Russia Ukraine War Impact: అమెరికా, ఐరోపా ఆర్థిక దిగ్బంధనం.. ఏమాత్రం తగ్గని రష్యా ఆర్ధిక పరిస్థితి..
ఉక్రెయిన్‌పై రష్యా దాడి తర్వాత ముడి చమురు బ్యారెల్‌కు 139 డాలర్లకు చేరుకుంది. దీంతో గ్యాస్ ధరలు కూడా పెరిగాయి. ఇంధన ధరల పెరుగుదలతో రష్యా లాభపడింది.
ఉక్రెయిన్ పై రష్యా దాడి చేసిన తర్వాత అమెరికా (USA)తోపాటు యూరోపియన్ దేశాలు అలర్ట్ అయ్యాయి. ఆర్థిక సంక్షోభానికి దారితీస్తాయని భావించి రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధించాయి. గ్లోబల్ ఫైనాన్షియల్ సిస్టమ్ నుంచి ఆ దేశాన్ని వేరు చేయగలిగితే, యుద్ధంలో పోరాడటానికి రష్యాకు డబ్బు కొరత ఉంటుంది. అయితే ఈ ఆర్థిక ఆంక్షలు ఉన్నప్పటికీ, ఆర్థిక రంగంలో రష్యా మెరుగైన పనితీరు కనబరిచిందని అంతర్జాతీయ ద్రవ్య నిధి అంటే IMF అభిప్రాయపడింది.
ఆర్థిక ఆంక్షలతో తటస్థించిన రష్యా!
IMF ప్రకారం, పెరుగుతున్న ముడి చమురు, గ్యాస్ ధరల నుండి రష్యా చాలా లాభపడింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి తన తాజా వరల్డ్ ఎకనామిక్ ఔట్‌లుక్‌లో ఈ ఏడాది రష్యా ఆర్థిక వృద్ధి రేటు (GDP) అంచనాను 2.5 శాతానికి అప్‌గ్రేడ్ చేసింది. అయితే, ఆర్థిక వ్యవస్థ దాదాపు 6 శాతం మేర కుదించే అవకాశం ఉంది. IMF ప్రకారం, అమెరికా, చైనా ఆర్థిక వ్యవస్థలో మందగమనం ఉంది. కానీ రెండవ త్రైమాసికంలో, రష్యా ఆర్థిక వ్యవస్థ ఊహించిన దాని కంటే తక్కువగా క్షీణించింది. ముడి చమురు ధరల పెరుగుదల, ఇంధనేతర ఎగుమతులు ఆశించిన దానికంటే మెరుగైన పనితీరును కనబరిచాయి, ఇది రష్యాకు లాభించింది.
రష్యాలో డిమాండ్ తగ్గడం లేదు..
వాస్తవానికి, ఉక్రెయిన్‌పై రష్యా దాడి తర్వాత ముడి చమురు బ్యారెల్‌కు $ 139కి చేరుకుంది. దీంతో గ్యాస్ ధరలు కూడా పెరిగాయి. ఆర్థిక ఆంక్షలు ఉన్నప్పటికీ, దేశంలో విపరీతమైన డిమాండ్ ఉంది. ఇది రష్యన్ ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం చేకూర్చింది. రష్యా గ్యాస్‌పై ఆధారపడటం వల్ల ఐరోపా పరిస్థితి మరింత దిగజారింది. రష్యా ఐరోపాకు గ్యాస్ ఎగుమతులను నిషేధిస్తే, యూరోపియన్ యూనియన్ రష్యా చమురుపై ఆంక్షలు విధించినట్లయితే పరిస్థితి మరింత దిగజారవచ్చు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..