Russia – Ukraine Crisis: ప్రపంచాన్ని హడలెత్తిస్తోన్న రష్యా ‘డెడ్‌ హ్యాండ్‌’.. ఇది ఎంత ప్రమాదకరమో తెలుసా?

|

Mar 06, 2022 | 8:40 PM

Russia - Ukraine Crisis: ‘డెడ్‌ హ్యాండ్‌’.. ఇప్పుడిదే ప్రపంచాన్ని హడలెత్తిస్తోంది. డెడ్‌ హ్యాండ్‌ అలియాస్‌ పెరిమీటర్‌ అనే ఆటోమేటిక్ అణ్వాయుధ వ్యవస్థను..

Russia - Ukraine Crisis: ప్రపంచాన్ని హడలెత్తిస్తోన్న రష్యా ‘డెడ్‌ హ్యాండ్‌’.. ఇది ఎంత ప్రమాదకరమో తెలుసా?
Russia Dead Hand
Follow us on

Russia – Ukraine Crisis: ‘డెడ్‌ హ్యాండ్‌’.. ఇప్పుడిదే ప్రపంచాన్ని హడలెత్తిస్తోంది. డెడ్‌ హ్యాండ్‌ అలియాస్‌ పెరిమీటర్‌ అనే ఆటోమేటిక్ అణ్వాయుధ వ్యవస్థను అస్త్రంగా.. తాము ప్రయోగిస్తే ప్రపంచపటంలో ఏ దేశమూ మిగలదని రష్యా హెచ్చరిస్తోంది. పొరపాటున రష్యాపై ఎవరైనా దాడి చేస్తే, ఆ సమయానికి అణ్వాయుధాలను అధికారులు కూడా యాక్టివేట్ చేయలేని పరిస్థితులు వస్తే.. దానతంట అదే ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అయ్యేలా ఈ డెడ్ హ్యాండ్‌ను రూపొందించింది రష్యా.

రష్యా దగ్గర అణ్వాయుధాలు ప్రయోగించే 700 వాహకాలు ఉన్నాయి. వీటిల్లో స్ట్రాటజిక్‌ బాంబర్లు, నూక్లియర్‌ సబ్‌మెరైన్లు, భూగర్భ బొరియల్లో దాచిన ఖండాంతర క్షిపణులు ఉన్నాయి. వీటిలో కొన్ని ఆటోమేటిక్‌గ్గా శత్రువులపై దాడి చేయగలవు. అటువంటి వ్యవస్థే.. డెడ్‌ హ్యాండ్‌..! దీన్నే ఇప్పుడు రష్యా సిద్ధం చేసింది.

మామలూగా ఒకదేశం మరోదేశంపై అణుదాడి చేస్తే దాడికి గురైన దేశం తిరిగి అణుదాడిని చేసే అవకాశాలు 99 శాతం ఉండదు. ఎందుకంటే అణుదాడి కారణంగా ఉత్పన్నమైన పరిస్థితుల నుండి బయటపడేందుకే సమయం మొత్తం సరిపోతుంది. కాబట్టే ఎదురుదాడికి అవకాశాలు దాదాపు ఉండదని విశ్లేషకుల అభిప్రాయం. అయితే ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే రష్యా ప్రత్యామ్నాయ వ్యవస్ధ.. డెడ్‌ హ్యాండ్‌ను ఏర్పాటు చేసుకుంది.

సోవియట్‌ శాస్త్రవేత్తలు వినూత్నమైన ఆలోచనతో దీని రూపుకల్పన చేశారు. అత్యంత శక్తిమంతమైన కమ్యూనికేషన్‌ వ్యవస్థను దీని వార్‌హెడ్‌లో అమర్చారు. ఇది దేశంలోని వివిధ రహస్య ప్రాంతాల్లోని భూగర్భ బొరియలు, ఇతర చోట్ల భద్రపర్చిన అణు క్షిపణులకు దాడికి సంబంధించి ఆదేశాలు జారీ చేస్తుంది. ఇందుకోసం రష్యా రాడార్లు, శాటిలైట్లతో సమన్వయం చేసుకొంటూ ఈ వ్యవస్థ పనిచేస్తుంది.

రష్యాపై అణుదాడి జరగ్గానే దేశంలోని వివిధ చోట్ల ఏర్పాటు చేసిన సెన్సార్ల ఆధారంగా ‘డెడ్ హ్యాండ్’ ఆటోమేటిగ్గా యాక్టివేట్ అయిపోతుంది. ఇది యాక్టివేట్ అవటానికి కేంద్ర సైనికాధికారులకు సంకేతాలు పంపుతుంది. నిర్దిష్టమైన సమయంలోగా కమాండ్ రాకపోతే తర్వాత తనంతట తానుగానే యాక్టివేట్ అయిపోతాయి. ఒక్కసారి ‘డెడ్‌ హ్యాండ్‌’ యాక్టివేట్‌ అయితే.. ఇక ప్రపంచ వినాశనం తప్పదని హెచ్చరిస్తున్నారు రక్షణ నిపుణులు. అందుకే.. ఇప్పుడు ఈ ‘డెడ్‌ హ్యాండ్‌’పై ప్రపంచ వ్యాప్తంగా భయాందోళనలు రేగుతున్నాయి.

Also read:

ఉద్యోగులకు గమనిక.. భవిష్యత్‌లో ఆర్థిక ఇబ్బందులు ఉండొద్దంటే ఈ పని ఇప్పుడే చేయండి..!

మేరీ కోమ్ సంచలన నిర్ణయం.. ఆ పోటీలకు దూరం.. కారణం ఏంటో తెలిస్తే

Health Tips: అన్నం తింటూ మధ్యలో నీళ్లు తాగడం మంచిది కాదా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..?