AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సంతోషానికి ఆ దేశం కేరాఫ్ అడ్రస్.. వారి వింత సంస్కృతి గురించి తెలిస్తే విస్తుపోవాల్సిందే..!

ఫిన్లాండ్ వరుసగా ఎనిమిది సంవత్సరాలుగా ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా ర్యాంక్ పొందింది. దాని ప్రత్యేక సంస్కృతి, సౌనా బాత్, అక్కడ జరిగే వ్యాపార సమావేశాలు బయటివారికి వింతగా అనిపించవచ్చు. అయితే ఆ దేశ ప్రజల ఆరోగ్యం, ఆనందం, స్వేచ్ఛా జీవనశైలికి ఇవే కారణాలు. ఇక్కడ మంచి పని-జీవిత సమతుల్యత ఆ దేశ ప్రజలు చాలా సంతోషంగా ఉండేలా చేస్తుంది.

సంతోషానికి ఆ దేశం కేరాఫ్ అడ్రస్.. వారి వింత సంస్కృతి గురించి తెలిస్తే విస్తుపోవాల్సిందే..!
Worlds Happiest Nation
Surya Kala
|

Updated on: Oct 23, 2025 | 1:17 PM

Share

ప్రతి దేశానికి దాని సొంత సంస్కృతి ఉంటుంది. ఇది ఇతర దేశాలకు వింతగా అనిపించవచ్చు. అయితే దానికి ఒక కారణం ఉంటుది. ఇప్పుడు మనం ఫిన్లాండ్ దేశానికి సంబంధించిన వింత సంస్కృతి గురించి తెలుసుకుందాం.. అవును ఈ దేశంలో కొంత వింత సంస్కృతి ఉంది. అంతేకాదు ఇది ప్రపంచంలోనే అత్యంత అందమైన, సంతోషకరమైన దేశం. ఇక్కడి జీవనశైలి భిన్నంగా ఉంటుంది. ఆచారాలు, నమ్మకాలు కూడా భిన్నంగా ఉంటాయి. ఒక నివేదిక ప్రకారం ఇక్కడ 7.741% మంది ప్రజలు సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నారని చెబుతారు. కనుక ఫిన్లాండ్ వరుసగా ఎనిమిది సంవత్సరాలుగా ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా పేరుపొందింది. ఇక్కడ కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. అది ఏమిటో ఓ లుక్ వేయండి

ఫిన్లాండ్‌లో సౌనా బాత్ , స్టీమ్ బాత్ అనే సంప్రదాయం ఉంది. ఇది ఒక పురాతన సంస్కృతి. ఇది శరీర ఆరోగ్యంపై ప్రయోజనకరమైన ప్రభావాలను చూపుతుంది. ఇది చెక్క పలకలతో తయారు చేయబడిన ఒక చిన్న గది, దీనిలో వేడిని ఉత్పత్తి చేయడానికి రాళ్లపై నీటిని పోస్తారు. దీని ద్వారా నీటి ఆవిరితో వేడి ఉష్ణోగ్రత సృష్టించబడుతుంది. ఇలా చేసే స్నానాన్ని సౌనా బాత్ అంటారు. ఇది రక్తపోటు, మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. కండరాలను బలపరుస్తుంది.

ఇవి కూడా చదవండి

వైరల్ పోస్ట్ ఇక్కడ ఉంది:

ఇక్కడ బట్టలు లేకుండా తిరగడాన్ని కూడా చాలా సాధారణంగా తీసుకుంటారు. ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఇది ఇక్కడి ఆచారం. అనేకాదు అన్ని రకాల వ్యాపార లావాదేవీలు, వ్యాపార సమావేశాలు సౌనాలోనే జరుగుతాయి. సౌనాలో జరిగే ఏ చర్చ అయినా బయటకు రాదని ఇక్కడి ప్రజలు నమ్ముతారు. విచిత్రం ఏమిటంటే ఇక్కడ సమావేశాలు బట్టలు లేకుండా ఉన్నా కూడా  జరుగుతాయి. దీని గురించి ఒక వీడియోను tanyakhanijow అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు.

ఈ దేశం ఎందుకు ఇంత సంతోషంగా ఉంది? ఇక్కడ ఏ విషయంలోనూ సిగ్గు పడరు. ప్రతిదీ స్వేచ్ఛగా జరుగుతుంది. ఉద్యోగ్గులు తమ యజమానులతో స్నానం చేసే ప్రదేశంలో సమావేశం కూడా అవుతారు. ఇక్కడ వారు 5 రోజులు మాత్రమే పని చేస్తారు. మిగిలిన రోజులు సెలవు. అది కూడా జీతంతో. ఇక్కడ మీరు మీ పనిని మీకు నచ్చిన విధంగా చేయవచ్చు. అంటే మీరు మీ పనిని 4 గంటలకు కూడా పూర్తి చేయవచ్చు.

మరిన్ని  వైరల్ వార్తలు చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి