తనకు తాను దైవంగా ప్రకటించుకున్న వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద నెలకొల్పినట్లు చెబుతోన్న కైలాస దేశం తరపున ప్రతినిధులు జెనీవాలోని ఐక్యరాజ్య సమితి సమావేశాలకు హాజరైన సంగతి తెలిసిందే. భారత్‌లో లైంగిక వేధింపుల ఆరోపణలపై నిందితుడిగా ఉన్న నిత్యానంద దేశం వదిలి పారిపోయాడు. ఇతనిపై నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది కూడా. ఐతే అతను నెలకొల్పినట్లు చెబుతోన్న ‘యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస (యూఎస్‌కే)’ తరపున ఇద్దరు ప్రతినిధులు కాషాయ వస్త్రాలు ధరించి ఐక్యరాజ్య సమితి చర్చగోష్ఠిలో పాల్గొనడం ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఐరాస గుర్తించని దేశం తరఫు వ్యక్తులు ఆ కార్యక్రమంలో ఎలా భాగస్వాములయ్యారని, కైలాస దేశాన్ని ఐక్యరాజ్య సమితి అధికారికంగా గుర్తించిందా? అంటూ విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై ఐక్యరాజ్య సమితి బుధవారం స్పష్టతనిచ్చింది.
ఐరాసలో జరిగే సాధారణ సమావేశాల్లో ముందస్తు అనుమతితో ఎవరైనా పాల్గొని తమ అభిప్రాయం చెప్పవచ్చు. దీనివల్ల సమావేశం నిర్వహించే కమిటీలకు ఆయా వ్యక్తులు లేదా సంఘాల ప్రతినిధుల అభిప్రాయం తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఫలితంగా యూఎన్‌ఓ చేపట్టే ప్రణాళికల్లో వాటిని పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 24న ఐక్యరాజ్య సమితి నిర్వహించిన సుస్థిర అభివృద్ధి అనే అంశంపై బహిరంగ చర్చా వేదికను నిర్వహించింది. ఇందులో యునైటెడ్ స్టేట్ ఆఫ్ కైలాస (USK) ప్రతినిధులమని పేర్కొంటూ ఇద్దరు వ్యక్తులు పాల్గొన్నారు. వారిలో విజయప్రియ నిత్యానంద అనే ఓ మహిళ తనని తాను ఐరాసలో కైలాస దేశ ప్రతినిధిగా పరిచయం చేసుకుని, నిత్యానందను భారత్ వేధిస్తుందని ఆరోపించింది. దీనిపై యూఎన్‌ఓ స్పందిస్తూ.. కైలాస దేశా ప్రతినిధులు ఆ దేశం తరపున పాల్గొనలేదు. ఓ స్వచ్ఛంద సంస్థకు చెందిన వారిగా వచ్చి మాట్లాడారు. వారు అందించిన సమాచారాన్ని పరిగణనలోకి తీసుకోబోమని వివరణ ఇచ్చింది.
USK at UN Geneva: Inputs on the Achievement of Sustainability
Participation of the United States of KAILASA in a discussion on the General Comment on Economic, Social and Cultural Rights and Sustainable Development at the United Nations in Geneva
The Economic, Social, and… pic.twitter.com/pNoAkWOas8
— KAILASA’s SPH Nithyananda (@SriNithyananda) February 25, 2023
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.