AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Azerbaijan: పాకిస్తాన్‌కు మద్దతు ఇచ్చిన ఈ అజర్‌బైజాన్ దేశం గురించి మీకు తెలుసా.. భారతీయులు ఎందుకు ఎక్కువ సందర్శిస్తారంటే..

పహల్గామ్ దాడి తర్వాత భారతదేశం వైమానిక దాడులు చేసి తద్వారా పాకిస్తాన్‌పై చర్య తీసుకుంది. ఈ విషయంలో ప్రపంచంలో అగ్ర రాజ్యాలతో సహా చాలా దేశాలు భారతదేశానికి సపోర్ట్ చేశాయి. అయితే టర్కీ, అజర్‌బైజాన్ పాకిస్తాన్‌కు మద్దతుగా నిలిచింది. ఈ దేశంలో అజర్‌బైజాన్ చాలా చిన్నది. పర్యటించడానికి చౌకైనది. అజర్‌బైజాన్‌లో ప్రయాణించడానికి ఎంత ఖర్చవుతుంది.. ఆ దేశంలో అన్వేషించడానికి స్థలాలు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..

Surya Kala
|

Updated on: May 08, 2025 | 6:21 PM

Share
పహల్గామ్ దాడి తర్వాత భారతదేశం, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం ఉంది. గత నెలలో పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత.. భారత ప్రభుత్వం పాకిస్తాన్‌పై వైమానిక దాడి చేసింది. అప్పటి నుంచి పాకిస్తాన్‌లో పరిస్థితి మరింత దిగజారింది. ఈ దశలో ప్రపంచంలోని అనేక దేశాలు భారతదేశానికి మద్దతు ఇస్తున్నాయి. అయితే అదే సమయంలో.. మూడు దేశాలు పాకిస్తాన్‌కు మద్దతుని ఇస్తూ ముందుకు వచ్చాయి, వాటిలో ఒకటి అజర్‌బైజాన్. ఈ దేశం చాలా చిన్నది కానీ అందమైనది. చౌకైనది. ఈ దేశ సాంస్కృతిక వారసత్వం, అందమైన దృశ్యాలు, అందరికీ అందుబాటులో ధరలు ఉండడంతో ఈ దేశం పర్యాటకులకు నచ్చే విధంగా ఉంటుంది. అజర్‌బైజాన్ దేశం గురించి తెలుసుకుందాం..

1 / 6
కాకసస్ పర్వతాల ఒడిలో ఉంది ఈ చిన్న దేశం. ఇది చారిత్రాత్మక నగరం. బాకు, ఆధునిక వాస్తుశిల్పం, మధ్య ఆసియా సంస్కృతిల అద్భుతమైన సమ్మేళనం. ఈ దేశం యూరప్.. ఆసియాల మధ్య ఉంది. అజర్‌బైజాన్ భారతీయ ప్రయాణీకులకు "బడ్జెట్ అనుకూలమైన", వీసా అనుకూలమైన గమ్యస్థానం. ఇటీవలి కాలంలో ఈ దేశం భారతీయులలో బాగా ప్రాచుర్యం పొందింది. అజర్‌బైజాన్‌ను సందర్శించడానికి ఎంత ఖర్చవుతుందో, ఈ దేశంలో అన్వేషించాల్సిన ప్రదేశాలు ఏమిటో ఈరోజు తెలుసుకుందాం.

2 / 6
ఈ దేశ పర్యటనకు ఎంత ఖర్చు అవుతుందంటే.. అజర్‌బైజాన్ పర్యటనకు వెళ్లేందుకు కేవలం 80 వేల నుంచి 90 వేల రూపాయలు మాత్రమే అవసరం. ఈ డబ్బులతో ఈ దేశాన్ని బాగా అన్వేషించవచ్చు. ఈ దేశానికి చేరుకోవడానికి భారతదేశం నుంచి బాకుకు నేరుగా విమానంలో ప్రయాణించాల్సి ఉంటుంది. విమానం టికెట్ ధర 30-40 వేల రూపాయల లోపు ఉంటుంది. అదే ఆఫ్-సీజన్‌లో టిక్కెట్లు బుక్ చేసుకుంటే కేవలం టికెట్ ధర రూ. 25,000 వరకు ఉంటుంది. అయితే ఈ దేశంలో పర్యటించాలంటే భారతీయులకు ఇ-వీసా అవసరం. ఇది దరఖాస్తు చేసుకున్న 2-3 రోజుల్లోపు లభిస్తుంది. అది కూడా కేవలం 1200 నుంచి 1500 రూపాయలకు లభిస్తుంది.

3 / 6

పర్యటన, ఆహార ఖర్చులు.. బాకుతో పాటు చుట్టుపక్కల నగరాల్లో బస చేయడానికి అనేక మంచి హోటల్స్ ఉన్నాయి. హాస్టల్‌లో లేదా సాధారణ హోటల్‌లో బస చేయాలనుకుంటే 1 రాత్రికి దాదాపు 1500 నుంచి 2000 వరకు ఖర్చవుతుంది. విలాసవంతమైన బస చేయాలంటే రూ. 4,000 వరకు చెల్లించాల్సి రావచ్చు. అంటే.. మొత్తం మీద ఒక వారం రోజులు పర్యటన అయితే.. అక్కడ బస చేయడానికి దాదాపు 10 వేల నుంచి 12 వేల రూపాయలు ఖర్చు అవుతుంది.

4 / 6
ఇక ఈ దేశంలో దొరికే ఆహారం చాలా చౌకగా, రుచికరంగా ఉంటుంది. ఇక్కడ రూ. 300 నుంచి 500 కి స్ట్రీట్ ఫుడ్ లేదా స్థానిక రెస్టారెంట్‌లో ఫుల్ మీల్స్ తినవచ్చు. సిటీ టూర్ కి, ప్రైవేట్ టాక్సీ లేదా మెట్రోకి రూ. 500 నుంచి రూ. 1500 వరకు ఖర్చవుతుంది.

5 / 6
అజర్‌బైజాన్‌లో సందర్శించడానికి ఉత్తమ ప్రదేశాలు.. అజర్‌బైజాన్‌లో సందర్శించడానికి , అన్వేషించడానికి చాలా అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. ముందుగా రాజధాని బాకు గురించి తెలుసుకుందాం.. ఈ నగరం ఆధునికత, వారసత్వపు అందమైన సమ్మేళనం. ఇక్కడ ఉన్న ఇచెరిషెహర్ (పాత నగరం) యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం. ఇక్కడ పురాతన రాజభవనాలు, ఇరుకైన వీధులు, చారిత్రక మసీదులను చూడవచ్చు. రాత్రి సమయంలో రంగురంగుల కాంతి ప్రదర్శనలతో మెరిసే ప్లం టవర్లు బాకు నగరానికి స్పెషల్ గుర్తింపు తెచ్చాయి. దీనితో పాటు నిజామి స్ట్రీట్, సెవెన్ వాటర్ ఫాల్స్‌ను కూడా అన్వేషించవచ్చు.

6 / 6