Parrot Fever: చిలుక జ్వరం అంటే ఏంటి.? లక్షణాలివే.. దీనికి చికిత్స ఎలా..! అస్సలు నిర్లక్ష్యం చెయ్యొద్దు..

|

Mar 08, 2024 | 2:03 PM

Parrot Fever Symptoms: పక్షులకు దగ్గరగా ఉండే వారికి ఈ ఇన్ఫెక్షన్ చాలా త్వరగా వ్యాపిస్తుందని చెప్పారు.. వ్యాధి సోకిన పక్షులు ఇతర పక్షులకు, మనుషులకు వ్యాప్తించేలా చేస్తాయి.పక్షుల శ్వాస, మలం, మూత్రం ద్వారా బ్యాక్టీరియా వ్యాపిస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ దుమ్ము కణాలు, నీటి బిందువుల ద్వారా కూడా వ్యాప్తి చెందుతుందని చెబుతున్నారు. కానీ, లక్షణాలు పెరిగే కొద్దీ మందులు కూడా పెరుగుతాయి. ఎందుకంటే.. వ్యాధి లక్షణాలు తీవ్రతరం అయినప్పుడు,

Parrot Fever: చిలుక జ్వరం అంటే ఏంటి.? లక్షణాలివే.. దీనికి చికిత్స ఎలా..! అస్సలు నిర్లక్ష్యం చెయ్యొద్దు..
Parrot Fever
Follow us on

కోవిడ్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా కొత్త వ్యాధుల పరంపర కొనసాగుతుంది.. బాక్టీరియా, వైరస్, శిలీంధ్రాల క్రిములు దాడి చేయడం వల్ల కొత్త రకాల వ్యాధులు పుట్టుకొస్తున్నాయి. ఇప్పుడు బ్రిటన్ సహా అనేక యూరోపియన్ దేశాల ప్రజలు చిలుక జ్వరంతో బాధపడుతున్నారు. సామాన్యుల నోళ్లలో చిలుక ఫీవర్‌గా పేరు తెచ్చుకున్న ఈ వ్యాధి శాస్త్రీయ నామం సిట్టాకోసిస్.. ఈ వ్యాధిని సీరియస్‌గా తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఈ వ్యాధి ఇప్పటికే ఐరోపా ఖండంలోని అనేక దేశాలలో వ్యాపించింది. ఈ ఇన్‌ఫెక్షన్‌తో ఇప్పటి వరకు ఐదుగురు మరణించారని సమాచారం. ఈ ఇన్ఫెక్షన్ 2023లోనే వెలుగులోకి వచ్చిందని తెలిసింది. అయితే, 2024 సంవత్సరం ప్రారంభంలో, ఈ సంక్రమణ వ్యాప్తి పెరిగింది.

చిలుక జ్వరం అంటే ఏమిటి..?

పేరుకు తగినట్టుగానే ఇది పక్షుల ద్వారా సంక్రమించే వ్యాధి. కేవలం చిలుకలకే పరిమితం కాదు. ఈ ఇన్ఫెక్షన్ అనేక రకాల వలస పక్షులు, అడవి పక్షులు, పౌల్ట్రీ ఫామ్‌లలోని కోళ్లతో సహా ఇతర పక్షుల ద్వారా కూడా వ్యాపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. చిలుక జ్వరం సోకిన వ్యక్తికి మొదట్లో సాధారణ ఫ్లూ మాదిరిగానే లక్షణాలు ఉంటాయి. ఆ తరువాతే లక్షణాలు తీవ్రమవుతాయి.

ఇవి కూడా చదవండి

చిలుక జ్వరం లక్షణాలు ఇలా..

– చలి, జ్వరం

– కండరాలలో నొప్పి

– వాంతులు, విరేచనాలు

– శారీరక బలహీనత

– పొడి దగ్గు

– తలనొప్పి వంటివి ఎక్కువగా వేధిస్తాయి.

వ్యాధి సోకిన 5 నుంచి 14 రోజులలోపు లక్షణాలు సాధారణంగా కనిపిస్తాయి. కొంతమందికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది. ఛాతీ నొప్పి ఉండవచ్చునని చెబుతున్నారు.

వ్యాధి సంక్రమణ..

పక్షులకు దగ్గరగా ఉండే వారికి ఈ ఇన్ఫెక్షన్ చాలా త్వరగా వ్యాపిస్తుందని చెప్పారు.. వ్యాధి సోకిన పక్షులు ఇతర పక్షులకు, మనుషులకు వ్యాప్తించేలా చేస్తాయి.పక్షుల శ్వాస, మలం, మూత్రం ద్వారా బ్యాక్టీరియా వ్యాపిస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ దుమ్ము కణాలు, నీటి బిందువుల ద్వారా కూడా వ్యాప్తి చెందుతుందని యుఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది. పక్షులు మనిషిని కొరికితే ఇన్ఫెక్షన్ వ్యాపిస్తుంది. వ్యాధి లక్షణాలు తీవ్రతరం అయినప్పుడు, న్యుమోనియా, గుండె రక్తనాళాల వాపు వంటివి సంభవించవచ్చు. హెపటైటిస్, నరాల సమస్యలు కూడా ఎదుర్కొంటారు.. సరైన సమయంలో వైద్య సహాయం అందకపోతే మరణించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తు్నారు.