ఉక్రెయిన్‌లోని లుహాన్స్క్, దొనెట్స్క్, జపోరిజియా, ఖేర్సన్ ప్రాంతాలను విలీనం చేసుకున్న తర్వాత రష్యా మరింత దూకుడు పెంచిది. ఉక్రెయిన్ జపోరిజియాలో ఉన్న యూరోప్‌లోని అతిపెద్ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఇప్పుడు రష్యా పరిధిలోకి వచ్చింది. కాగా జపోరిజియా న్యూక్లియర్ ప్లాంట్ డైరెక్టర్ జనరల్ ఇహోర్ మురషోవ్‌ను రష్యా కిడ్నాప్ చేసిందని ఉక్రెయిన్ ఆరోపించింది. మురాషోవ్ కారును అడ్డగించి, ఆయన కళ్లకు గంతలు కట్టి రహస్య ప్రాంతానికి తీసుకెళ్లారని చెబుతున్నారు.. మురాషోవ్ కిడ్నాప్ అణు విద్యుత్ కేంద్రం భద్రతను ప్రమాదంలో పడేస్తుందని ఆందోళన వ్యక్తమవుతోంది. దీనిపై రష్యా మాత్రం స్పందించలేదు. మరోవైపు నాలుగు ప్రాంతాలను విలీనం చేసుకున్నట్లు రష్యా అధ్యక్షుడు పుతిన్ చేసిన ప్రకటనపై మరోసారి స్పందించారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ. పుతిన్ అధ్యక్షుడిగా ఉన్నంత వరకు ఆదేశంతో చర్చలు జరపబోమని స్పష్టం చేశారు.
కాగా లుహాన్స్క్, దొనెట్స్క్, జపోరిజియా, ఖేర్సన్ ప్రాంతాలను విలీనం చేసుకున్నట్లు రష్యా ప్రకటించినా సరిహద్దుల విషయంలో గందరదోళం కనిపిస్తోంది.. రష్యా అక్రమించిన చాలా భాగాలను ఉక్రెయిన్ తిరిగి స్వాధీనం చేసుకుంటున్నట్లు ఉక్రెయిన్ సైన్యం తెలిపింది. దొనెట్స్క్ రీజియన్‌లోని లైమన్ నగరాన్ని మళ్లీ చేజిక్కించుకున్నట్లు పేర్కొంది. మాస్కో దళాల కీలక స్థావరంగా ఉన్న ఈ నగరాన్ని జెలన్‌స్కీ చుట్టుముట్టడతంతో భీకర కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. అయితే.. ఉక్రెయిన్ సైన్యం జరిపిన కాల్పుల్లో చాలామంది రష్యా సైనికులు మరణించినట్లు వార్తలు వస్తున్నాయి.
కాగా.. ఉక్రెయిన్‌లోని నాలుగు ప్రాంతాలను విలీనం చేసుకున్న రష్యా మీద అమెరికాలో కూడా నిరసనలు వ్యక్తమయ్యాయి. న్యూయార్క్‌లోని రష్యా కాన్సులేట్‌పై రెడ్ పెయింట్‌ను స్ప్రే చేశారు. రాత్రిపూట ఓ దుండగుడు రాత్రిపూట ఈ పని చేశాడు. దీనిపై రష్యా అసంతృప్తి వ్యక్తం చేసింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..