AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: ఆహ్మదాబాద్ సీన్ రిపీట్.. టేకాఫ్ అయిన కాసేపటికే కుప్పకూలిన విమానం.. ఎంతమంది చనిపోయాంటే?

సౌతాఫ్రికాలోని వెనిజులాలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. PA-31 అనే ఒక ప్రైవేట్ విమానం రన్‌వే నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ప్రమాదానికి గురైంది. ఆ విమానంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Watch: ఆహ్మదాబాద్ సీన్ రిపీట్.. టేకాఫ్ అయిన కాసేపటికే కుప్పకూలిన విమానం.. ఎంతమంది చనిపోయాంటే?
Plane Crash
Anand T
|

Updated on: Oct 23, 2025 | 3:15 PM

Share

గురువారం సౌతాఫ్రికాలోని వెనిజులాలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. పారామిల్లో విమానాశ్రయం నుండి టేకాఫ్ అయిన PA-31 అనే ప్రైవేటు విమానం.. కొద్ది సేపట్లోనే ప్రమాదానికి గురైంది. విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో విమానం గాల్లోంచి వేంగంగా దూసుకొచ్చి నేలపై కుప్పకూలింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్‌ వీడియో ప్రకారం.. రన్‌వే ఉనంచి టేకాఫ్‌ అయిన PA-31 కొద్ది క్షణాల్లోనే మంటలు చెలరేగి రన్‌వేపై కుప్పకూలింది. భారీ శబ్ధం రావడంతో అలర్టైన ఎయిర్‌పోర్ట్ సిబ్బంది, ఫైర్ డిపార్ట్‌మెంట్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. కాని అప్పటికే అందులో ప్రయాణిస్తున్న వారిలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

వీడియో చూడండి..

మృతులను టోనీ బోర్టన్, జువాన్ మాల్డోనాడోగా గుర్తించారు. ఇద్దరూ సంఘటనా స్థలంలోనే మరణించగా, మరో ఇద్దరు ప్రయాణికుల పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రిలో చేరారు. అగ్నిమాపక దళం, సివిల్ ప్రొటెక్షన్ టీం, బొలివేరియన్ నేషనల్ పోలీస్ (PNB) వెంటనే స్పందించి సహాయ, సహాయ చర్యలను చేపట్టారు.

స్థానిక నివేదికల ప్రకారం, ఆ విమానాన్ని ప్రభుత్వ లాజిస్టిక్స్ కార్యకలాపాల్లో వాడుతున్నట్టు తెలుస్తోంది. పైపర్ చెయెన్ (PA-31T1) మొడల్‌ విమానాన్ని అమెరికన్ కంపెనీ అయిన పైపర్ ఎయిర్‌క్రాఫ్ట్ 1970లో తయారు చేసింది. అయితే ఈ ట్విన్-ఇంజన్ విమానం పనితీరు, భద్రతకు ప్రసిద్ధి చెందింనదిగా పెరున్నపటికీ ప్రమదానికి గురికావడంతో దీనిపై దర్యాప్తు చేపట్టారు అధికారులు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కొత్త జీతం ఎలా నిర్ణయిస్తారు..? 8వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం..
కొత్త జీతం ఎలా నిర్ణయిస్తారు..? 8వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం..
మరోవారంలో MAT 2025 రాత పరీక్ష.. దరఖాస్తుకు మరికొన్ని గంటలే ఛాన్స్
మరోవారంలో MAT 2025 రాత పరీక్ష.. దరఖాస్తుకు మరికొన్ని గంటలే ఛాన్స్
SBIలో తక్కువ వడ్డీకే లోన్లు.. నేటి నుంచే ప్రారంభం!
SBIలో తక్కువ వడ్డీకే లోన్లు.. నేటి నుంచే ప్రారంభం!
తెలుగు రాష్ట్రాల్లో భగ్గుమంటున్న బంగారం ధరలు.. వెండి రికార్డ్
తెలుగు రాష్ట్రాల్లో భగ్గుమంటున్న బంగారం ధరలు.. వెండి రికార్డ్
RBI సమ్మర్ ఇంటర్న్‌షిప్‌కు 2026 దరఖాస్తు చేశారా? చివరి ఛాన్స్ ఇదే
RBI సమ్మర్ ఇంటర్న్‌షిప్‌కు 2026 దరఖాస్తు చేశారా? చివరి ఛాన్స్ ఇదే
గూగుల్‌ సరికొత్త ఫీచర్‌ తీసుకొచ్చిన! 70 భాషలు మీకు వచ్చేసినట్టే..
గూగుల్‌ సరికొత్త ఫీచర్‌ తీసుకొచ్చిన! 70 భాషలు మీకు వచ్చేసినట్టే..
JEE Advanced 2026 పరీక్ష సిలబస్‌ విడుదల.. డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదిగో
JEE Advanced 2026 పరీక్ష సిలబస్‌ విడుదల.. డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదిగో
టీవీ కొనాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడే కొనేయండి.. లేదంటే..
టీవీ కొనాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడే కొనేయండి.. లేదంటే..
12 రాశులవారికి సోమవారం నాటి రాశిఫలాలు
12 రాశులవారికి సోమవారం నాటి రాశిఫలాలు
ఆపరేషన్‌ కగార్‌లో జప్తు చేసిన నక్సల్ ఆస్తులు ఎంతంటే?
ఆపరేషన్‌ కగార్‌లో జప్తు చేసిన నక్సల్ ఆస్తులు ఎంతంటే?