AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Drone Attack: ఉక్రెయిన్‌పై విరుచుకుపడ్డ రష్యా.. ఒకేసారి 75 డ్రోన్లతో దాడి.. తిప్పికొట్టామన్న ఉక్రెయిన్‌

ఉక్రెయిన్‌పై మరోసారి రష్యా మెరుపుదాడికి దిగింది. ఒక్కటి కాదు రెండు కాదు.. ఏకంగా 75 డ్రోన్లు ప్రయోగించింది. అయితే రష్యా డ్రోన్‌ దాడులను తిప్పికొట్టామని, కాని కొన్ని భవనాలు ధ్వంసమైనట్టు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రకటించారు. 2022 ఫిబ్రవరిలో సైనిక చర్య తరువాత మాస్కో జరిపిన అతిపెద్ద డ్రోన్‌ దాడి ఇదేనని ఉక్రెయిన్‌ బలగాలు వెల్లడించాయి.

Drone Attack: ఉక్రెయిన్‌పై విరుచుకుపడ్డ రష్యా.. ఒకేసారి 75 డ్రోన్లతో దాడి.. తిప్పికొట్టామన్న ఉక్రెయిన్‌
Largest Drone Attack
Balaraju Goud
|

Updated on: Nov 25, 2023 | 9:36 PM

Share

ఉక్రెయిన్‌పై మరోసారి రష్యా మెరుపుదాడికి దిగింది. ఒక్కటి కాదు రెండు కాదు.. ఏకంగా 75 డ్రోన్లు ప్రయోగించింది. అయితే రష్యా డ్రోన్‌ దాడులను తిప్పికొట్టామని, కాని కొన్ని భవనాలు ధ్వంసమైనట్టు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రకటించారు. 2022 ఫిబ్రవరిలో సైనిక చర్య తరువాత మాస్కో జరిపిన అతిపెద్ద డ్రోన్‌ దాడి ఇదేనని ఉక్రెయిన్‌ బలగాలు వెల్లడించాయి.

ఉక్రెయిన్‌పై ఒకేసారి 75 డ్రోన్లు ప్రయోగించింది రష్యా. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ను టార్గెట్‌ చేస్తూ ఈ డ్రోన్‌ దాడులు జరిగాయి. 75 ఇరానీయన్‌ ఆత్మాహుతి డ్రోన్లలో 71 డ్రోన్లను తమ గగనతల రక్షణ వ్యవస్థ ధ్వంసం చేసినట్లు ఉక్రెయిన్‌ ఆర్మీ అధికారులు చెప్పారు. కీవ్‌ తోపాటు సుమీ, ద్నిప్రోపెట్రోవ్స్క్, జపోరిజియా, మైకోలైవ్ తదితర ప్రాంతాలపైనా రష్యా సేనలు డ్రోన్‌ దాడులు జరిపాయి. కీవ్‌పైకి ప్రయోగించిన 60కిపైగా డ్రోన్లను తమ గగనతల రక్షణ వ్యవస్థ కూల్చేసినట్లు నగర పాలనాయంత్రాంగం తెలిపింది.

శనివారం తెల్లవారుజామున 4 గంటల నుంచి ఉదయం 10 వరకు ఈ డ్రోన్ల దాడి జరిగినట్టు అధికారులు చెప్పారు. దాడుల్లో 77 నివాస భవనాలు, 120 కార్యాలయాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడినట్లు వెల్లడించారు. డ్రోన్ల ద్వారా కీవ్‌పై రష్యా జరిపిన అతిపెద్ద దాడి ఇదేనని పేర్కొన్నారు. ఈ దాడుల్లో దాదాపు ఐదుగురు పౌరులు గాయపడినట్లు కీవ్ మేయర్ విటాలి క్లిట్‌ష్కి చెప్పారు. బాధితుల్లో 11 ఏళ్ల బాలిక కూడా ఉన్నట్లు ఆయన తెలిపారు.

1932- 33లో ఉక్రెయిన్‌లో లక్షలాది మంది మరణానికి కారణమైన కరవు విషాదాన్ని గుర్తుచేసుకునే ‘హోలోదోమోర్ సంస్మరణ దినం’ రోజునే ఈ దాడి జరిగింది. రష్యా ప్రయోగించిన చాలా డ్రోన్లను కూల్చేశామని , కూల్చివేశారు. కానీ, కొన్ని ప్రయత్నాలు విఫలమైనట్టు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు. గగనతల రక్షణను మరింత పటిష్ఠం చేసి, మరిన్ని లక్ష్యాలను నేలకూల్చుతామని చెప్పారు. అంతకుముందు రష్యా ఆక్రమిత క్రిమియా ద్వీపకల్పంపై ఉక్రెయిన్‌ సైతం డ్రోన్లతో దాడి చేసింది. గత 21 నెలల్లో ఉక్రెయిన్‌ చేపట్టిన అతిపెద్ద డ్రోన్‌ దాడుల్లో ఇదొకటని మాస్కో పేర్కొంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

బిగ్ బాష్ లీగ్‌లో తప్పిన పెను ప్రమాదం..వీడియో వైరల్!
బిగ్ బాష్ లీగ్‌లో తప్పిన పెను ప్రమాదం..వీడియో వైరల్!
ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ