US Embassy: లండన్‌ US ఎంబసీ వద్ద అనుమానాస్పద ప్యాకెట్.. కొంతసేపు భవనంలోనే బందీలుగా మారిన సందర్శకులు

|

Feb 22, 2023 | 6:52 PM

'యుఎస్ ఎంబసీలో తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని.. సాధారణ కార్యకలాపాలు జరుగుతున్నాయని పేర్కొంది. అనుమానాస్పద వస్తువును అధికారులు పరిశీలించి తొలగించారని వెల్లడించింది. తనిఖీలు చేస్తున్న సమయంలో సహకరించిన సందర్శకులకు ఎంబసీ కృతజ్ఞతలు తెలిపింది.

US Embassy: లండన్‌ US ఎంబసీ వద్ద అనుమానాస్పద ప్యాకెట్.. కొంతసేపు భవనంలోనే బందీలుగా మారిన సందర్శకులు
Us Embassy In Uk
Follow us on

లండన్‌లోని అమెరికన్ ఎంబసీ వద్ద అనుమానాస్పద అంశం వెలుగుచూడడంతో కలకలం రేగింది. వెంటనే అధికారులు స్పందించి  భద్రతా హెచ్చరిక జారీ చేశారు. దౌత్యకార్యాలయంలోని వారిని కిటికీల నుంచి దూరంగా వెళ్లమని కోరారు. ఈ సమయంలో.. రాయబార కార్యాలయాన్ని కొంతకాలం లాక్డౌన్ స్థితిలో ఉంచారు. ప్రజలందరూ కొంతసేపు భవనంలోనే బందీలుగా మారారు.

పోలీసుల చెప్పిన సమాచారం ప్రకారం.. ఉదయం ఎంబసీ సమీపంలో అనుమానాస్పద వస్తువును ఉన్నట్లు ఇంటెలిజెన్స్‌కు సమాచారం అందింది. భద్రతా కారణాల దృష్ట్యా వెంటనే హెచ్చరిక జారీ చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసు సిబ్బంది తనిఖీలు చేశారు. తర్వాత ఈ అలారం తప్పుగా మ్రోగినట్లు గుర్తించారు.

ఇవి కూడా చదవండి

ఎంబసీ ఇదే విషయంపై ట్వీట్‌ చేసింది. ‘యుఎస్ ఎంబసీలో తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని.. సాధారణ కార్యకలాపాలు జరుగుతున్నాయని పేర్కొంది. అనుమానాస్పద వస్తువును అధికారులు పరిశీలించి తొలగించారని వెల్లడించింది. తనిఖీలు చేస్తున్న సమయంలో సహకరించిన సందర్శకులకు ఎంబసీ కృతజ్ఞతలు తెలిపింది.

US ఎంబసీ సాధారణ వ్యాపార కార్యకలాపాలు మొదలయ్యాయి. స్థానిక అధికారులు దర్యాప్తు చేసి ఎంబసీ వెలుపల అనుమానాస్పద ప్యాకేజీని క్లియర్ చేశారు. వేగంగా స్పందించి.. చర్యలు తీసుకున్నందుకు పోలీసులకు థాంక్స్ చెప్పారు. అదే సమయంలో ఎంబసీలో ఉన్న సందర్శకులు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెప్పారు ఎంబసీ సిబ్బంది.

US ఎంబసీ లండన్

ఈ అనుమానాస్పద వస్తువులు కనిపించిన వెంటనే.. భద్రతా హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు లోపల ఉండాలని..  కిటికీలకు దూరంగా ఉండాలని చెప్పారు. ఈ సమయంలో.. ఎంబసీ లోపల ఉన్న ప్రజలు సురక్షిత ప్రాంతానికి వెళ్లాలని కోరారు.

ఎంబసీ నుండి బయటకు వచ్చిన చిత్రాల్లో.. ఎంబసీ లోపల కొంతమంది వ్యక్తులు కనిపించారు. వీరిలో కొందరు చిన్న పిల్లలు కూడా ఉన్నారు. సందర్శకులు కిటికీలకు దూరంగా నేలపై కూర్చుని కనిపిస్తున్నారు. ఈ సమయంలో, సాయుధ పోలీసులు రాయబార కార్యాలయంలోకి వెళ్లారు. వెంటనే చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులు డాగ్ స్క్వాడ్‌తో ఘటనా స్థలానికి చేరుకుని తనిఖీలు చేశారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..