Rishi Sunak: బ్రిటన్‌లో మరోసారి రాజకీయ సంక్షోభం.. రిషి సునాక్ ప్రధాని అంటూ జోరుగా బెట్టింగ్‌లు..

|

Oct 16, 2022 | 9:52 PM

బ్రిటన్‌లో మరోసారి రాజకీయ సంక్షోభం తలెత్తింది. లిజ్‌ ట్రస్‌ పన్నుల విధానంపైన సర్వత్రా విమర్శలు నెలకొన్నాయి. దీంతో రిషి సునాక్ ప్రధాని అవుతారంటూ బ్రిటన్‎లో జోరుగా బెట్టింగ్ సాగుతోంది..

Rishi Sunak: బ్రిటన్‌లో మరోసారి రాజకీయ సంక్షోభం.. రిషి సునాక్ ప్రధాని అంటూ జోరుగా బెట్టింగ్‌లు..
Britian PM Liz Truss Vs Rishi sunak
Follow us on

బ్రిటన్‌లో మరోసారి రాజకీయ సంక్షోభం తలెత్తింది. లిజ్‌ ట్రస్‌ పన్నుల విధానంపైన సర్వత్రా విమర్శలు నెలకొన్నాయి. దీంతో రిషి సునాక్ ప్రధాని అవుతారంటూ బ్రిటన్‎లో జోరుగా బెట్టింగ్ సాగుతోంది.

బ్రిటన్‌ ప్రధాని లిజ్ ట్రస్ అధికారం చేపట్టిన కొన్నిరోజులకే సొంత పార్టీలో సంక్షోభం నెలకొంది. ఆర్థిక మార్కెట్లలోనూ ట్రస్ విధానాల పట్ల వ్యతిరేకత నెలకొంది.ట్రస్‌ను దించి మాజీ మంత్రి రిషి సునాక్‌ను తెరపైకి తెచ్చేందుకు రంగం సిద్ధమవుతుందన్న విషయం బహిర్గతమైంది. ట్రస్ సారథ్యంలో ప్రవేశ పెట్టిన మినీ బడ్జెట్ దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలై గందరగోళానికి దారి తీసింది. దీంతో ఆర్థిక మాంద్యం తలెత్తుతుందన్న ఆందోళనలు అధికమయ్యాయి.దాంతో ఆమె స్థానంలో రిషి సునాక్ బ్రిటన్ ప్రధాని పదవిని చేపడతాడంటూ జోరుగా బెట్టింగులు సాగుతున్నాయి. లిజ్ ట్రస్ తన సన్నిహితుడు క్వాసీ కార్టెంగ్‌ను ఆర్థికమంత్రి పదవి నుంచి తప్పించారు. ట్రస్ ఆర్థిక విధానాల అమలు బాధ్యతలను క్వాసీనే పర్యవేక్షిస్తున్నాడు.

ఇవి కూడా చదవండి

ఆర్థిక సంక్షోభ పరిస్థితులు అధికార కన్జర్వేటివ్ పార్టీకి అడ్డంకిగా మారాయి. పార్టీలో 62శాతం మంది నేతలు తాము తప్పుడు అభ్యర్థిని ఎన్నకున్నమన్న భావనలో ఉన్నట్లు ది టైమ్స్ నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో వెల్లడైంది.15శాతం మంది మాత్రమే తమ నిర్ణయం సరైందన్న అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ నేపథ్యంలో బ్రిటన్‌లో పందాలు మొదలయ్యాయి. ట్రస్ ప్రధాని పదవి నుంచి దిగిపోవడం ఖాయమని, రిషి సునాక్ పగ్గాలు అందుకుంటారని అత్యధికులు పందాలు కాస్తున్నారు. బెట్టింగ్ సంస్థల ట్రెండ్స్ కూడా రిషి సునాకే ఫేవరెట్ అని సూచిస్తున్నాయి.ఇటీవల ఎన్నికల్లో పోరాడిన రిషి సునాక్ తాజా పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.కొన్ని రోజుల కిందట ఆయన ఏర్పాటు చేసిన రెండు విందు కార్యక్రమాలు ఈ కోవలోకే వస్తాయని బ్రిటన్ మీడియా తెలిపింది.