AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tsunami Video: రష్యాలో భూకంపం, సునామీ బీభత్సం దృశ్యాలు… సోషల్‌ మీడియాలో వీడియోలు వైరల్‌…

రష్యాను భారీ భూకంపం కుదిపేసింది. 8.8గా తీవ్రత నమోదైంది. దీంతో రష్యా, జపాన్‌లో సునామీ బీభత్సం సృష్టించింది. రష్యా కురిల్ దీవులలోని సెవెరో-కురిల్స్క్‌లో 3-4 మీటర్ల ఎత్తున సునామీ అలలు విరుచుకుపడ్డాయి. దీంతో తీర ప్రాంత భవనాలు నీట మునిగాయి. రష్యాలోని సెవెరో-కురిల్స్క్ పట్టణంలో ఓడరేవు మునిగిపోయింది. జపాన్‌లోని హొక్కైడోలోని...

Tsunami Video: రష్యాలో భూకంపం, సునామీ బీభత్సం దృశ్యాలు... సోషల్‌ మీడియాలో వీడియోలు వైరల్‌...
Russia Tsunami
K Sammaiah
|

Updated on: Jul 30, 2025 | 12:30 PM

Share

రష్యాను భారీ భూకంపం కుదిపేసింది. 8.8గా తీవ్రత నమోదైంది. దీంతో రష్యా, జపాన్‌లో సునామీ బీభత్సం సృష్టించింది. రష్యా కురిల్ దీవులలోని సెవెరో-కురిల్స్క్‌లో 3-4 మీటర్ల ఎత్తున సునామీ అలలు విరుచుకుపడ్డాయి. దీంతో తీర ప్రాంత భవనాలు నీట మునిగాయి. రష్యాలోని సెవెరో-కురిల్స్క్ పట్టణంలో ఓడరేవు మునిగిపోయింది. జపాన్‌లోని హొక్కైడోలోని నెమురో హనసాకి ఓడరేవులో 30 సెం.మీ. (1 అడుగు) ఎత్తులో మొదటి సునామీ అల నమోదైంది. జపాన్‌లోని హొక్కైడోలోని తీరప్రాంతంలో గోదాములు సునామీ అలల ధాటికి కొట్టుకుపోయాయి. 1952 తర్వాత కమ్చట్కా ప్రాంతంలో సంభవించిన అత్యంత శక్తివంతమైన భూకంపం ఇది అని చెబుతున్నారు.

ఇక హవాయి, అలాస్కా, అమెరికా పశ్చిమ తీరం, జపాన్, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, ఈక్వెడార్, చిలీ, గ్వాటెమాల, కోస్టా రికా, పెరూ, మెక్సికో, ఇతర పసిఫిక్ దీవులకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. హవాయిలో తీరప్రాంతవాసులను ఎత్తైన ప్రాంతాలకు లేదా భవనాల 4వ అంతస్తుకు వెళ్లాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు అధికారులు. జపాన్‌లో హొక్కైడో నుంచి ఒకినావా వరకు 900,000 మందికి పైగా ప్రజలకు ఖాళీ చేయమని సూచించారు.

భూకంపం, సునామికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వీడియోలు చూడండి: