పాకిస్థాన్ లో ఓ పెళ్లి కూతురు తన పెళ్లి రోజున ధరించిన అద్భుతమైన లెహెంగా ను చూసి ఆ వెడ్డింగ్ కి వచ్చిన గెస్టులు, ఇతరులు అంతా ఆశ్చర్యపోయారు. కళ్ళు పెద్దవి చేసుకుని మరీ చూశారట.. మరి అది అల్లాటప్పా లెహెంగా కాదు.. 100 కేజీల బరువున్న భారీ వస్త్రమని ఆ పెళ్లి పెద్దలు చెబుతుంటే ఇంకా ఆశ్చర్యపోవడం అందరి వంతయింది. బ్రహ్మాండమైన ఎంబ్రాయిడరీ తో కూడిన ఆ లెహెంగా మొత్తం స్టేజీనంతా ఆక్రమించింది. వెడ్డింగ్ డ్రెస్ అంటే ఇలా వెరైటీగా ఉండాలని ఆ వధువు పేరెంట్స్ ఇంత పెద్దదాన్ని కుట్టించారట. ఇందుకు ఎన్ని రోజులు పట్టిందో, ఎంత ఖర్చయిందో తెలియదు. ఆమె పక్కన కూర్చున్న వరుడు మాత్రం సింపుల్ గా గోల్డెన్ షేర్వాణీ, మెరూన్ కలర్ టర్బన్ ధరించి బెరుకు..బెరుకుగా కనిపించాడు. ఈ వధువు ధరించిన లెహెంగా తాలూకు వీడియో అంటే బెటర్.. అది గత యేడాడిదైనా ఇప్పుడు సోషజల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇది చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. భలేగా ఉందని ఒకరు ముచ్చట పడితే.. దాన్ని ధరించడానికి ఆమెకు ఎన్ని గంటలు పట్టిందో అని మరొకరు.. పాకిస్థాన్ లో ఇంత బడాబాబులు ఉన్నారా అని ఇంకొకరు కామెంట్ చేశారు. మరికొందరు.. ఇక నేలను ఊడ్చే పని సీపర్లకు ఉండదేమో అని సెటైర్ వేశారు. ఇక పెళ్లి ఎంత ధామ్ ధూమ్ గా జరిగిందో అని ఓ నెటిజనుడు నిట్టూర్చాడు.
This Pakistani bride’s giant lehenga is breaking the internet #Bridaloutfit #Pakistanwedding 👗 pic.twitter.com/4ThE7O74om
— Phupo.com (@ComPhupo) February 24, 2020
మరిన్ని ఇక్కడ చూడండి: Surprise Checks: గ్రామ, వార్డు సచివాలయలు ఆకస్మికంగా సందర్శించి, రికార్డులను తనిఖీ చేస్తున్న డిఐజిలు, ఎస్పీలు
Big News Big Debate: హుజూరాబాద్ ఫైటింగ్ లైవ్ వీడియో..