కొనలేక తినలేక! కేజీ ఉల్లి అక్షరాల రూ.220, నూనె రూ.532లు.. దడ పుట్టిస్తోన్న నిత్యవసర వస్తువులు
నిత్యవసర వస్తువుల ధరలు మండిపోతున్నాయి. ఆహారం కోసం ఒకరినొకరు చంపుకోవడానికి కూడా వెనకాడటం లేదు. ఇదీ ప్రస్తుతం పాకిస్థాన్‌లో నెలకొన్న అత్యంత దయనీయ పరిస్థితి..
దాయాది దేశంలో నిత్యవసర వస్తువుల ధరలు మండిపోతున్నాయి. అక్కడి ధరలు సామాన్యుడి జేబుకు చిళ్లు పడుతోంది. గతేడాది సంభవించిన భారీ వరదల వల్ల ఏర్పడిన సంక్షోభం నుంచి పాకిస్తాన్ కోలుకోలేక పీకల్లోతు కష్టాల్లో ఇరుక్కుపోయింది. మరోవైపు ఆ దేశ ద్రవ్యోల్బణం పైపైకి ఎగబాకుతోంది. తాజాగా పాక్‌లో ఉల్లి ధర 501 శాతం మేర పెరిగింది. గతేడాది (2022) జనవరి 6న కిలో ఉల్లి ధర రూ.36.7లు ఉండగా.. ఈ ఏడాది జనవరి 5న కిలో ఉల్లి ఏకంగా రూ.220.4కి చేరింది. డీజిల్ 61 శాతం, పెట్రోల్ ధరలు 48 శాతం పెరిగాయి. బియ్యం, పప్పులు, గోధుమల ధరలు దాదాపు 50 శాతం పెరిగాయి. చికెన్ కేజీ రూ.700, డజన్ అరటి పండ్లు రూ.119, ఒక కేజీ వంట నూనె ధర రూ.532, లీటర్ పాలు రూ.149.. ఇలా ఏ వస్తువును కొనలేని పరిస్థితి నెలకొంది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ గణాంకాల ప్రకారం.. ఆదేశంలో ద్రవ్యోల్బణం రేటు డిసెంబర్ 2021లో 12.3 శాతం ఉండగా 2022 డిసెంబర్ నాటికి 24.5 శాతానికి పెరిగింది. ఆహార ద్రవ్యోల్బణం రేటు డిసెంబర్ 2021లో 11.7 శాతం ఉండగా.. డిసెంబర్ 2022 నాటికి 32.7 శాతానికి అంటే దాదాపు మూడు రెట్లు పెరిగింది. మరోవైపు అమెరికా డాలర్‌తో పోలిస్తే పాక్ కరెన్సీ మరింత బలహీనపడుతోంది. డిసెంబర్ 2022లో 224.8కి పడిపోయింది. ఆహారం కోసం ఒకరినొకరు చంపుకోవడానికి కూడా వెనకాడటం లేదు. పాకిస్థాన్‌లో నెలకొన్న ఆర్థిక సంక్షోభం ప్రస్తుతం ప్రపంచ దేశాలను కలవర పెడుతోంది.
#PakistanFlourCrisis, Visual from #Sindh Pakistan, people were seen squabbling for flour.
It’s Painful??#PakistanEconomy #ResilientPakistan pic.twitter.com/7qlSjh3rni
— Bakhtawar Shah (@Shah_Bakhtawar1) January 10, 2023
Acute shortage of #wheat flour in #Pakistan – people dying in stampedes. However, Pak set to dispatch around 160 containers with #ammunition for #Ukraine. ‘Project Shipping’ firm to #ship containers from #Karachi to #Gdansk.#Poland #Russia #Food #War #Economy #Port pic.twitter.com/oTmX2Y9m14
— Nishit Doshi (@NishitDoshi144) January 10, 2023
మరిన్ని అంతర్జాతీయ వార్తాకథనాల కోసం క్లిక్ చేయండి.