జపాన్ హిరోషిమాలో జరిగిన గ్రూప్ ఆఫ్ సెవెన్ (జి7) సమ్మిట్‌ను ముగించుకుని.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాపువా న్యూ గినియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం టోక్ పిసిన్ భాషలో తమిళ క్లాసిక్ ‘తిరుక్కురల్’ను విడుదల చేశారు. టోక్ పిసిన్ భాషలో తిరుక్కురల్ సాహిత్యాన్ని విడుదల చేసిన ఘనత పీఎం జేమ్స్ మరాపేకు దక్కిందని పీఎం నరేంద్ర మోదీ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. తిరుక్కురల్ అనేది ఒక ఐకానిక్ తమిళ రచన.. తిరుక్కురల్ కవిత్వాన్ని తమిళ కవి, తత్వవేత్త తిరువల్లువర్.. 1812లో పాత తమిళంలో రచించారు. ఇది ధర్మంతోపాటు పలు విషయాలపై సమగ్రమైన విషయాలను బోధిస్తుంది. ఈ మేరకు ప్రధాని మోడీ ట్విట్ చేసి.. తిరుక్కురల్ అనేది ఒక ఐకానిక్ రచన.. ఇది వివిధ విషయాలలో విలువైన అంతర్దృష్టులను అందిస్తుంది అంటూ పేర్కొన్నారు.
వెస్ట్ న్యూ బ్రిటన్ ప్రావిన్స్‌కు చెందిన శుభా శశింద్రన్, గవర్నర్ శశింద్రన్ ముత్తువేల్ సహ రచయితగా అనువాదం చేసిన ఈ పుస్తకం పాపువా న్యూ గినియా ప్రజలకు భారతీయ ఆలోచన, సంస్కృతిని మరింత దగ్గర చేయనుంది. తిరుక్కురల్, నీతి, రాజకీయ, ఆర్థిక విషయాలు, ప్రేమ, నిస్వార్థ జీవితం తదితర అంశాల సమాహారంతో కవిత్వం రూపంలో రచించారు. దీనిని అంతకుముందు పలు భాషల్లో కూడా అనువదించారు.
భారత ప్రవాసులు మాతృభూమితో సజీవంగా కనెక్ట్ అవుతున్నారు.. పీఎం మోడీ, జేమ్స్ మరాపే పాపువా న్యూ గినియాలోని టోక్ పిసిన్ భాషలో తమిళ క్లాసిక్ ‘తిరుక్కురల్’ అనువాదాన్ని ప్రారంభించారంటూ విదేశాంగ మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది.
In Papua New Guinea, PM James Marape and I had the honour of releasing the Thirukkural in Tok Pisin language. Thirukkural is an iconic work, which provides valuable insights across different subjects. pic.twitter.com/JHa4DcPneu
— Narendra Modi (@narendramodi) May 22, 2023
నైరుతి పసిఫిక్ ప్రజలకు భారతీయ ఆలోచనలు, సంస్కృతిని మరింత చేరువ చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన పాపువా న్యూ గినియా కౌంటర్ జేమ్స్ మరాపేతో కలిసి టోక్ పిసిన్ భాషలో తమిళ క్లాసిక్ ‘తిరుక్కురల్’ను విడుదల చేసినట్లు అధికారవర్గాలు తెలిపాయి. పపువా న్యూ గినియాను భారత ప్రధాని సందర్శించడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా ఇదు దేశాల ప్రధానులు ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిపారు. పీఎం జేమ్స్ మరాపే, గవర్నర్ జనరల్ బాబ్ దాడేలతో జరిపిన చర్చల్లో భారత్-పాపువా న్యూ గినియా సంబంధాలను పెంపొందించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ నొక్కి చెప్పారు.
ప్రధాని మోడీ అనేక సందర్భాలలో తిరుక్కురల్‌ను ప్రశంసించారు. అంతేకాకుండా గతంలో తన మాతృభాష గుజరాతీలో కూడా పుస్తక అనువాదాన్ని విడుదల చేశారు. “తిరుక్కురల్ ఒక సాహిత్య కళాఖండం మాత్రమే కాదు, సాధారణ జీవనానికి అసాధారణమైన మార్గదర్శకం. ఇది మనకు ధర్మమార్గాన్ని చూపుతుంది.. నిస్వార్థ జీవితాన్ని గడపడానికి మనల్ని ప్రేరేపిస్తుంది” అంటూ పేర్కొన్నారు. 2014లో ప్రధాని మోడీ దివంగత జపాన్ ప్రధాని షింజో అబేకి పుస్తక ప్రతిని బహుమతిగా కూడా ఇచ్చారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..