Viral Video: నీ పిచ్చి తగలెట్టా తల్లో.. రీల్స్ పిచ్చితో ఒంటిపై చీరకు నిప్పు పెట్టి డ్యాన్స్.. చివరకు..
Viral Video: వినోదం పేరుతో మనకి మనం లేదా లేదా మరెవరినైనా హాని చేసుకోవడం తప్పు. కానీ, రీల్స్ మోజులో పడిన జనాలు.. పిచ్చి పిచ్చి ఆలోచనలతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. రీల్స్ మత్తులో పడి ప్రాణాలను సైతం ఫనంగా పెడుతున్నారు. తాజాగా ఓ మహిళ కూడా ఇలాంటి ప్రయత్నమే చేసింది.

Viral Video: సోషల్ మీడియాలో ‘వైరల్’ కావాలనే ఉద్దేశంతో కొందరు వ్యక్తులు చేస్తున్న సాహసాలు, ప్రమాదకరమైన చర్యలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ‘లైక్‌లు’, ‘వ్యూస్’ కోసం ఏకంగా తమ ప్రాణాలను కూడా పణంగా పెడుతున్నారు. ఇలాంటి కోవకే చెందిన ఒక మహిళకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వైరల్ అవుతున్న వీడియోలో ఒక మహిళ రీల్స్ చేయడానికి ఎంతటి ప్రమాదకరమైన పని చేసిందో చూస్తే ఆశ్చర్యపోతారు. ఆమె కట్టుకున్న చీర పైటకు తానే నిప్పు అంటించుకుంది. చీర మండుతుండగానే ఆమె డ్యాన్స్ చేస్తూ, పైటను అటూ ఇటూ తిప్పుతూ స్టెప్పులేసింది. పక్కనే నిలబడిన ఒక వ్యక్తి ఈ మొత్తం దృశ్యాన్ని తన కెమెరాలో బంధించడం గమనార్హం.
మొదట్లో అంతా సరదాగా అనిపించినా, కొద్ది క్షణాల్లోనే మంటలు చీరపై వేగంగా వ్యాపించడం మొదలయ్యాయి. అప్పుడు ఆ మహిళకు పరిస్థితి చేయి దాటిపోయినట్లు అనిపించింది. వెంటనే తేరుకుని, తనను తాను రక్షించుకోవడానికి హడావిడిగా చీరను విప్పేసింది. ఈ దృశ్యం చూసిన నెటిజన్లు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. కొద్ది సెకన్ల ‘వైరల్ రీల్’ కోసం ప్రాణాలను ప్రమాదంలో పడేయడం ఎంత మాత్రం తెలివైన పని కాదని కామెంట్లు చేస్తున్నారు.
“जब आप तय कर लें कि रील बनेगी, चाहे लाइफ रहे या न रहे! 🤯”आपको क्या लगता है रील जरूरी है या जीवन (कृपया इसे नकल करने की कोशिश न करें) pic.twitter.com/Qi9S3g3JVY
— Mahesh Chandra Bhatt (@maheshb20727795) October 17, 2025
ఈ షాకింగ్ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో @maheshb20727795 అనే ఐడితో షేర్ చేశారు. ఈ 12 సెకన్ల వీడియోను ఇప్పటికే 100,000 సార్లు వీక్షించారు. ఈ వీడియోపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. “ఇదేం పిచ్చి?”, “రీల్స్ పిచ్చి ఇంత ప్రమాదకరంగా మారిందా?” అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇలాంటి పిచ్చి సాహసాలు ఇతరులకు కూడా తప్పుడు సందేశాన్ని ఇస్తాయని, వెంటనే ఇలాంటివి ఆపేయాలని సూచిస్తున్నారు. వ్యూస్, లైక్‌ల కోసం ప్రజలు తమ జీవితాలను ప్రమాదంలో పడేయడం ఎంతమాత్రం సరికాదని, ఇలాంటి ప్రయత్నాలను ఎవరూ అనుకరించవద్దని హెచ్చరిస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




