AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత్‌కు వెళ్లిపో.. ఆస్ట్రేలియాలో మరోసారి రెచ్చిపోయిన రేసిస్టులు.. విద్యార్ధిపై క్రూరంగా దాడి

ఆస్ట్రేలియాలో మరోసారి రేసిజం దాడి జరిగింది. ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌లో ఓ భారతీయ విద్యార్థిపై కొందరు దుండగులు దాడికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. అడిలైడ్‌లో భారత్‌కు చెందిన చరణ్‌ప్రీత్‌ సింగ్‌ తన భార్యతో కలిసి బయటకు వెళ్లాడు. ఈ క్రమంలో తమ కారును ఓ పక్కన పార్క్‌ చేసి నడుస్తుండగా..

భారత్‌కు వెళ్లిపో.. ఆస్ట్రేలియాలో మరోసారి రెచ్చిపోయిన రేసిస్టులు.. విద్యార్ధిపై క్రూరంగా దాడి
Racist Attack on Indian Student in Adelaide
Shaik Madar Saheb
|

Updated on: Jul 23, 2025 | 1:46 PM

Share

ఆస్ట్రేలియాలో మరోసారి రేసిజం దాడి జరిగింది. ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌లో ఓ భారతీయ విద్యార్థిపై కొందరు దుండగులు దాడికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. అడిలైడ్‌లో భారత్‌కు చెందిన చరణ్‌ప్రీత్‌ సింగ్‌ తన భార్యతో కలిసి బయటకు వెళ్లాడు. ఈ క్రమంలో తమ కారును ఓ పక్కన పార్క్‌ చేసి నడుస్తుండగా.. ఐదుగురు దుండగులు వేరే వాహనంలో అక్కడికి వచ్చి చరణ్‌పై దాడికి దిగారు. పదునైన వస్తువులతో కొడుతూ.. అతన్ని దూషించారు. ఈ ఘటనలో చరణ్‌ ముఖం, వెనక వీపు భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. అపస్మారక స్థితిలో ఉన్న అతడిని స్థానికులు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స అందుతోందని.. పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొంటున్నారు..

దాడి సమయంలో దుండగులు.. చరణ్ ప్రీత్ ను దూషించారు.. వెంటనే భారత్‌కు వెళ్లిపోపాలని చర్‌ప్రీత్‌ను బెదిరించడం కలకలం రేపింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.. కారు పార్కింగ్‌ వివాదం కారణంగానే ఈ గొడవ జరిగినట్టు చెబుతున్నారు. దుండగుల దాడితో తీవ్ర షాక్‌లో ఉన్నారు చరణ్‌ప్రీత్‌. వెంటనే భారత్‌కు తిరిగి వెళ్లిపోవాలని ఉందంటూ ఆవేదన వ్యక్తంచేశారు.

ఇవి కూడా చదవండి

వీడియో..

కాగా.. ఘటనపై ఆస్ట్రేలియా పోలీసులు చర్యలు తీసుకున్నారు. దాడికి పాల్పడిన వారిలో ఒకరిని అరెస్ట్‌ చేశారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా మిగిలిన వారిని కూడా పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

దక్షిణ ఆస్ట్రేలియా ప్రీమియర్‌ పీటర్‌ మాలినాస్కస్ ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. ఇలాంటి జాత్యహంకార దాడులను సహించేది లేదని పేర్కొన్నారు.

మరిన్ని అంతర్జాతీయం వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..