కమలాహారిస్ చదవు, ఉద్యోగాలు, రాజకీయ అరంగేట్రం

కమలాహారిస్ చదవు, ఉద్యోగాలు, రాజకీయ అరంగేట్రం

అమెరికా కొత్త వైస్ ప్రెసిడెంట్ కమలాహారిస్ హోవార్డ్ యూనివర్సిటీలో చదువుకున్నారు. అమెరికాలో నల్లజాతీయులు ఎక్కువగా చదువుకునే యూనివర్సిటీల్లో అది ఒకటి. తన జీవితంపై ఎక్కువగా ప్రభావితం చూపిన అనుభవాల్లో కాలేజీ జీవితమూ ఒకటని ఆమె చెబుతుంటారు. న్యాయశాస్త్రంలో కమలాహారిస్‌ డిగ్రీ పొందారు. 2003లో శాన్ ఫ్రాన్సిస్కో సిటీ అటార్నీగా పనిచేసారు. తరువాత 2016లో కాలిపోర్నియా అటార్నీ జనరల్ గా కొనసాగారు. కాలిఫోర్నియా అటార్నీ జనరల్ పదవి చేపట్టిన తొలి మహిళ, తొలి ఆఫ్రికన్ అమెరికన్, తొలి ఏసియన్ […]

Venkata Narayana

|

Nov 08, 2020 | 2:43 PM

అమెరికా కొత్త వైస్ ప్రెసిడెంట్ కమలాహారిస్ హోవార్డ్ యూనివర్సిటీలో చదువుకున్నారు. అమెరికాలో నల్లజాతీయులు ఎక్కువగా చదువుకునే యూనివర్సిటీల్లో అది ఒకటి. తన జీవితంపై ఎక్కువగా ప్రభావితం చూపిన అనుభవాల్లో కాలేజీ జీవితమూ ఒకటని ఆమె చెబుతుంటారు. న్యాయశాస్త్రంలో కమలాహారిస్‌ డిగ్రీ పొందారు. 2003లో శాన్ ఫ్రాన్సిస్కో సిటీ అటార్నీగా పనిచేసారు. తరువాత 2016లో కాలిపోర్నియా అటార్నీ జనరల్ గా కొనసాగారు. కాలిఫోర్నియా అటార్నీ జనరల్ పదవి చేపట్టిన తొలి మహిళ, తొలి ఆఫ్రికన్ అమెరికన్, తొలి ఏసియన్ అమెరికన్ కూడా కమలా హారిసే. తన వాక్పటిమ, సంభాషణా చాతుర్యం, వాదనా పటిమతో చాలా తక్కువ సమయంలోనే ప్రజాకర్షణ పొందిన జాతీయ స్థాయి నాయకురాలిగా ఎదిగారు. 2017లో సెనేట్‌లో అడుగుపెట్టిన కమల అక్కడ ఇంటెలిజెన్స్‌, జ్యుడిషియరీ కమిటీల్లో సభ్యురాలిగా ఉన్నారు. అమెరికాలో అందరికీ సమానావకాశాలు దక్కాలని మొదట్నుంచీ తన వాణి వినిపిస్తున్నారు కమల. నల్లజాతీయుల సమస్యలూ, దక్షిణాసియా వాసుల ఇబ్బందులూ, వలసదారుల కష్టాలూ తెలిసిన వ్యక్తిగా కమలాకు రాజకీయ వర్గాల్లో గుర్తింపు ఉంది. మహిళలూ, అల్పాదాయ వర్గాల ప్రతినిధిగానూ పేరుంది. న్యాయవాది, ఇద్దరు పిల్లల తండ్రి అయిన డౌగ్లాస్‌ ఎమ్‌హాఫ్‌ను 2014లో పెళ్లిచేసుకున్నారు. ఆయన పిల్లల్ని తన పిల్లలుగానే భావిస్తూ వాళ్లతో ప్రేమానురాగాలు పంచుకుంటారు కమల.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu