పాకిస్థాన్‌లో ఆహారం కొరతతో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. కరాచీలో ఉచిత రేషన్ తీసుకునే సమయంలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 12 మంది మృతి చెందగా , పలువురు గాయపడ్డారు. కరాచీలోని నౌరస్ స్క్వేర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. గత కొన్ని రోజులుగా పాకిస్తాన్ లో తరచుగా ఇలాంటి దారుణ ఘటనలు చెందిన వార్తలు వింటూనే ఉన్నాం. పాక్ ప్రజలు ఉచిత రేషన్ తీసుకోవడానికి వెళ్లిన సమయంలో జరిగిన తొక్కిసలాటలో పలువురు మరణించారు.
కరాచీలోని SITE పారిశ్రామిక ప్రాంతంలో శుక్రవారం ఆహార రేషన్ కోసం ప్రైవేట్ స్వచ్ఛంద సంస్థ పంపిణీ సందర్భంగా దారుణ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ఫ్యాక్టరీలో రేషన్ పంపిణీ జరుగుతున్న సమయంలో జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు పిల్లలతో సహా 11 మంది చనిపోయారు. మృతి చెందిన వారిలో ఎనిమిది మంది మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారని నివేదిక పేర్కొంది. తొక్కిసలాటలో మరో ఆరుగురు స్పృహతప్పి పడిపోయారు .రేషన్ పంపిణీ చేసే సమయంలో పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడారని పోలీసులు తెలిపారు.
వాస్తవానికి, ప్రతి సంవత్సరం రంజాన్ సందర్భంగా.. ఈ స్వచ్ఛంద సంస్థ కరాచీలోని పేద ప్రజలకు సహాయం చేయడానికి ఆహార వస్తువులను ఉచితంగా పంపిణీ చేస్తుంది. రెస్క్యూ డిపార్ట్‌మెంట్, పోలీస్ డిపార్ట్‌మెంట్ వర్గాల ప్రకారం.. మృతులలో ఎనిమిది మంది మహిళలు, ముగ్గురు పిల్లలు ఉన్నారు. మిగిలిన క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తొక్కిసలాటలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.
ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పాకిస్థాన్‌లో ఈ రోజులుగా చాలా ఫ్యాక్టరీలు, కర్మాగారాలు మూతపడి ఉన్నాయి. దీంతో అక్కడ కూలీలకు, నిరుపేదలకు ఉపాధి లభించే పరిస్థితి లేదు. ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. ఆ దేశ ద్రవ్యోల్బణం 47 శాతం వద్ద ఉంది. ద్రవ్యోల్బణం కూడా అనేక రికార్డులను బద్దలు కొట్టింది. అటువంటి పరిస్థితిలో, ప్రజలకు ఉచితంగా గోధుమ పిండిని పంపిణీ చేసే పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది.
ప్రభుత్వ రేషన్ షాపుల్లో కూడా ఉచితంగా గోధుమ పిండి తీసుకునే చోట రద్దీ నెలకొంది. ప్రస్తుతం గోధుమ పిండి ధర 20 కిలోలు రూ. 2500 నుండి 3000 పాకిస్తాన్ రూపాయల మధ్య నడుస్తోంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..