నంద్యాల ఫ్యామిలీ ఆత్మహత్య కేసు: పోలీసుల వేధింపులే కారణమా..!

నంద్యాల కౌలూరు వద్ద ఈ నెల 3న రైలు కింద పడి ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. వారిని నంద్యాలలోని రోజాకుంటకు చెందిన అబ్దుల్‌ సలాం కుటుంబ సభ్యులుగా గుర్తించారు.

నంద్యాల ఫ్యామిలీ ఆత్మహత్య కేసు: పోలీసుల వేధింపులే కారణమా..!
Follow us

| Edited By:

Updated on: Nov 08, 2020 | 2:59 PM

Nandyal family suicide: నంద్యాల కౌలూరు వద్ద ఈ నెల 3న రైలు కింద పడి ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. వారిని నంద్యాలలోని రోజాకుంటకు చెందిన అబ్దుల్‌ సలాం కుటుంబ సభ్యులుగా గుర్తించారు. కాగా చనిపోయే ముందు అబ్దుల్‌ కుటుంబం తీసుకున్న ఓ సెల్ఫీ వీడియో వెలుగులోకి వచ్చింది. అందులో పోలీసులు తమను ఇబ్బంది పెడుతున్నారని, అందుకే ఆత్మహత్య చేసుకున్నామని అబ్దుల్‌, ఆయన భార్య నూర్జహాన్ అన్నారు. ( మాస్క్‌ విషయంలో నిర్లక్ష్యం.. ఏకంగా రూ.4.7కోట్లు వసూలు చేసిన బీఎంసీ

అబ్దుల్‌ ఓ బంగారు దుకాణంలో గుమస్తాగా పనిచేస్తుండగా.. గతేడాది నవంబర్ 7న ఆ షాపులో దొంగతనం జరిగింది. ఈ కేసులో అబ్దుల్‌ని పోలీసులు నిందితుడిగా చేర్చారు. ఇక ఈ కేసు విచారణ నేపథ్యంలో కర్నూల్‌ సీసీఎస్‌లో చిత్రహింసలు పెట్టినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఆ తరువాత సలాంను రిమాండ్‌కి తరలించారు. అలాగే సలాం ఇంట్లో ఉన్న బంధువుల ఆభరణాలను రికవరీ కింద పోలీసులు తీసుకెళ్లినట్లు సమాచారం. తరువాత బెయిల్‌పై బయటకు వచ్చిన అబ్దుల్‌ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించేవాడు. అయితే ఇటీవల సలాం ఆటోలో ప్రయాణిస్తోన్న ఓ ప్రయాణికుడి రూ.70వేల నగదు పోయింది. దీనిపై పోలీసులు అబ్దుల్‌తో పాటు ఆయన భార్య నూర్జహాన్‌ని విచారణకు పిలిచారు. మరుసటి రోజు మళ్లీ స్టేషన్‌కి రావాలని పోలీసులు ఆదేశించారు. దీంతో భయపడిన సలాం కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మహత్య చేసుకున్నట్లు వారి బంధువులు చెబుతున్నారు. ( మాకు గర్వంగా ఉంది.. కమలా హ్యారీస్‌కి సీఎం జగన్ అభినందనలు