Jail For Selling News Paper: వార్త పత్రికలు అమ్మితే జైల్లో వేసేస్తారు.. ఈ వింత శిక్షకు కారణమిదేనట..!
కొన్ని దేశాల్లో వింత చట్టాలు ఉంటాయి. వాటి గురించి తెలుసుకుని మనం ఆశ్చర్యపోతుంటాం ఇలాంటి కూడా ఉంటాయా? అని. అలాంటి వింత చట్టాలు కలిగిన దేశాల్లో ఉత్తర కొరియా టాప్‌లో ఉందని చెప్పొచ్చు. ఈ దేశంలో ఉన్నన్ని వింత చట్టాలు.. మరి దేశంలో కూడా లేవంటే అతిశయోక్తి కాదు. జనరల్‌గా ప్రతి దేశంలోనూ వార్తా పత్రికలు విక్రయిస్తుంటారు. కానీ, ఈ దేశంలో మాత్రం వార్తా పత్రికలు అమ్మాలంటే.. అటు నుంచి అటే పారిపోతారు. ఎందుకంటే.. ఇక్కడ వార్తా పత్రికలు అమ్మడం నేరం.

ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలు ఉన్నాయి. ఆయా దేశం తమకు భౌతిక పరిసరాలు, సామాజిక అంశాలు, వివిధ అంశాల ఆధారంగా తమకు అనువైన చట్టాలను చేసుకున్నాయి. కొన్ని దేశాల్లో వింత చట్టాలు ఉంటాయి. వాటి గురించి తెలుసుకుని మనం ఆశ్చర్యపోతుంటాం ఇలాంటి కూడా ఉంటాయా? అని. అలాంటి వింత చట్టాలు కలిగిన దేశాల్లో ఉత్తర కొరియా టాప్‌లో ఉందని చెప్పొచ్చు. ఈ దేశంలో ఉన్నన్ని వింత చట్టాలు.. మరి దేశంలో కూడా లేవంటే అతిశయోక్తి కాదు. జనరల్‌గా ప్రతి దేశంలోనూ వార్తా పత్రికలు విక్రయిస్తుంటారు. కానీ, ఈ దేశంలో మాత్రం వార్తా పత్రికలు అమ్మాలంటే.. అటు నుంచి అటే పారిపోతారు. ఎందుకంటే.. ఇక్కడ వార్తా పత్రికలు అమ్మడం నేరం. వార్తా పత్రికలు అమ్మితే.. తీసుకెళ్లి జైల్లో పడేస్తారు. మరి దీనికి కారణం ఏంటి? ఆ దేశంలో ఇది నేరమెలా అయ్యింది? ఇంట్రస్టింగ్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఉత్తర కొరియా ప్రభుత్వ మౌత్ పీస్ ‘రోడాంగ్ సిన్మున్’. ఈ వార్తాపత్రికకు సంబంధించి ఒక నియమం ఉంది. ఎవరు కొనుగోలు చేసినా.. దానిని పూర్తిగా చదవాల్సిందే. వార్తాపత్రిక పేజీలలో ఆ దేశాధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ చిత్రాలు ఉంటాయి. అతని గొప్పదనాన్ని వివరిస్తూ ఆర్టికల్స్ మీద ఆర్టికల్స్ రాస్తారు. ఇక కిమ్ గౌరవార్థం ఆ పత్రిక కాపీలను కూడా పడేయరట. వాటిని అలాగే సంవత్సరాల తరబడి నిల్వ ఉంచేస్తారట.
అయితే, ఇటీవలి కాలంలో ఈ పేపర్‌ను ప్రజలు అన్ని అవసరాలకు వినియోగిస్తున్నట్లు గుర్తించింది ప్రభుత్వం. కిమ ఫోటోతో ఉన్న పేపర్లను జనాలు సిగరెట్ రోలింగ్ పేపర్‌గా, వాల్‌పేపర్, పార్సిల్ పేపర్‌గా ఇలా రకరకాల అవసరాలకు ఆ పేపర్‌ను వినియోగిస్తున్నారట. అయితే, సాధారణ పేపర్‌ను వినియోగిస్తే పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు. కానీ, కిమ్ ఫోటో ఉన్న పేపర్లు ప్రజలు అడ్డదిడ్డంగా ఉపయోగిస్తున్నారంటూ ప్రభుత్వం గుర్తించింది. ఇంకేముంది.. నా ఫోటో ఉన్న పేపర్లను అలా వాడుతున్నారా? అంటూ కిమ్ ఫైర్ అయ్యారట. అసలే తను చెప్పిందే వేదం అక్కడ. ఏమాత్రం ఆలస్యం సరికాదంటూ వెంటనే ఓ చట్టం తీసుకొచ్చేశాడు.
వాస్తవానికి కొరియాలో సిగెట్ రోలింగ్ పేపర్‌కు తీవ్ర కొరత ఏర్పడింది. అందుకే చాలా వరకు వార్తా పత్రికలను దీనికి వినియోగిస్తున్నారు. వార్తా పత్రిక పాత కాపీలను భద్రపరిచే ప్రభుత్వ కార్యాలయాల్లో అక్కడి అధికారులు సైతం ఇటీవలి కాలంలో వాటిని విక్రయించడం ప్రారంభించారు. దాంతో అవి పునర్వినియోగానికి నోచుకున్నాయి. కానీ, ఇక్కడే సమస్య వచ్చి పడింది. ఉద్యోగులు డబ్బులు వస్తున్నాయని సంతోష పడినా.. వార్తా పేపర్‌పై కిమ్ ఫోటో ఉండటం వారి పాలిట శాపంగా మారింది.
నేరుగా జైలుకే..
కిమ్ ఫోటో ఉన్న వార్తా పత్రికలను విధంగా అగౌరవ పరిచారనే నెపంతో ప్రజలను జైలుకు పంపుతోంది అక్కడి ప్రభుత్వం. వార్తా పత్రికను సిగరెట్ పేపర్‌గా ఉపయోగిస్తే వారికి శిక్ష విధిస్తోంది. ఎవరైతే ఈ పేపర్లను విక్రయిస్తారో వారికి జైలు శిక్ష తప్పదని హెచ్చరిస్తున్నారు. వార్తా పత్రికలను అగౌరవపరచడం.. కిమ్ జోంగ్ ఉన్‌ను అగౌరవపరచడమే అని ప్రభుత్వం చెబుతోంది. శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉండాలని వార్నింగ్ ఇస్తోంది. వార్తా పత్రికలను అగౌరపరిస్తే ఒకటి నుంచి రెండు సంవత్సరాల వరకు లేబర్ క్యాపులకు పంపిస్తున్నారు. ఇక ఇలాంటి నేరాలను గుర్తించేందుకు అక్కడి పోలీసులు మఫ్టీలో తిరుతూ నిఘా పెట్టారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..