్‌ జయసూర్య సైతం రోడ్డెక్కారు. ఆందోళకారులతో కలిసి నిరసనల్లో పాల్గొన్నారు. ఆందోళనకారులతో జయసూర్య రోడ్డెక్కడంతో తన అభిమానులు సెల్ఫీలు, ఫోటోలు దిగారు. ఒక నాయకుడిని అధికారం నుంచి తోసిపారేయడానికి దేశమతా ఏకం కావడం నా జీవితంలో ఎన్నడూ చూడలేదు, శాంతియుతంగా వెళ్లిపో అంటూ ట్వీట్‌ చేశారు.

గొటాబయ రాజపక్ష అధికారిక నివాసంలోకి దూసుకువచ్చిన ఆందోళనకారులు.. ‘గొటా గో హోమ్‌’ అంటూ ఆందోళనకారులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి వారిపై టియర్‌ గ్యాస్‌ను ప్రయోగించారు. అయినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో లాఠీఛార్జ్‌ నిర్వహించారు. ఆందోళనకారులు పోలీసుల రక్షణ వలయాలను, బారికేడ్లు దాటుకుని ఆందోళనకారులు అధ్యక్ష నివాసంలోకి వెళ్లడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అయితే ఆ దేశ అధ్యక్షుడు రాజపక్స సురక్షిత ప్రాంతానికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఎక్కడున్నరన్న సమాచారం అధికారికంగా ఇంకా వెల్లడి కాలేదు.

ఇవి కూడా చదవండి

కొందరు ఆందోళనకారులు అధ్యక్ష నివాసం మెయిన్ గేట్ ఎక్కి లోపలికి ప్రవేశించారు. దీంతో కొలంబోలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆందోళనకారులను అడ్డుకునేందుకు ఆర్మీని రంగంలోకి దించారు. ఆ ప్రాంతంలో సైనికులు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ నిరసన కారుల ఆందోళనలో ఒక సెక్యూరిటీ గార్డు సహా 33 మంది గాయపడినట్లు కొలంబో నేషనల్‌ హాస్పిటల్‌ తెలిపింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి