Omicron: చాపకింద నీరులా వ్యాపిస్తున్న ఒమిక్రాన్.. ఇప్పటి వరకు ఈ వేరియంట్‌ ఎన్ని దేశాలకు వ్యాపించిందంటే..!

|

Dec 01, 2021 | 10:00 PM

Omicron: కరోనా మహమ్మారి గత ఏడాదికి పైగా విజృంభించి ప్రస్తుతం తగ్గుముఖం పట్టి ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో మరో కొత్త వేరియంట్‌ ఆందోళన కలిగిస్తోంది...

Omicron: చాపకింద నీరులా వ్యాపిస్తున్న ఒమిక్రాన్.. ఇప్పటి వరకు ఈ వేరియంట్‌ ఎన్ని దేశాలకు వ్యాపించిందంటే..!
Follow us on

Omicron: కరోనా మహమ్మారి గత ఏడాదికి పైగా విజృంభించి ప్రస్తుతం తగ్గుముఖం పట్టి ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో మరో కొత్త వేరియంట్‌ ఆందోళన కలిగిస్తోంది. సౌతాఫ్రికాలో బయటపడ్డ ఒమిక్రాన్ వేరింయట్‌ భయపెడుతోంది. ప్రమాదకరమైన డెల్టా వేరియంట్‌ కంటే ఒమిక్రాన్ మరింత ప్రమాదకరమైనదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే ప్రకటించింది. ఈ వేరియంట్‌ను అడ్డుకంటే వేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) అన్ని దేశాలను అప్రమత్తం చేసింది. ఇక కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేస్తూ పలు మార్గదర్శకాలను విడుదల చేసింది.

కేంద్రం మార్గదర్శకాలు..

అయితే భారత ప్రభుత్వం ఈ వేరియంట్‌పై మార్గదర్శకాలను విడుదల చేసింది. విమానాశ్రయాల్లో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకుపై ప్రత్యేక నిఘా పెట్టాలని ఆయా రాష్ట్రాలకు సూచించింది. ప్రయాణికులకు స్క్రీనింగ్‌ టెస్ట్‌, ఇతర పరీక్షలు నిర్వహించడం తప్పనిసరి చేసింది.  దక్షిణాఫ్రికాలో నవంబర్‌ 14న బయటపడ్డ ఒమిక్రాన్ వేరింయట్‌ చాపకింద నీరులా ఇతర దేశాలకు వ్యాపిస్తోంది. ఇప్పటి వరకు 14 దేశాలకు ఈ వేరియంట్‌ వ్యాపించినట్లు అధికారులు గుర్తించారు. అత్యధిక కేసులు సౌతాఫ్రికా ఉండటంతో ఆ దేశం నుంచి వచ్చే ప్రయాణికులపై ఇతర దేశాలతోపాటు భారత్‌ ప్రత్యేక నిఘా పెట్టింది. అయితే ముందుగా 12 దేశాలకు వ్యాపించినట్లు గుర్తించగా, మరో రెండు దేశాలు కూడా గుర్తించారు అధికారులు.

యూరఫ్‌ దేశాల్లో సైతం ఈ వేరియంట్‌ బయటపడింది. ఇక ఆసియాలో ఇజ్రాయిల్, జపాన్‌ దేశాల్లో బయటపడటంతో మిగతా దేశాలు అప్రమత్తం అయ్యాయి.
విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై నిబంధనలు విధించింది. ప్రతి ఒక్కరికి స్క్రీనింగ్‌ చేస్తూ పీసీఆర్‌,ఆర్టీ-పీసీఆర్‌ టెస్టులు చేస్తున్నారు. అయితే డెల్టా వేరియంట్‌ నుంచి పాఠాలు నేర్పుకున్న భారత్‌.. ఈ వేరియంట్‌ విషయంలో ముందే అప్రమత్తం అయ్యింది. అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. భారత్‌ వంటి జనాభా అత్యధికంగా ఉన్న దేశాల్లో ఈ వేరియంట్‌ ప్రవేశించినట్లయితే పెద్ద సమస్యగా మారే ప్రమాదం ఉంది. అందుకే వేరియంట్‌ దేశంలోకి రాకుండా చర్యలు చేపడుతోంది కేంద్ర ప్రభుత్వం.

ఇవి కూడా చదవండి:

ఎలాంటి నేరం చేయకుండానే జైల్లో 43 ఏళ్లు.. చివరికి నిర్ధోషిగా జైలు నుంచి విడుదల

Omicron: కొత్త వేరియంట్‌కు WHO ఒమిక్రాన్‌ అనే పేరు ఎందుకు పెట్టింది? చైనా అధ్యక్షుడికి ఈ వేరియంట్‌కు సంబంధం ఏమిటి?

వైరస్‌లు మనుషులపై ఎందుకు దాడి చేస్తాయి..? ఆందోళనకు గురి చేస్తున్న కొత్త వేరియంట్‌.. గుర్తించని వైరస్‌లు మరెన్నో..!