AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: తవ్వకాల్లో బయటపడ్డ పురాతన ఫ్రిడ్జ్.. అందులో ఏముందో చూడగా దెబ్బకు ఫ్యూజులు ఔట్..

పురావస్తు శాఖ అధికారులు ప్రతీసారి తవ్వకాలు జరిపినప్పుడు.. ఏదొక నిధి నిక్షేపాలు బయటపడుతుండటం సర్వసాధారణం. ఆ తర్వాత వాటిని..

Viral: తవ్వకాల్లో బయటపడ్డ పురాతన ఫ్రిడ్జ్.. అందులో ఏముందో చూడగా దెబ్బకు ఫ్యూజులు ఔట్..
Trending
Ravi Kiran
|

Updated on: Feb 22, 2023 | 7:14 PM

Share

పురావస్తు శాఖ అధికారులు ప్రతీసారి తవ్వకాలు జరిపినప్పుడు.. ఏదొక నిధి నిక్షేపాలు బయటపడుతుండటం సర్వసాధారణం. ఆ తర్వాత వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తే.. ఎన్నో ఏళ్ల నాటి చరిత్రలు వెలుగులోకి వస్తాయి. తాజాగా ఆ కోవకు చెందిన ఓ అరుదైన ఘటన దక్షిణ ఇరాక్‌లో చోటు చేసుకుంది. మరి ఇంతకీ ఆ స్టోరీ ఏంటి.? అసలేం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందామా.?

ఇటీవల దక్షిణ ఇరాక్‌లోని తవ్వకాలు జరిపిన పురావస్తు అధికారులకు ఫ్యూజులు ఎగిరిపోయే అనుభవం ఒకటి ఎదురైంది. దాదాపు 5 వేల ఏళ్ల నాటి రెస్టారెంట్‌ అవశేషాలు బయటపడ్డాయి. సుమేరియన్ నాగరికతకు ముఖ్యమైన కేంద్రంగా పిలిచే పురాతన లగాష్ శిధిలాల మధ్య పురావస్తు శాస్త్రవేత్తలు తవ్వకాలు చేపట్టారు. అక్కడ వారు ఈ పురాతన రెస్టారెంట్‌ను కనుగొన్నారు. అందులో ఆ కాలం నాటి ఓవెన్, కొన్ని బెంచీలు, గిన్నెలు, ఇతర పాత్రలతో పాటు ‘జీర్‌’ అని పిలిచే మట్టి రిఫ్రిజిరేటర్‌ కూడా బయటపడింది.

ఇక అందులో ఏముందా అని చూడగా అధికారులకు ఫ్యూజులు అవుట్ అయ్యాయి. ఆ ఫ్రిజ్‌లో బీర్‌ను దాచినట్టు వారికి రుజువులు దొరికాయి. అంతేకాకుండా ఆ పురాతన బీర్‌ తయారు చేసే ఒక రెసిపీని కూడా పురావస్తు అధికారులు కనుగొన్నట్లు చెప్పారు. కాగా, ఈ తవ్వకాల్లో పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం, పిసా విశ్వవిద్యాలయాలకు చెందిన బృందాల పాల్గొన్నట్లు తెలుస్తోంది.

Follow Us
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?