PM Modi: వియన్నాలో ప్రధాని మోదీ.. వందేమాతర గీతంతో ఘన స్వాగతం..
విదేశీ పర్యటనలో భాగంగా వియన్నా చేరుకున్నారు ప్రధాని మోదీ. ఆ దేశ అధ్యక్షుడు కార్ల్ నెహమర్ మోదీకీ ఘనస్వాగతం పలికారు. తొలిసారి ఆస్ట్రియా దేశానికి రావడం తమకు ఎంతో ఆనందంగా ఉందని తన భావనను ఎక్స్ వేదికగా పంచుకున్నారు. మాస్కో నుంచి ఆస్ట్రియా వెళ్లిన ప్రధాని మోదీ.. ఈ పర్యటనలో ఇరుదేశాల ద్వౌత్యపరమైన అంశాలపై చర్చించనున్నారు. రెండు దేశాల ఆర్ధిక అభివృద్దికి దోహదపడేలా వాణిజ్యపరమైన ఒప్పందాలను కుదుర్చుకోనున్నారు. భారత్ తో భాగస్వామ్యం అవ్వడం చాలా గర్వంగా ఉందన్నారు ఆస్ట్రియా అధ్యక్షుడు.

విదేశీ పర్యటనలో భాగంగా వియన్నా చేరుకున్నారు ప్రధాని మోదీ. ఆ దేశ అధ్యక్షుడు కార్ల్ నెహమర్ మోదీకీ ఘనస్వాగతం పలికారు. తొలిసారి ఆస్ట్రియా దేశానికి రావడం తమకు ఎంతో ఆనందంగా ఉందని తన భావనను ఎక్స్ వేదికగా పంచుకున్నారు. మాస్కో నుంచి ఆస్ట్రియా వెళ్లిన ప్రధాని మోదీ.. ఈ పర్యటనలో ఇరుదేశాల ద్వౌత్యపరమైన అంశాలపై చర్చించనున్నారు. రెండు దేశాల ఆర్ధిక అభివృద్దికి దోహదపడేలా వాణిజ్యపరమైన ఒప్పందాలను కుదుర్చుకోనున్నారు. భారత్ తో భాగస్వామ్యం అవ్వడం చాలా గర్వంగా ఉందన్నారు ఆస్ట్రియా అధ్యక్షుడు. ఈ రోజు కోసం తాను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీని ఆహ్వానిస్తూ ఒక సెల్ఫీని కూడా తీసుకున్నారు. ఆ ఫోటోను జత చేస్తూ తన ఎక్స్ ఖాతాలో కీలక సందేశాన్ని అందించారు.
Welcome to Vienna, PM @narendramodi ! It is a pleasure and honour to welcome you to Austria. Austria and India are friends and partners. I look forward to our political and economic discussions during your visit! 🇦🇹 🇮🇳 pic.twitter.com/e2YJZR1PRs
— Karl Nehammer (@karlnehammer) July 9, 2024
ఇదిలా ఉంటే వియన్నాలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మ్యూజికల్ ఈవెంట్లో పాల్గొన్నారు ప్రధాని మోదీ. అక్కడ వియన్నా దేశస్తులు మ్యూజికల్ ఇన్స్ట్యూమెంట్స్ ప్లే చేస్తూ వందేమాతరం గీతాన్ని పాడి వినిపించారు. వారి ప్రతిభకు ప్రధాని మోదీ ఫిదా అయ్యారు. భారత్ దేశ భక్తిగీతాన్ని పాడి వినిపించడం చాలా ఆనందంగా ఉందని, భారత దేశంపట్ల తమకు ఉన్న గౌరవాన్ని గుర్తించేలా చేసిందని అభినందించారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..