లాక్‌డౌన్ ఎఫెక్ట్.. ఇంట్లోనే లిక్కర్ తయారుచేసుకుంటున్న మందుబాబులు.. భారీగా పెరిగిన పైనాపిల్ ధరలు

|

Jul 10, 2021 | 8:52 PM

మందు చుక్కపడనిదే.. తెల్లారదు కొందరు మందుబాబులకు. మరీ ముఖ్యంగా లాక్‌డౌన్‌ సమయంలో మందు దొరక్క, శానిటైజర్‌ తాగడం, వైన్స్‌ షాప్స్‌ను లూటీ చేయడం....

లాక్‌డౌన్ ఎఫెక్ట్.. ఇంట్లోనే లిక్కర్ తయారుచేసుకుంటున్న మందుబాబులు.. భారీగా పెరిగిన పైనాపిల్ ధరలు
Pineapple Beer South Africa
Follow us on

మందు చుక్కపడనిదే.. తెల్లారదు కొందరు మందుబాబులకు. మరీ ముఖ్యంగా లాక్‌డౌన్‌ సమయంలో మందు దొరక్క, శానిటైజర్‌ తాగడం, వైన్స్‌ షాప్స్‌ను లూటీ చేయడం వంటి ఘటనలు చాలానే తెర మీదకు వచ్చాయి. మద్యానికి బనిసగా మారిన మందుబాబులు.. కర్ఫ్యూ సమయంలో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇక తాజాగా సౌతాఫ్రికాలో మందు బాబులకు ఇలాంటి పరిస్థితులే ఎదురయ్యాయి. అయితే వీళ్లు కాస్త.. తెలివిగా ఆలోచించి, ఏకంగా ఇంట్లోనే బీర్లను రెడీ చేసుకుంటున్నారంటా. అవును మీరు విన్నది నిజమే.. పైనాపిల్‌ పండ్లతో బీర్‌ను చేసుకుంటున్నారు. దీంతో ఒక్కసారిగా పైనాపిల్‌ ధరలు ఆకాశాన్నంటాయి. సౌతాఫ్రికాలో లాక్‌డౌన్‌ 4 లెవల్‌లో భాగంగా 14 రోజులపాటు లిక్కర్‌ షాపులు మూతపడ్డాయి. దీంతో పైనాపిల్‌ పండ్ల ద్వారా ఇంట్లోనే బీర్లు తయారు చేసుకుంటున్నారు మందుబాబులు. ఈ ప్రభావంతో పైనాపిల్‌ పండ్ల ధరలు ఊహించని విధంగా 74 శాతం పెరిగాయి. లాక్‌డౌన్‌-మందు దొరకని పరిస్థితుల నేపథ్యంలోనే పైనాపిల్‌కు ఒక్కసారిగా డిమాండ్‌ పెరిగిందని, సౌతాఫ్రికా అగ్రిమార్క్‌ ట్రెండ్స్‌ వెల్లడించింది. లాక్‌డౌన్ మరికొన్ని రోజులు కొనసాగితే,  పైనాపిల్‌ ధరలు అందనంత రేంజ్‌కు చేరొచ్చని అంచనా వేస్తున్నారు. మందుబాబులు. చూశారుగా ఇంట్లో కూడా తయారు చేసుకుంటున్నారు కానీ మందు మాత్రం మానలేకపోతున్నారు. లిక్కర్ మనషులను ఏ మేరకు బానిసలుగా మార్చిందే తెలుపడానికి ఈ సందర్భాన్ని ఉదహరించవచ్చు.

Also Read: రిసెప్షనిస్ట్ స్థాయి నుంచి IPS ఆఫీసర్ వరకూ.. స్ఫూర్తినిచ్చే పూజా యాదవ్ సక్సెస్‌ స్టోరీ

 సింహం పరిగెత్తుకు వస్తున్నా ఫైటింగ్ ఆపని జింకలు, చివరకు ఏం జరిగిందంటే..?