AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: జాలర్ల వలకు చిక్కిన సొరచేప.. పొట్ట కోసి చూడగా మైండ్ బ్లాంక్.. వెలుగులోకి సంచలన నిజం..

కొన్నిసార్లు మనం అనుకున్నది ఒకటయితే.. అక్కడ మరొకటి జరుగుతుంది. సరిగ్గా ఇదే నిదర్శనంగా నిలుస్తూ ఓ సంఘటన అర్జంటినాలో చోటు చేసుకుంది.

Viral: జాలర్ల వలకు చిక్కిన సొరచేప.. పొట్ట కోసి చూడగా మైండ్ బ్లాంక్.. వెలుగులోకి సంచలన నిజం..
Representative Image
Ravi Kiran
|

Updated on: Mar 02, 2023 | 10:13 AM

Share

కొన్నిసార్లు మనం అనుకున్నది ఒకటయితే.. అక్కడ మరొకటి జరుగుతుంది. సరిగ్గా ఇదే నిదర్శనంగా నిలుస్తూ ఓ సంఘటన అర్జంటినాలో చోటు చేసుకుంది. సముద్ర తీరం గుండా బైక్‌పై చక్కర్లు కొట్టిన ఓ వ్యక్తి ఇంటికి చేరుకోకపోవడంతో.. అతడి కుటుంబసభ్యులు పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ రిపోర్ట్ నమోదు చేశారు. ఆ మేరకు ఖాకీలు సైతం విచారణ చేపట్టారు. కానీ కథలో అసలు ట్విస్ట్ ఇప్పుడే చోటు చేసుకుంది. సముద్రంలోకి వెళ్లిన జాలర్లకు చిక్కిన సొరచేప పొట్ట కోయగా.. మైండ్ బ్లాంక్ అయ్యే సీన్ ఒకటి కనిపించింది. ఇంతకీ అసలేం జరిగిందంటే..

పోలీసుల వివరాల ప్రకారం.. నెల రోజులుగా మిస్సింగ్ అయిన అర్జంటినా వ్యక్తికి సంబంధించిన అవశేషాలు సొరచేప పొట్టలో దొరికాయి. వాస్తవానికి 32 ఏళ్ల డియాగో బర్రియా ఫిబ్రవరి 18వ తేదీన సముద్ర తీరం వెంబడ బైక్‌పై చక్కర్లు కొడుతూ కనిపించాడు. ఆ తర్వాత అతడు మాయమయ్యాడు. దీనిపై పోలీస్ స్టేషన్‌లో కూడా కేసు నమోదైంది.

ఇదిలా ఉంటే.. 10 రోజుల క్రితం.. ఇద్దరు జాలర్ల వలకు మూడు సొరచేపలు చిక్కాయి. ఇక వాటిల్లో ఒకదాని పొట్ట కోసి చూడగా.. ఆ ఇద్దరి మైండ్ బ్లాంక్ అయ్యే సీన్ కనిపించింది. మోచేయికి సంబంధించిన అవశేషాలు కనిపించడంతో వెంటనే కోస్టల్ గార్డులకు సమాచారం అందించారు. దాన్ని పరిశీలించగా.. అది బర్రియాకు సంబంధించినదిగా తేలింది.

‘డియాగోకు యాక్సిడెంట్ జరిగిందని అనుకున్నాం. ఆ మేరకు విచారణ చేపట్టాం. కానీ సొరచేపలో మానవ అవశేషాలు లభ్యమయ్యాయని సమాచారం అందటం.. వాటిని బర్రియా కుటుంబీకులు గుర్తించడం జరిగింది. డీఎన్‌ఏ టెస్ట్ నిర్వహించడంతో.. ఆ అవశేషాలు బర్రియాకు చెందినవిగా తేలాయని’ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ మిల్లత్రుజ్ చెప్పుకొచ్చారు. కాగా, బర్రియా కనిపించకుండా పోయిన రోజు అసలేం జరిగింది.? బర్రియా సొరచేప నోటికి ఎలా చిక్కాడన్న కోణాలపై విచారణ చేపట్టామని అన్నారు.(Source)

భారీ పతనం.. వెండి ధర 75 శాతం తగ్గుతుందా? నిపుణుల సంచలన నివేదిక!
భారీ పతనం.. వెండి ధర 75 శాతం తగ్గుతుందా? నిపుణుల సంచలన నివేదిక!
హైదరాబాద్‌ హైటెక్‌ సిటీ.. అమరావతి క్వాంటం వ్యాలీ..
హైదరాబాద్‌ హైటెక్‌ సిటీ.. అమరావతి క్వాంటం వ్యాలీ..
వాళ్ల టార్గెట్ మీరే.. యువతకు సీపీ సజ్జనార్ కీలక సూచన
వాళ్ల టార్గెట్ మీరే.. యువతకు సీపీ సజ్జనార్ కీలక సూచన
పింక్ డ్రెస్‌లో క్యూట్‌గా.. ఈషా రెబ్బా బ్యూటిఫుల్ ఫొటోస్
పింక్ డ్రెస్‌లో క్యూట్‌గా.. ఈషా రెబ్బా బ్యూటిఫుల్ ఫొటోస్
స్టార్ హీరోతో లవ్.. కట్ చేస్తే.. నిర్మాతతో పెళ్లి..
స్టార్ హీరోతో లవ్.. కట్ చేస్తే.. నిర్మాతతో పెళ్లి..
OTTలోకి వచ్చేసిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్.. IMDBలో 9.3 రేటింగ్
OTTలోకి వచ్చేసిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్.. IMDBలో 9.3 రేటింగ్
ఏడు ఫ్లాప్‌ల తర్వాత నాగార్జునకు హిట్ ఇచ్చిన చిత్రం ఏదో తెలుసా.?
ఏడు ఫ్లాప్‌ల తర్వాత నాగార్జునకు హిట్ ఇచ్చిన చిత్రం ఏదో తెలుసా.?
ఇండస్ట్రీని మార్చేస్తున్న వైరల్ వయ్యారి.. కారణం అదేనా?
ఇండస్ట్రీని మార్చేస్తున్న వైరల్ వయ్యారి.. కారణం అదేనా?
భారత్‌పై మరోసారి జైష్-ఎ-మొహమ్మద్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు!
భారత్‌పై మరోసారి జైష్-ఎ-మొహమ్మద్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు!
మీరెప్పుడైనా కొవ్వొత్తి పువ్వులను చూశారా?.. ప్రత్యేక తెలిస్తే..
మీరెప్పుడైనా కొవ్వొత్తి పువ్వులను చూశారా?.. ప్రత్యేక తెలిస్తే..