India – Pakistan: భారత్‌పై పాకిస్థాన్ భారీ కుట్ర.. టర్కీతో చేతులు కలిపి.. నివేదికలో షాకింగ్ విషయాలు..

|

Oct 27, 2022 | 2:02 PM

దాయాది దేశం పాకిస్థాన్ ప్రవర్తనలో మాత్రం మార్పు రావడం లేదు. నిత్యం కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. అయితే.. ఈ చర్యలు ఆ దేశానికి చేటు కలిగిస్తున్నాయి. పాకిస్థాన్.. టర్కీ దేశంతో కలిసి

India - Pakistan: భారత్‌పై పాకిస్థాన్ భారీ కుట్ర.. టర్కీతో చేతులు కలిపి.. నివేదికలో షాకింగ్ విషయాలు..
Cyber Army
Follow us on

పాకిస్థాన్ తన వక్ర బుద్ధిని మార్చుకోవడం లేదు.. భారత్‌పై కుట్ర పన్నేందుకు ఎప్పుడూ ఏదో ఒక పంథాతో తెరపైకి వస్తూనే ఉంది. ఈ క్రమంలో భారత్ ధీటుగా సమాధానం ఇస్తున్నా.. దాయాది దేశం ప్రవర్తనలో మాత్రం మార్పు రావడం లేదు. నిత్యం కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. అయితే.. ఈ చర్యలు ఆ దేశానికి చేటు కలిగిస్తున్నాయి. తాజాగా.. పాకిస్థాన్.. టర్కీ దేశంతో చేతులు కలిపి భారత్, అమెరికా దేశాలపై చేసిన కుట్ర వెలుగులోకి వచ్చింది. దీనికి టర్కీ సహాయం చేసినట్లు నివేదికలో వెల్లడైంది. దీనికోసం.. పాకిస్థాన్, టర్కీ మధ్య ద్వైపాక్షిక ఒప్పందం సైతం కుదిరినట్లు నార్డిక్ మానిటర్ అనే వార్తా సంస్థ వెల్లడించింది. ఇండియా, అమెరికా దేశాలపై దాడుల కోసం సైబర్ ఆర్మీ ని ఏర్పాటు చేసిందని తెలిపింది. పాకిస్తాన్ చేసిన కుట్రకు టర్కీ రహస్యంగా సాయం చేసిందని పేర్కొంది. ఈ దేశాలపై సైబర్ దాడులకు పాల్పడేందుకు ఉద్దేశించిన ఒప్పందం 2018 లోనే కుదిరిందని నోర్డిక్ మానిటర్ నివేదికలో తెలిపింది. అలాగే ఆగ్నేయాసియా దేశాల్లోని ముస్లిములను ప్రభావితం చేసేందుకు ఈ ఆర్మీని వినియోగించుకోవాలని.. భారీ ఆపరేషన్ చేపట్టినట్లు తెలిపింది.

ఈ ప్రణాళికను పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆమోదించారని పేర్కొంది. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంలో ఉన్న క్రమంలో.. టర్కీ అంతర్గత వ్యవహారాల మంత్రి సులేమాన్ సోయ్లు 2018తో భేటీ అయ్యారని తెలిపింది. ఇమ్రాన్‌ ఖాన్‌ తో భేటీ సందర్భంగా భారత్‌, అమెరికాను ఎదుర్కోవడానికి సైబర్‌ ఆర్మీ ఏర్పాటుకు ఒప్పందం కుదిరిందని తెలిపింది. పాకిస్థాన్ ను 2018 డిసెంబరు 17న సందర్శించిన టర్కీ అంతర్గత మంత్రి సులేమాన్ సోయ్లు.. అప్పటి అంతర్గత వ్యవహారాల మంత్రి షెహ్ర్యార్ ఖాన్ ఆఫ్రిది మధ్య జరిగిన చర్చల్లో సైబర్ ఆర్మీని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన మొదటిసారిగా చర్చకు వచ్చినట్లు తెలిపింది. దీనికి ఇమ్రాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని పేర్కొంది.

అయితే.. ఈ రెండు దేశాల మధ్య జరిగిన సమావేశాలను రహస్యంగా ఉంచారని, చివరకు ఇస్లామాబాద్ లోని ఉన్నత స్థాయి అధికారుల్లో చాలామందికి తెలియదని నోర్డిక్ మానిటర్ తెలిపింది. తమ దేశాధ్యక్షుడు రిసెప్ తైపీ ఎర్డోగాన్ తరఫున టర్కీ మంత్రి సులేమాన్ సైబర్ స్పేస్ లో బాట్ ఆర్మీని నిర్వహించాడని.. ముఖ్యంగా ఇండియా, అమెరికా దేశాలను టార్గెట్ చేశాడని పేర్కొంది.

ఇవి కూడా చదవండి

సులేమాన్ మంత్రిగా బాధ్యతలు చేపట్టక ముందు.. ఎర్డోగాన్ నేతృత్వంలోని పాలక పార్టీని విమర్శించే పలువురు ప్రముఖ సామాజిక, రాజకీయ నేతలను అవమానపరచేందుకు ఏకంగా ఆరు వేల మందితో ఓ ‘ట్విటర్ టీమ్’ నే ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. 6 వేల ట్రోల్ ఆర్మీ.. చేతిలో ప్రత్యర్థుల ఈ-మెయిల్స్, సోషల్ మీడియా ఖాతాలు, సెల్ ఫోన్ డేలా ఉండేదని.. వారిని బ్లాక్ మెయిల్ చేసేందుకు వీటిని వినియోగించుకునేవాడని పేర్కొంది.

కాగా.. ఈ నివేదిక అమెరికా సహా.. భారత్‌లో కలకలం రేపింది. దీనిపై అమెరికా, భారత్ ఏ విధంగా స్పందించనున్నాయి.. పాకిస్థాన్, టర్కీ ఎలాంటి వివరణ ఇవ్వనున్నాయి.. అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..