Working Days: ఇకపై వారాంత సెలవులు రెండు రోజులు కాదు మూడు రోజులు.. ఎక్కడో తెలుసా..?
Working Days In Japan: సాధారణంగా ఉద్యోగులకు వారానికి రెండు రోజులు సెలవు రోజులుంటాయి. ఐటీ కంపెనీలతో పాటు పలు ఇతర సంస్థలు కూడా ఇదే విధానాన్ని అవలంభిస్తున్నాయి. అయితే ఈ రెండు రోజులను మూడు రోజులకు..
Working Days In Japan: సాధారణంగా ఉద్యోగులకు వారానికి రెండు రోజులు సెలవు రోజులుంటాయి. ఐటీ కంపెనీలతో పాటు పలు ఇతర సంస్థలు కూడా ఇదే విధానాన్ని అవలంభిస్తున్నాయి. అయితే ఈ రెండు రోజులను మూడు రోజులకు మార్చడానికి జపాన్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.
ఇప్పటికే ప్రయోగాత్మకంగా అమలు చేసిన మూడు రోజుల వారంత సెలవుల విధానాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు నాలుగు రోజులు వర్కింగ్‌డే పాలసీ అమల్లోకి రానుంది. దీనిపై చట్టం తీసుకురావడానికి బిల్లు ప్రవేశ పెట్టే ఆలోచనలో ఉన్నారు. కరోనా మహమ్మారి ఇంకా పూర్తి స్థాయిలో తగ్గకపోవడం, రవణా వినియోగం కూడా తగ్గడం వంటి వాటిని పరిగణలోకి తీసుకొని జపాన్ ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు. అయితే ఈ కొత్త విధానం ఉద్యోగుల జీతాలపై ప్రభావం చూపుతుందని వాదనలు వినిపిస్తున్నాయి. వారానాకి నాలుగు రోజులే పని చేస్తారు కాబట్టి ఉద్యోగుల జీతాల్లో 20 శాతం మేర కోత విధించే అవకాశముందని తెలుస్తోంది. ఇక ఈ బిల్లు అమల్లోకి వస్తే.. ఉద్యోగులు వారంలో వారికి నచ్చిన మూడు రోజులు సెలవు తీసుకునే వెసులుబాటును కల్పించనున్నారు. మన దేశంలోనూ ఈ విధానం వస్తే బాగుంటుందని అనుకుంటున్నారు కదూ..!