
పాకిస్తాన్ పార్లమెంటులో మాజీ సైనిక అధికారి, ఎంపీ తాహిర్ ఇక్బాల్ అకస్మాత్తుగా భావోద్వేగానికి గురై ఏడవడం ప్రారంభించాడు. దీంతో పాకిస్తాన్ పార్లమెంటులో నిశ్శబ్దం అలుముకుంది. పాకిస్తాన్, ఆక్రమిత కాశ్మీర్ లో భారతదేశం జరిపిన సిందూర్ దాడి తర్వాత పాకిస్తాన్‌లో భయానక వాతావరణం నెలకొంది. పార్లమెంటులో భద్రతపై చర్చ జరుగుతుండగా.. తాహిర్ ఇక్బాల్, ‘అల్లాహ్ వారిని రక్షించాలని నేను ప్రార్థిస్తున్నాను’ అని అన్నాడు.
తాహిర్ ఇక్బాల్ ప్రకటన పాకిస్తాన్‌లో పెరుగుతున్న అభద్రత, రాజకీయ అస్థిరతను ప్రతిబింబిస్తుంది. భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ దాడి పాకిస్తాన్ అధికార వ్యవస్థను కుదిపేసింది. ఆ దాడి ఖచ్చితమైనది, పరిమితమైనది. అయితే నిర్ణయాత్మకమైనది. ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని జరిపింది. పార్లమెంటులో దీనిపై చర్చ జరుగుతుండగా ఇక్బాల్ తన అభిప్రాయాన్ని చెబుతూ ఏడవడం ప్రారంభించాడు. ఆయన ప్రకటన పాకిస్తాన్ లో మాత్రమే కాదు భారతదేశంలో కూడా వైరల్ అవుతోంది.
పాకిస్తాన్ సైన్యంలో మేజర్‌గా పనిచేసిన తాహిర్ ఇక్బాల్.. తరువాత రాజకీయాల్లోకి ప్రవేశించి అనేక ముఖ్యమైన పదవులను నిర్వహించారు. PML-N పార్టీతో పర్యావరణ మంత్రిగా, కాశ్మీర్ వ్యవహారాల మంత్రిగా, ఆ తర్వాత MPగా పనిచేశారు. 2002, 2013 ఎన్నికల్లో ఆయన చక్వాల్ నియోజక వర్గం నుంచి భారీ మెజార్టీతో గెలిచారు. అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడైన తాహిర్ ఇక్బాల్ పాకిస్తాన్ పార్లమెంటులో ఇలా ఏడవడంతో ఆ దేశంలో ప్రజా ప్రతినిధులలో కూడా యుద్ద భయం ఎలా ఉందొ అనేది తెలుస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు.
Former Pakistani Army Officer, Major Tahir Iqbal and now a member of Pakistani Parliament broke down in National Assembly of Pakistan.
He said – We are weak, we are sinners… please Allah save us. 😭 pic.twitter.com/4X8qNW2AOB
— Incognito (@Incognito_qfs) May 8, 2025
ఆపరేషన్ సిందూర్ దాడి తర్వాత పాకిస్తాన్‌లో గందరగోళం నెలకొంది. దేశంలో భద్రతకు సంబంధించిన ఆందోళన వ్యాపించింది. సైన్యాన్ని అప్రమత్తం చేశారు. ప్రతిపక్షం భారతదేశంపై స్పందించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తోంది. అయితే ఆర్థిక సంక్షోభం, అంతర్గత అస్థిరత, ప్రపంచవ్యాప్తంగా ఒంటరి అయిన కారణంగా.. పాకిస్తాన్ ప్రభుత్వం ప్రస్తుత పరిస్థితుల్లో ఏమి చెయ్యాలో తెలియక అటు ఇటు కానీ ఆలోచనలతో ఊగిసలాడుతోంది. అయితే తాహిర్ ఇక్బాల్ వంటి వ్యక్తుల మనోభావాలు పార్లమెంటులో బహిరంగంగా వ్యక్తం చేస్తున్నారు.
భారతదేశం రచించిన ఈ వ్యూహం ఉగ్రవాద సంస్థలను మాత్రమే కాదు పాకిస్తాన్ రాజకీయ నేతల ఆలోచనలను కూడా ప్రభావితం చేస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వ ప్రతినిధులు తమ ప్రకటనలలో బలాన్ని ప్రదర్శిస్తుండగా.. అంతర్గతంగా వ్యవస్థ భయం, ఒత్తిడిలో ఉంది. సిందూర్ దాడి తర్వాత పాకిస్తాన్ ప్రభుత్వం భయపడుతోందని తాహిర్ ఇక్బాల్ ప్రతిచర్య స్పష్టంగా ప్రపంచానికి చూపిస్తోంది
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..