Vladimir Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై హత్యాయత్నం.. ఎలా జరిగిందంటే..

|

Sep 15, 2022 | 5:38 PM

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై మరోమారు హత్యాయత్నం జరిగింది. జనరల్ జీవీఆర్ టెలిగ్రామ్ ఛానెల్‌ బుధవారం ఈ విషయాన్ని వెల్లడించింది..

Vladimir Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై హత్యాయత్నం.. ఎలా జరిగిందంటే..
Vladimir Putin
Follow us on

Vladimir Putin Assassination Attempt: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై మరోమారు హత్యాయత్నం జరిగింది. జనరల్ జీవీఆర్ టెలిగ్రామ్ ఛానెల్‌ బుధవారం ఈ విషయాన్ని వెల్లడించింది. ఐతే హత్యాయత్నం ఏ సమయంలో జరిగిందనే విషయం మాత్రం ఇప్పటివరకు తెలియరాలేదు.

టెలిగ్రామ్ ఛానెల్‌ నివేదిక ప్రకారం.. పుతిన్ తన నివాసానికి తిరిగి వెళ్తుండగా తాను ప్రయాణించే లిమోసిన్ కారు ఎడమ టైరు పెద్ద శబ్ధంతో పేలింది. దాని నుంచి పొగ వెలువడినప్పటికీ కారును త్వరగా సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు పేర్కొంది. ఈ ఘటనలో రష్యా అధ్యక్షుడికి ఎటువంటి హానీ జరగలేదనీ, మరొక వాహనంలో క్షేమంగా పుతిన్‌ నివాస గృహానికి తరలించారని క్రెమ్లిన్‌ అంతర్గత వర్గాలు తెలిపినట్లు టెలిగ్రామ్‌ ఛానల్‌ వెల్లడించింది. పుతిన్‌ నివాసానికి మరికొన్ని కిలోమీటర్ల చేరువలో ఉండగా పుతిన్‌ కాన్వాయ్‌లోని తొలి ఎస్కార్డ్‌ కారుకు అంబులెన్స్‌ అడ్డుగా వచ్చింది. ఐతే రెండో ఎస్కార్ట్‌ కారు ఆపకుండా వెళ్లిపోయినట్లు టెలిగ్రామ్‌ ఛానల్‌ తెల్పింది. ఈ ఘటన తర్వాత పుతిన్‌ సెక్యురిటీ సర్వీస్‌కు చెందిన పలువురిని అరెస్టు చేసినట్లు టెలిగ్రామ్‌ ఛానల్‌ వెల్లడించింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడుల కారణంగా ఆ దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతినడంతో పుతిన్‌పై దేశ ద్రోహ అభియోగాలు మోపి, అధికారం నుంచి తొలగించాలని కొన్ని రాజకీయ వర్గాలు ప్రయత్నిస్తున్నాయి. పుతిన్‌పై వ్యతిరేకత ఉన్న వర్గాలే దాడులకు పాల్పడి ఉంటారని మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి.

ఇవి కూడా చదవండి

కాగా ఈ ఏడాది ప్రారంభంలో (ఫిబ్రవరి) రష్యా – ఉక్రెయిన్‌పై దాడి చేసినప్పటి నుంచి పుతిన్ ప్రాణాలకు ముప్పు ఉన్నట్లు ఆనోటా.. ఈనోటా.. వినిపిస్తూనే ఉన్నాయి. ఐతే ఇది కేవలం పుకారు మాత్రమే కాదు నిజంగానే రష్యా అధ్యక్షుడిని అంతమొందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తాజా సంఘటనలను బట్టి తెలుస్తోంది. గత కొద్ది కాలం క్రితం కూడా పుతిన్‌పై దాడి జరిగింది. ఐతే ఈ విషయాన్ని పుతిన్‌ రక్షక వర్గాలు రహస్యంగా ఉంచాయి. పుతిన్‌పై ఇప్పటివరకు వరకు ఐదు సార్లు హత్యా ప్రయత్నాలు జరిగినట్లు 2017లో స్వయంగా బహిరంగంగా వెల్లడించాడు కూడా. ఐతే అన్నిసార్లు కూడా పుతిన్ ప్రాణాలతో బయటపడటం విశేషం. అంతేకాకుండా దాడుల గురించి తాను ఆందోళన చెందేదిలేదని కూడా అప్పట్లో ఆయన అన్నారు.