AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Taliban: రష్యా తప్పటడుగులు.. ఆఫ్గనిస్థాన్‌పై మాస్కోలో జరిగే చర్చలకు తాలిబన్లకు ఆహ్వానం

Russian President Vladimir Putin: శత్రువుకు శత్రువు మిత్రుడు అవుతాడని నానుడి. పలు ప్రపంచ దేశాలు మధ్య మైత్రీ సంబంధాల విషయంలోనూ ఇదే లాజిక్కు పనిచేస్తోంది. ఇప్పుడు తాలిబన్ల విషయంలో చైనా, రష్యా విధానం కూడా ఇదే.

Taliban: రష్యా తప్పటడుగులు.. ఆఫ్గనిస్థాన్‌పై మాస్కోలో జరిగే చర్చలకు తాలిబన్లకు ఆహ్వానం
Russian President Vladimir Putin
Janardhan Veluru
|

Updated on: Oct 07, 2021 | 6:00 PM

Share

Afghanistan – Taliban Crisis: శత్రువుకు శత్రువు మిత్రుడు అవుతాడని నానుడి. పలు ప్రపంచ దేశాలు మధ్య మైత్రీ సంబంధాల విషయంలోనూ ఇదే లాజిక్కు పనిచేస్తోంది. ఇప్పుడు తాలిబన్ల విషయంలో చైనా, రష్యా విధానం కూడా ఇదే. తమ శత్రుదేశమైన అమెరికాకు ఏ మాత్రం గిట్టని తాలిబన్లు ఆఫ్గనిస్థాన్‌లో మళ్లీ పాలనా పగ్గాలు చేపట్టడంతో ఆ రెండు దేశాలు తెగ సంబరపడిపోతున్నాయి. ఓ రకంగా ఆ రెండు దేశాలు తాలిబన్లను తమ భుజాలపై కూర్చోబెట్టుకుని ఊరేగుతున్నాయి. పాకిస్థాన్‌తో పాటు చైనా, రష్యాలు తమ మాటలు, చేతల్లోనూ తాలిబన్ల పట్ల తమ అవాజ్య ప్రేమను చాటుకుంటున్నాయి. ఓ రకంగా అమెరికాపై ధ్వేషంతో ఆ దేశాలు పాముకు పాలుపోసి పెంచుతున్నాయా? అన్న సందేహం కలగకమానదు.

ఇప్పుడు తాలిబన్లకు అంతర్జాతీయ సమాజం ఆమోదం లభించేందుకు రష్యా ప్రత్యేక చొరవచూపుతోంది. ఇందులో భాగంగా ఆఫ్గనిస్థాన్ అంశంపై ఈ నెల 20న మాస్కోలో జరిగే అంతర్జాతీయ చర్చలకు (మాస్కో ఫార్మెట్) తాలిబన్ ప్రతినిధులను కూడా ఆహ్వానించాలని పుతిన్ పాలనలోని రష్యా నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని ఆఫ్గనిస్థాన్ వ్యవహారాలను రష్యా అధ్యక్షుడి తరఫున పర్యవేక్షిస్తున్న ప్రత్యేక దౌత్యాధికారి జమీర్ కుబులోవ్ ధృవీకరించారు. అయితే తాలిబన్ల ప్రతినిధులు ఏ స్థాయి వారు ఈ సదస్సుకు హాజరవుతారో ఆయన వెల్లడించలేదు.

ఆరు దేశాల మధ్య పరస్పర సహకారం కోసం 2017 నుంచి మాస్కో ఫార్మెట్‌ నిర్వహిస్తున్నారు. రష్యా, ఆఫ్గనిస్థాన్, చైనా, పాకిస్థాన్, ఇరాన్, భారత్‌ల మధ్య సహకారం కోసం ఇది నిర్వహిస్తున్నారు. ఆగస్టు 15న ఆఫ్గనిస్థాన్ రాజధాని నగరం కాబూల్‌ను తమ ఆధీనంలోకి తీసుకోవడంతో ఆ దేశ పాలనా పగ్గాలు తాలిబన్ల వశమయ్యింది. అయితే తాలిబన్లను పలు దేశాలు గుర్తించడం లేదు.

అయితే తాలిబన్ ప్రతినిధులు పాల్గొనే ఈ సదస్సుకు ఏయే దేశాలు హాజరవుతాయన్నది ఆసక్తికర అంశంగా మారింది. మరీ ముఖ్యంగా ఈ సదస్సు విషయంలో భారత ప్రభుత్వం ఎలాంటి వైఖరి తీసుకోబోతుందన్న అంశం ఆసక్తిరేపుతోంది.

Also Read..

Nobel Prize in Literature: సాహిత్యంలో అత్యంత ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతి విజేత అబ్దుల్‌రాజాక్ గుర్నా.. ప్రకటించిన కమిటీ!

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ వల్ల జరిగిన మొదటి మంచి పని ఇదేనట.. కామెంట్ చేస్తున్న నెటిజన్లు..