AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పుతిన్‌తో చర్చల తర్వాత కిమ్ సహాయకులు మీటింగ్ హాల్‌లో చేసిన పనికి అంతా షాక్!

బుధవారం (సెప్టెంబర్ 3) నాడు, బీజింగ్ వీధుల్లో ఒక దృశ్యం కనిపించింది. ఇది అంతర్జాతీయ రాజకీయాలను క్రైమ్-థ్రిల్లర్ చిత్రంలోని సీన్‌ను తలపించింది. ఆ సందర్భం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉత్తర కొరియా సుప్రీం కిమ్ జోంగ్ ఉన్ సమావేశం. చైనా రాజధానిలో నిర్వహించిన గ్రాండ్ విక్టరీ డే పరేడ్‌లో పాల్గొనడానికి ఇద్దరు నాయకులు వచ్చారు. కానీ ఈ సమావేశం తర్వాత కనిపించిన దృశ్యం మొత్తం ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.

పుతిన్‌తో చర్చల తర్వాత కిమ్ సహాయకులు మీటింగ్ హాల్‌లో చేసిన పనికి అంతా షాక్!
Vladmir Putin Kim Jong Un
Balaraju Goud
|

Updated on: Sep 04, 2025 | 7:48 AM

Share

బుధవారం (సెప్టెంబర్ 3) నాడు, బీజింగ్ వీధుల్లో ఒక దృశ్యం కనిపించింది. ఇది అంతర్జాతీయ రాజకీయాలను క్రైమ్-థ్రిల్లర్ చిత్రంలోని సీన్‌ను తలపించింది. ఆ సందర్భం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉత్తర కొరియా సుప్రీం కిమ్ జోంగ్ ఉన్ సమావేశం. చైనా రాజధానిలో నిర్వహించిన గ్రాండ్ విక్టరీ డే పరేడ్‌లో పాల్గొనడానికి ఇద్దరు నాయకులు వచ్చారు. కానీ ఈ సమావేశం తర్వాత కనిపించిన దృశ్యం మొత్తం ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.

నిజానికి, పుతిన్-కిమ్ జోంగ్ ఉన్ ల అధికారిక చర్చలు ముగిసిన వెంటనే, కిమ్ కు చెందిన ఇద్దరు ప్రత్యేక సహాయకులు.. నేరస్థలానికి ఫోరెన్సిక్ బృందం వచ్చినట్లుగా గదిలోకి ప్రవేశించారు. వారి చేతుల్లో చేతి గ్లౌజులు, శానిటైజర్ ఉన్నాయి. ఒక సహాయకుడు కిమ్ కుర్చీ వెనుక భాగాన్ని పాలిష్ చేయడంలో ఏ రాయినీ వదలలేదు, మరొకరు చాలా సున్నితంగా తన ఉపయోగించిన గాజును ట్రేలో ఉంచి తీసివేశాడు. కుర్చీ హ్యాండిల్, టేబుల్ పైన, అపోహల్సటరీ కూడా స్క్రబ్ చేసి శుభ్రం చేశారు. లక్ష్యం ఒక్కటే – కిమ్ అనవాళ్లు ఇక్కడ ఉండకూడదు. ఈ సంఘటనను చూసిన రష్యన్ జర్నలిస్ట్ అలెగ్జాండర్ యునాషెవ్ సోషల్ మీడియాలో దీని గురించి రాశారు. పుతిన్‌ను కలిసిన తర్వాత కిమ్ జోంగ్ ఉన్ లేచినప్పుడు, ఉత్తర కొరియా సిబ్బంది వెంటనే కిమ్ గదిలోకి ప్రవేశించారని యునాషెవ్ రాశారు. వారు కిమ్ ఉనికికి సంబంధించిన ప్రతి ఆధారాన్ని చెరిపేశారు. వారు గాజును తీసుకొని, కుర్చీని పాలిష్ చేసి, కిమ్ చేయి పోయిన ప్రతి ఉపరితలాన్ని తుడిచిపెట్టారని పేర్కొన్నారు.

వీడియో చూడండి.. 

దీని వెనుక కారణం ఏమిటి?

రష్యన్ భద్రతా సంస్థలు లేదా చైనా నిఘా సంస్థలు తమ నాయకుడి DNA, చెమట లేదా ఇతర జీవ నమూనాలను తీసుకుంటాయని కిమ్ జోంగ్ ఉన్ బృందం భయపడిందని నిపుణులు భావిస్తున్నారు. ఈ నమూనాలు ఒక దేశ నాయకుడి ఆరోగ్యం, అనారోగ్యం లేదా బలహీనత రహస్యాలను వెల్లడించగలవు. ఇది వ్యూహాత్మకంగా చాలా సున్నితమైన సమాచారం. అందుకే ఇలా చేసి ఉంటారని భావిస్తున్నారు.

ఈ వ్యామోహం కిమ్ జోంగ్ ఉన్ కు మాత్రమే అని అనుకుంటే పొరపాటు. ఈ విషయంలో పుతిన్ కూడా తక్కువేమీ కాదు. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం, పుతిన్ విదేశీ పర్యటనలకు వెళ్ళినప్పుడల్లా, అతని బృందం అతని మూత్రం, మలాన్ని కూడా సేకరించి, వాటిని సురక్షితమైన సంచులలో.. ప్రత్యేక సూట్‌కేస్‌లో రష్యాకు తిరిగి తీసుకువస్తుంది. దీని ఉద్దేశ్యం ఏమిటంటే అతని ఆరోగ్యానికి సంబంధించిన సమాచారం ఏ విదేశీ సంస్థకు అందకూడదు. ఈ ప్రోటోకాల్ 2017 నుండి అవలంబించడం జరుగుతుంది. ఇటీవల అమెరికా అధ్యక్షులు డోనాల్డ్ ట్రంప్‌తో జరిగిన సమావేశంలో కూడా, పుతిన్ బృందం అదే ప్రక్రియను అనుసరించింది. దీని నుండి, ఇద్దరు నాయకులు తమ జీవసంబంధమైన గుర్తింపును ఆయుధంగా ఎంతవరకు పరిగణిస్తారో ఊహించవచ్చు..!