5

అంత విభేదించినా.. కమలాహారిస్ వైపే చూసిన జో బైడెన్

అమెరికా ఎన్నికల్లో గెల్చిన భారత సంతతి తొలి సెనెటర్‌ కూడా కమలాహారిస్ నే. నిజానికి 2019 వరకూ డెమొక్రాట్ల నుంచి కమలా హారిస్‌ పేరే ప్రెసిడెంట్‌ రేస్‌లో వినిపించింది. ప్రైమరీ ఎలక్షన్స్‌ డిబేట్స్‌లో కమలా – జో బైడెన్‌ అనేక విషయాల్లో విభేదించారు. హెల్త్‌కేర్‌ విషయాలపై సంతృప్తికర సమాధానాలు చెప్పలేకపోవడం.. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేంత ఆర్థిక వనరులు నా దగ్గర లేవంటూ ఆ పోటీ నుంచి కమలా తప్పుకున్నారు. అయితే, అంత విభేదించినా సరే ఉపాధ్యక్ష […]

అంత విభేదించినా.. కమలాహారిస్ వైపే చూసిన జో బైడెన్
Follow us

|

Updated on: Nov 08, 2020 | 2:58 PM

అమెరికా ఎన్నికల్లో గెల్చిన భారత సంతతి తొలి సెనెటర్‌ కూడా కమలాహారిస్ నే. నిజానికి 2019 వరకూ డెమొక్రాట్ల నుంచి కమలా హారిస్‌ పేరే ప్రెసిడెంట్‌ రేస్‌లో వినిపించింది. ప్రైమరీ ఎలక్షన్స్‌ డిబేట్స్‌లో కమలా – జో బైడెన్‌ అనేక విషయాల్లో విభేదించారు. హెల్త్‌కేర్‌ విషయాలపై సంతృప్తికర సమాధానాలు చెప్పలేకపోవడం.. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేంత ఆర్థిక వనరులు నా దగ్గర లేవంటూ ఆ పోటీ నుంచి కమలా తప్పుకున్నారు. అయితే, అంత విభేదించినా సరే ఉపాధ్యక్ష పదవికి జో బైడెన్‌ స్వయంగా కమలాహారిస్‌ పేరు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపర్చారు. కమలాను ఎంచుకోడానికి కారణం…. ఆమెంత సమర్థవంతురాలిని తను చూడలేదన్నారు బైడెన్‌. ఎలాంటి బెరుకు లేకుండా పోరాడే యోధురాలు. దేశంలోని అత్యుత్తమ ప్రజా సేవకురాల్లో ఆమె ఒకరని ప్రశంసించారు. కమలా టీమ్‌లో ఉంటే తన పని చాలా సులువు అవుతుందని భావిస్తున్నానని.. ఆమె ఉంటే బ్లాక్స్‌ ఓట్స్‌, ఆసియా ఓట్లు.. మహిళల ఓట్లు తమ పార్టీకి వస్తాయని గట్టిగా నమ్ముతున్నానని అప్పుడు బైడెన్‌ చెప్పిన మాటలు ఇప్పుడు నిజమయ్యాయి.