Oman Floods: కుదిపేస్తున్న వరదలు.. విరిగిపడుతున్న కొండచరియలు.. జనజీవనం అస్తవ్యస్తం.. వీడియో

పలు ప్రాంతాల్లో వరదల కారణంగా ఇళ్లు మునిగిపోయాయి. వాహానాలు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. వరదల్లో చిక్కున్నవారిని రక్షించేందుకు ఒమెన్‌ ప్రభుత్వం హెలిక్యాప్టర్లను రంగంలోకి దింపింది.

Oman Floods: కుదిపేస్తున్న వరదలు.. విరిగిపడుతున్న కొండచరియలు.. జనజీవనం అస్తవ్యస్తం.. వీడియో
Oman Floods
Follow us

|

Updated on: Aug 04, 2022 | 8:55 AM

Oman Floods: గల్ఫ్‌లోని సుల్తానేట్ ఆఫ్ ఒమన్‌ను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తాయి.. అల్ బురైమి, అల్ దహిరా, అల్ దఖిలియా, నార్త్ – సౌత్ బతినా గవర్నరేట్‌లలోని పర్వత ప్రాంతాల్లో కుండపోతను తలపించేలా వానలు పడ్డాయి.. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలతో అక్కడి వాగులు, జలాశయాలు ఉప్పొంగాయి. పలు జిల్లాల్లో వరద నీరు బీభత్సం సృష్టించింది. నిజ్వాలోని విలాయత్‌లో కొండచరియలు విరిగి పడ్డాయి. వరద ప్రవాహం భారీగా రావడంతో అల్ రహ్బా రహదారి భారీగా కోతకు గురైంది. ఫలాజ్ బనీ ఖుజైర్ ప్రాంతంలోని వ్యాలీ కోర్స్‌కు ఆనుకుని ఉన్న రోడ్డు కూలిపోయింది. నఖల్, అల్ అవాబి విలాయత్ లను కలిపే రహదారిపై పూర్తగా దెబ్బతినడంతో ట్రాఫిక్‌ పూర్తిగా నిలిచిపోయిది.

పలు ప్రాంతాల్లో వరదల కారణంగా ఇళ్లు మునిగిపోయాయి. వాహానాలు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. వరదల్లో చిక్కున్నవారిని రక్షించేందుకు ఒమెన్‌ ప్రభుత్వం హెలిక్యాప్టర్లను రంగంలోకి దింపింది. దహిరా గవర్నరేట్‌లోని యాన్‌కుల్‌ విలాయత్‌లోని వాడి అల్-బోవెర్దా ప్రవాహంలో కూరుకుపోయిన వాహనంలో ఇరుక్కుపోయిన ఇద్దరు వ్యక్తులను ఇద్దరిని రక్షించారు. అల్-హమ్రాలోలోయను దాటడానికి ప్రాణాలను పణంగా పెట్టిన ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు ప్రకటించారు. లోయ మధ్యలో ఆగిన వాహనం నుంచి ఆయన్ని రక్షించారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు.

ఇవి కూడా చదవండి

ఉత్తర ఒమన్‌లోని రస్తాక్‌ జలపాతం దగ్గర సందర్శకులు ఆకస్మికంగా వరదల్లో చిక్కుకున్నారు.. ఒకసారిగా దూసుకు వచ్చిన వరద ప్రవాహాన్ని చూసి ఆందోళనకు గురయ్యారు.. అందరూ జాగ్రత్తగా ఒడ్డుకు చేరడంతో ప్రాణాపాయం తప్పింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం

Latest Articles