Russia Ukraine War: ఉక్రెయిన్‌ను వెంటాడుతున్న మరో పెద్ద సమస్య.. అల్లాడిపోతున్న జనాలు..

|

Nov 01, 2022 | 10:01 PM

రష్యా దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్ ప్రజలకు కొత్త కష్టాలు తప్పట్లేదు. ఎప్పుడు ఎటువైపు నుంచి వచ్చి బాంబులు మీదపడతాయోననే భయం ఓవైపు పట్టిపీడిస్తూనే ఉంది.

Russia Ukraine War: ఉక్రెయిన్‌ను వెంటాడుతున్న మరో పెద్ద సమస్య.. అల్లాడిపోతున్న జనాలు..
Ukraine Water Crisis
Follow us on

రష్యా దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్ ప్రజలకు కొత్త కష్టాలు తప్పట్లేదు. ఎప్పుడు ఎటువైపు నుంచి వచ్చి బాంబులు మీదపడతాయోననే భయం ఓవైపు పట్టిపీడిస్తూనే ఉంది. సాధ్యమైనంత వరకు బయటికి వెళ్లడమే మానుకున్నారు. తాజాగా రష్యా దాడులతో మౌలిక సదుపాయాలు దెబ్బతినే పరిస్థితి నెలకొంది. తాగునీటి సరఫరా, విద్యుత్ సరఫరాలకు ఆటంకం తప్పడంలేదు. ఇటీవల రష్యా క్షిపణులతో విరుచుకుపడడంతో కీవ్, ఇతర నగరాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. అధికార యంత్రాంగం దీనిని పునరుద్ధరించే ఏర్పాట్లలో ఉన్న సమయంలోనే సోమవారం మరోమారు రష్యా దాడులు చేసింది.

సుమారు 50 క్షిపణులతో కీవ్, ఖార్కీవ్ లవీవ్, ఖేర్సన్, ఒడెసా తదితర నగరాలపై దాడి చేసింది.ఆయా నగరాల్లోని మౌలిక సదుపాయాల వ్యవస్థలను లక్ష్యం చేసుకుని దాడులకు పాల్పడిందని ఉక్రెయిన్ ఆరోపించింది. దీంతో చాలా నగరాల్లో ప్రజలకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నీటి సరఫరా చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారుల చెప్పారు ఈలోపు దగ్గర్లోని తాగునీటి కేంద్రాలకు జనం క్యూ కట్టారు.రష్యా దాడుల ప్రభావం కీవ్ లో ఎక్కువగానే ఉందని ఉక్రెయిన్ అధికార వర్గాల సమాచారం.

సిటీలోని దాదాపు 40 శాతం జనాలకు తాగునీరు అందుబాటులో లేదని సిటీ మేయర్ చెప్పారు. నగరంలోని 2లక్షల 70వేల అపార్ట్మెంట్లు విద్యుత్ సరఫరా లేక చీకట్లోనే మగ్గుతున్నాయి..ఉక్రెయిన్ ఆర్మీ కమాండ్‌లతో పాటు విద్యుత్ కేంద్రాలను లక్ష్యంగా దాడులు చేస్తున్నట్లు రష్యా రక్షణ శాఖ వెల్లడించింది. అయితే, రష్యా క్షిపణి దాడులను దీటుగా ఎదుర్కొంటుంది ఉక్రెయిన్‌ సేన.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..