పాకిస్తాన్ క్రికెటర్ పై లైంగిక ఆరోపణలు… ప్రేమించానన్నాడు… పేరొచ్చాక వొదిలేశాడన్న మహిళ

పాకిస్తాన్ క్రికెటర్ పై లైంగిక ఆరోపణలు... ప్రేమించానన్నాడు... పేరొచ్చాక వొదిలేశాడన్న మహిళ

పాకిస్తాన్‌ క్రికెటర్‌ బాబర్‌ ఆజామ్‌పై ఓ మహిళ సంచలన ఆరోపణలు చేసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన బాబర్.. తనను 10 ఏళ్లుగా మోసం చేశాడని ఆరోపించింది. తనను లైంగికంగా కూడా వేధించాడని మీడియా సమావేశంలో తెలిపింది.

uppula Raju

|

Nov 29, 2020 | 6:51 PM

పాకిస్తాన్‌ క్రికెటర్‌ బాబర్‌ ఆజామ్‌పై ఓ మహిళ సంచలన ఆరోపణలు చేసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన బాబర్.. తనను 10 ఏళ్లుగా మోసం చేశాడని ఆరోపించింది. తనను లైంగికంగా కూడా వేధించాడని మీడియా సమావేశంలో తెలిపింది. దీంతో పాకిస్తాన్‌‌ క్రికెట్, ప్రజల్లో ఇప్పుడిదే హాట్ టాపిక్ గా మారింది. బాధితురాలు మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. “బాబర్ నేను స్కూల్లో స్నేహితులం. బాబర్ కష్టాల్లో ఉన్నప్పుడు నేను అతడి వెంటే ఉన్నాను. అతనికి ఆర్థికంగా కూడా సాయం చేశాను. 2010లో నన్ను పెళ్లి చేసుకుంటానని బాబర్ నాకు ప్రపోజ్ చేశాడు. నేను దానికి అంగీకరించాను. ఆ తర్వాతి ఏడాదే తాము పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం. కానీ 2012లో అండర్-19 వరల్డ్ కప్‌లో పాక్ టీమ్‌కు బాబర్ నేతృత్వం వహించాడు. దీంతో అతనికి చాలా ఫేమ్ వచ్చింది. ఆ తర్వాత జాతీయ జట్టుకు కూడా సెలక్ట్ అయ్యాడు. ఈ క్రమంలోనే బాబర్ మనసు మార్చుకున్నాడు’’ అని ఆరోపించింది.

పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే చంపుతానని బాబర్ తనై బెదిరింపులకు పాల్పడ్డాడని తెలిపింది. తనై శారీరకంగా దాడి చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. అయితే తను ఫిర్యాదు చేసినప్పటికీ పాక్ క్రికెట్ బోర్టు పట్టించుకోలేదని ఆమె చెప్పింది. కాగా, పాకిస్తాన్ క్రికెట్ టీం సభ్యులపై కూడా గతంలో లైంగిక ఆరోపణలు చాలానే వచ్చాయి. ఇక, కొద్ది రోజుల క్రితమే బాబర్ అన్ని ఫార్మట్లలో పాక్ క్రికెట్ టీమ్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. ప్రస్తుతం పాక్ జట్టుతో కలిసి బాబర్ న్యూజిలాండ్‌లో ఉన్నాడు. డిసెంబర్ నెలలో కివీస్‌తో జరిగే టీ20, టెస్టు సిరీస్ కోసం పాక్ జట్టు అక్కడికి చేరుకుంది.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu