Pregnant: ఒకే విమానంలో 33 మంది గర్భిణీ స్త్రీలు.. విచారించగా వెలుగుచూసిన బిత్తరపోయే నిజాలు..!

|

Feb 12, 2023 | 9:07 PM

సాధారణంగా గర్భిణీలు ప్రయాణాల చేయడం అంత క్షేమకరం కాదు. ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంటి నుంచి కాస్త దూరం ప్రయాణిస్తేనే ఇబ్బంది పడే గర్భిణీలు..

Pregnant: ఒకే విమానంలో 33 మంది గర్భిణీ స్త్రీలు.. విచారించగా వెలుగుచూసిన బిత్తరపోయే నిజాలు..!
Pregnant Women
Follow us on

సాధారణంగా గర్భిణీలు ప్రయాణాల చేయడం అంత క్షేమకరం కాదు. ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంటి నుంచి కాస్త దూరం ప్రయాణిస్తేనే ఇబ్బంది పడే గర్భిణీలు.. ఏకంగా దేశాలే దాటిపోతున్నారు. సరిగ్గా నెలలు నిండిన సమయంలో తమ దేశం వీడి.. వేరే దేశానికి క్యూ కడుతున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు నెలల వ్యవధిలోనే ఏకంగా 5 వేల మందికిపైగా నిండు గర్భిణీ స్త్రీలు దేశం దాటి వెళ్లారు. మరి ఏ దేశ గర్భిణీలు, ఏ దేశాని వెళ్తున్నారు? ఎందుకు వెళ్తున్నారు? వాళ్లు చెబుతున్న రీజన్స్ ఏంటి? అధికారుల రియాక్షన్స్ ఏంటి? ఆసక్తి వివరాలు తెలుసుకుందాం..

గత కొద్ది నెలలుగా రష్యాకు చెందిన 5 వేల మందికి పైగా గర్భిణీ స్త్రీలు తమ దేశం వీడి అర్జెంటినాకు వెళ్లారు. తాజాగా ఒకే విమానంలో 33 మంది నిండు గర్భిణీ స్త్రీలు అర్జెంటినాకు ప్రయాణం చేయడం సంచలనంగా మారింది. ఈ గర్భిణీ స్త్రీలు అందరూ మరో వారం రోజుల్లోనే డెలివరీకి సిద్ధంగా ఉన్నారు. వీరంతా తమ పిల్లలు అర్జెంటినాలో పుట్టాలని ఆకాంక్షిస్తున్నారు. తమ పిల్లలకు రష్యా పౌరసత్వం కంటే.. అర్జెంటినా పౌరసత్వాన్ని కలిగి ఉండటమే మంచిదని భావిస్తున్నారు. కారణం.. అర్జెంటినాలో స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుందని కారణం చెబుతున్నారు.

ముగ్గురు గర్భిణీ స్త్రీలను అదుపులోకి తీసుకున్న అధికారులు..

డాక్యూమెంటేషన్‌లో సమస్యల కారణంగా ముగ్గురు గర్భిణీ స్త్రీలను అదుపులోకి తీసుకున్నారు ఇమిగ్రేషన్ అధికారులు. తాము పర్యాటకులుగా అర్జెంటీనాకు వెళ్తున్నామని రష్యన్ మహిళలు చెప్పారని, వాస్తవానికి వారి ఉద్దేశ్యం అది కాదని చెబుతున్నారు అధికారులు. రష్యన్ మహిళలు తమ పిల్లలకు అర్జెంటినీ పౌరసత్వం కావాలని కోరుకుంటున్నారని, ఇందుకు కారణం రష్యన్ పాస్‌పోర్ట్ కంటే అర్జెంటినా పాస్‌పోర్ట్ ఎక్కవు స్వేచ్ఛను కలిగి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

అర్జెంటీనా పాస్‌పోర్ట్ హోల్డర్లకు ప్రత్యేక సౌకర్యం..

మహిళలు తమ పిల్లలకు అర్జెంటీనా పౌరసత్వం కోరుకోవడానికి ఆ దేశ పాస్‌పోర్ట్ కారణం. ప్రపంచ వ్యాప్తంగా అర్జెంటినా పాస్‌పోర్ట్‌ చాలా సురక్షితమైనదిగా గుర్తింపు ఉంది. ఈ పాస్‌పోర్ట్ హోల్డర్స్ వీసా లేకుండా 171 దేశాలలో ప్రవేశించడానికి వీలుంది.

ఆస్పత్రుల ఆఫర్స్..

అర్జెంటినాలో ప్రసవించాలనుకునే తల్లుల కోసం ఆదేశానికి చెందిన కొన్ని ఆస్పత్రులు ప్రత్యేక ఆఫర్స్ అందిస్తున్నాయి. బర్త్ డేట్ షెడ్యూల్, విమానశ్రయంలో పికప్, స్పానిష్ పాఠాలు, ఆస్పత్రి బిల్లుల్లో తగ్గింపు వంటి సేవలు అందిస్తున్నాయి. 2015 నుంచి ఈ తరహా ఆఫర్స్ ఇస్తున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..