- Telugu News Photo Gallery World photos Viral News: Woman near 40 claims eating turmeric makes her look younger than she did at 20
Viral News: 40 ఏళ్లలోనూ 20 ఏళ్లలా కనిపించే మహిళ.. ‘యాంటీ ఏజింగ్’ రహస్యం ఏమిటంటే..
Viral News: ప్రస్తుతం ఒక మహిళ సోషల్ మీడియాలో ఒక వార్త హల్ చల్ చేస్తోంది. వాస్తవానికి, ఈ మహిళ వయస్సు 40 సంవత్సరాలు.. అయితే చూసేవారు.. ఆమెకు 20ఏళ్లు అని భావిస్తారు. తాను యవ్వన రహస్యానికి కారణం .. ఇంటి వంటగదిలో ఉండే వస్తువులే అంటోంది ఆ మహిళ.
Updated on: Sep 15, 2022 | 4:24 PM

ప్రతి స్త్రీ అందంగా, యవ్వనంగా కనిపించాలని కోరుకుంటుంది. ఇందుకోసం కొందరు సర్జరీని ఆశ్రయిస్తే, మరికొందరు జిమ్‌లో చెమటలు పట్టిస్తూ సహజంగా మెయింటైన్ చేస్తున్నారు. అయినప్పటికీ.. ఎటువంటి వర్కౌట్స్ .. కృతిమ పెద్దలు పాటించడకుండా అసలు వయస్సు కంటే చాలా చిన్న వయస్సుగా కనిపించే మహిళలు చాలా మంది ఉన్నారు. ప్రస్తుతం ఓ మహిళ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ మహిళను చూస్తే .. ఎవరైనా 40 ఏళ్లు అంటే నమ్మడం కష్టం.

జర్మనీలోని స్టట్‌గార్ట్‌లో నివసిస్తున్న ఆండ్రియానా క్రజెస్నియాక్ త్వరలో తన 40వ పుట్టినరోజును జరుపుకోబోతుంది. అయితే ఆమె వయస్సు కంటే కనీసం 20 సంవత్సరాలు చిన్నదిగా కనిపిస్తోంది. తమాషా ఏంటంటే.. తన యవ్వన రహస్యాన్ని బయటపెట్టింది. ప్రతి ఇంటి వంటగదిలో కనిపించే పసుపు తన యవ్వన రహస్యం అని చెప్పింది ఆండ్రియానా.

ఆండ్రియానా తన ఆహారంలో పసుపును ఖచ్చితంగా ఉపయోగిస్తానని చెప్పింది. పసుపుతో పాటు.. ఆమె తినే ఆహారంలో జీలకర్ర, మిల్లెట్, ఈస్ట్ ఉన్నాయి. అంతేకాదు మెరిసే చర్మం పొందడానికి సూపర్ ఫుడ్స్ తింటానని చెప్పింది. ఇక రోజూ నీరు ఎక్కువగా తాగుతానని.. ముఖంపై ముడతలు రాకుండా దిండ్లు వాడటం కూడా మానేసినట్లు పేర్కొన్నది.

ఆండ్రియానా తాను ఎప్పుడూ అందాన్ని పెంచే కృతిమ రసాయనాలను.. బొటాక్స్‌ను ఆశ్రయించలేదని.. అయితే రేడియో ఫ్రీక్వెన్సీ థెరపీ చేయించుకున్నట్లు పేర్కొంది. ఇది ఒక రకమైన శస్త్రచికిత్స..ఈ ప్రక్రియలో చర్మం బిగుతుగా ఉంటుంది. ఆండ్రియానా దీని కోసం ఒక మెషిన్ కూడా కొనుగోలు చేసింది. దీంతో ఇంట్లోనే రేడియో ఫ్రీక్వెన్సీ థెరపీ ని తీసుకుంటుంది.

ఆండ్రియానా 20 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుంది. అయితే ఆమెకు సంతానోత్పత్తి సమస్యలు ఉన్నాయి. దీంతో 32 సంవత్సరాల వయస్సులో తన భర్త నుండి విడాకులు తీసుకుంది. విడాకుల అనంతరం తీవ్రమైన డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. స్టట్‌గార్ట్‌లో స్థిరపడింది. ఇప్పుడు ఆమె రెండో పెళ్లి చేసుకుంది. సంతానోత్పత్తి సమస్య ఉన్నప్పటికీ తాను జీవితాన్ని కొత్తగా జీవించాలనే ఆలోచనతో సంతోషముగా ఉన్నట్లు చెబుతోంది.




