Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అక్కడ పొరపాటున కూడా నవ్వొద్దు, మద్యం తాగొద్దు.. గీత దాటారో అంతే సంగతి..

జాలి, దయ లాంటి పదాలకు అస్సలు అర్థమే తెలియదు. అదో టైప్‌ ఆఫ్‌ శాడిజం. ఈ వర్ణనంతా నార్త్ కొరియాకు అధ్యక్షుడు-కిమ్‌ జాంగ్ తాజా ఆంక్షలు మరింత భయపెడుతున్నాయి.

అక్కడ పొరపాటున కూడా నవ్వొద్దు, మద్యం తాగొద్దు.. గీత దాటారో అంతే సంగతి..
North Korean
Follow us
Sanjay Kasula

|

Updated on: Dec 17, 2021 | 3:17 PM

North Korea: కఠిన నిర్ణయాలు తీసుకోవడంలో తన తర్వాతే ఎవరైనా. దుర్మార్గుడు. క్రూరుడు. జనాల ప్రాణాలంటే లెక్కే లేదు. ఏ మాత్రం తేడా వచ్చినా ముక్కలు ముక్కలు చేసి కాకులకు, కుక్కలకూ వేస్తుంటాడు. జాలి, దయ లాంటి పదాలకు అస్సలు అర్థమే తెలియదు. అదో టైప్‌ ఆఫ్‌ శాడిజం. ఈ వర్ణనంతా నార్త్ కొరియాకు అధ్యక్షుడు-కిమ్‌ జాంగ్ ఉన్‌ గురించే. ఉత్తర కొరియాకు ఏమైనా కావొచ్చు కానీ.. ప్రపంచం దృష్టిలో మాత్రం కిమ్‌ ఓ డిక్టేటర్‌. ఈ నియంత మరో హుకూం జారీ చేశాడు. నవ్వొద్దు, తాగొద్దు, గట్టిగా ఏడ్వొద్దు అంటూ ఆర్డర్స్ జారీ చేశాడు ఈ ఉత్తర కొరియా అధినేత కిమ్‌. ఈ నియంత పోకడలు కిమ్ జోంగ్ ఉన్ నియంతృత్వ పోకడలు ప్రపంచాన్ని ఆశ్చర్యపోయేలా చేస్తున్నాయి.

ఈ ఆంక్షలు ఎందుకోసమో తెలుసా.. తన తండ్రి కిమ్ జోంగ్ ఇల్ మరణించి నేటికి 10 సంవత్సరాలు పూర్తి కావస్తుండటంతో ఈ కొత్త నిర్ణయాలు తీసుకున్నాడు. ఆయన సంస్మరణార్థం ఆ దేశంలో 11 రోజులు సంతాప దినాలుగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఈ వింత ఆంక్షలను జారీ చేశాడు. ఈ 11 రోజులు వారు నవ్వొద్దు, మద్యం తాగొద్దు, వేడుకలు చేసుకోవద్దు.. ఈ నియమాలను అక్కడి మీడియా తాజాగా ప్రకటన జారీ చేసింది.

ఇవేం నిబంధనలు..

కిమ్‌ తండ్రి కిమ్‌ జోంగ్‌ ఇల్‌ మరణించి నేటికి 10 సంవత్సరాలు పూర్తవుతోంది. దేశమంతా 11 రోజులు సంతాప దినాలుగా ప్రకటించారు. ఈ సందర్భంగా పలు ఆంక్షలు విధిస్తూ మీడియాలో ప్రకటన జారీ చేశారు. ఈ 11 రోజులూ ప్రజలెవ్వరూ మద్యం సేవించకూడదు. నవ్వకూడరు, వేడుకల్లో పాల్గొనకూడదు. మొదటి రోజు డిసెంబర్‌ 17న దేశ ప్రజలెవ్వరూ నిత్యావసరాలు కొనేందుకు దుకాణాలకు వెళ్లరాదు. ఈ సంతాప దినాల సమయంలో ఎవరైనా మరణిస్తే.. మృతుని కుటుంబ సభ్యులు కూడా బిగ్గరగా ఏడ్వకూడదు. పుట్టిన రోజులు జరుపుకోవడానికి అస్సలు వీలులేదు.

ఇదేం కొత్తకాదు గతంలో కూడా.. గతేడాది సంతాప దినాల సమయంలో కూడా మద్యంపై ఆంక్షలు అక్కడ ఉండేవి.  ఆదేశాలకు విరుద్దంగా ప్రవర్తించి పట్టుబడిన వారికి కఠిన శిక్షల అమలు జరిగాయి. శిక్షలకు గురైన వారిలో అనేకమంది తరువాత కనపడకుండా పోయారు. కిమ్‌ తాత కిమ్‌2 సంగ్‌ మరణించిన జులై 8న కూడా అన్ని వేడుకలపై నిషేధం.

తండ్రి కూడా తక్కువ వాడేం కాదు.. 1994 నుంచీ 2011 వరకూ పాలించిన ప్రస్తుత అధినేత కిమ్‌ తండ్రి దివంగత కిమ్‌ జోంగ్‌ ఇల్‌ కూడా అత్యంత క్రూరుడు. తన నియంతృత్వ వైఖరితో ప్రజలకు స్వేచ్ఛలేకుండా చేసిన ఇల్‌.. ఇతని మూడో కుమారుడే ప్రస్తుత అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌. తండ్రి వర్దంతి రోజున ప్రతి ఏటా 10 రోజులు సంతాప దినాలుగా ప్రకటిస్తున్న ఉన్‌.. ఈ ఏడాది ఈ సంఖ్య 11 రోజులకు పెంపును ప్రకటించాడు.

కిమ్ కుటుంబ పాలనలోని ఉత్తర కొరియా ప్రజలకు ఆంక్షలు కొత్తేం కాదు. దేశంలో కరవు తాండవిస్తుండటంతో సరిగ్గా తిండితినే పరిస్థితి లేదు. ఆహార కొరత నెలకొనడంతో కొద్ది నెలల క్రితం కిమ్ చేసిన ప్రకటనపై ప్రపంచం ముక్కున వేలేసుకుంది. కరోనా ఆంక్షలు, సరిహద్దుల మూసివేత, గతేడాది తుపానులు కారణంగా ఆ దేశంలో ఆహార లభ్యత తగ్గి, ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. ఈ సమయంలో 2025 వరకు పౌరులంతా తక్కువ మొత్తంలో ఆహారం తీసుకోవాల్సిందిగా అధ్యక్షుడు కిమ్ పిలుపునిచ్చినట్లు మీడియాలో కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే.

కిమ్‌ నియంతృత్వ నిర్ణయాలు..

గతేడాది నుంచీ కరోనా ఆంక్షలు, తుఫానులతో దేశంలో ఆహార కొరత, దేశ సరిహద్దుల మూసివేత, నింగినంటిన నిత్యావసర వస్తువుల ధరలు, పట్టించుకోని అధినేత. ఇక అంతులేని ఆంక్షలకు, క్రూరమైన శిక్షలకు మారుపేరు కిమ్‌ ఉన్‌.

  •  2025 వరకూ ప్రజలంతా తక్కువ ఆహారం తీసుకోవాలిన కిమ్‌ పిలుపునిచ్చినట్లు గతంలో మీడియాలో కథనాలు
  • 2 వేల మంది అమ్మాయిలతో సెక్స్ చేసిన కిమ్‌, కానీ ప్రజలెవరైనా ఎవరైనా పోర్న్ చూస్తే మరణ శిక్ష
  • అ దేశంలో ఇంటర్నెట్ ఉండదు, అందుబాటులో మూడే మూడు టీవీ చానెళ్లు అవీ ప్రభుత్వానివే
  • ఫోన్లు ఉపయోగించకూడదు, అక్కడి పేదలను ఫొటోలు తీయకూడదు,
  • పేరుకు ఆరు రోజులు పనిదినాలు, కానీ సెలవు రోజు కూడా వాలంటరీగా పని
  • ఎవరూ బైబిల్ చదవ కూడదు, ఎవరి వద్దనైనా బైబిల్ కనిపిస్తే చావే
  • ప్రతి ఇంట్లో రేడియో ఉంటుంది, రేడియో ఎప్పుడూ ఆన్‌లోనే ఉండాలి, ఆపితే.. శిక్ష తప్పదు
  • జీన్స్ దుస్తులు ఇక్కడ నిషేధం, ఇళ్లు బూడిద రంగులోనే ఉండాలి
  • కిమ్ పూర్వీకులు, నాయకుల ఫొటోలే ఇంటి బయట ఉండాలి
  • మగవాళ్లంతా కిమ్ జాంగ్ ఉన్ హెయిర్‌ స్టైల్‌నే అనుకరించాలి

ఇవి కూడా చదవండి: బాదంపప్పుతో ఈ 5 సమస్యలకు పరిష్కారం..! ఔషధాల కంటే తక్కేవేమి కాదు.. ఎలాగో తెలుసుకోండి..