రెచ్చిపోయిన బైక్ రైడర్.. ఒకరి మృతి

రెచ్చిపోయిన బైక్ రైడర్.. ఒకరి మృతి

అనంతపురం నగరంలో ఈ మధ్యకాలంలో బైక్ రైడర్ల ఆగడాలు మితిమీరుతున్నాయి. ర్యాష్ డ్రైవింగ్‌తో రోడ్డు మీద తిరిగుతూ జనాన్ని బెంబేలెత్తిస్తున్నారు కొందరు బైక్ రైడర్లు.

Rajesh Sharma

|

Nov 08, 2020 | 1:56 PM

Locals beaten rash bike rider: అనంతపురం నగరంలో ఈ మధ్యకాలంలో బైక్ రైడర్ల ఆగడాలు మితిమీరుతున్నాయి. ర్యాష్ డ్రైవింగ్‌తో రోడ్డు మీద తిరిగుతూ జనాన్ని బెంబేలెత్తిస్తున్నారు కొందరు బైక్ రైడర్లు. ర్యాష్ డ్రైవింగ్ చేసే వారి చేతిలో సామాన్య జనం బలవుతున్నారు. తాజాగా అనంతపురం నగరంలోని వినాయక నగర్ ప్రాంతానికి చెందిన వెంకట రమణ అనే వ్యక్తిని ఇలియాజ్ అనే వ్యక్తి శరవేగంతో వచ్చి బైక్‌తో ఢీకొట్టాడు. సప్తగిరి సర్కిల్‌లో వెంకట రమణ రోడ్డు దాటుతుండగా ఈ సంఘటన జరిగింది. భారీ హారన్ సౌండ్‌తో వేగంగా వచ్చి బైక్ తో ఢీ కొట్టాడు ఇలియాజ్.

జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయంలో అటెండర్‌గా పనిచేస్తున్న వెంకటరమణకు ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయమైంది. స్థానికులు అతన్ని ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతను మరణించాడని డాక్టర్లు తేల్చారు. దాంతో ఆగ్రహం చెందిన స్థానికులు ఇలియాజ్‌ను పట్టుకుని చితక్కొట్టారు. రద్దీ ప్రాంతాల్లో బైకులతో విన్యాసాలు చేస్తున్న బైక్ రైడర్లు.. తమలో తాము రేసులు పెట్టుకుంటూ జనాన్ని బెంబేలెత్తిస్తున్నారు. పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

ALSO READ: పార్టీ స్టాండ్‌కు వ్యతిరేకంగా టీడీపీ నేత ఫ్లెక్సీలు

ALSO READ: శ్రీవారి భక్తులకు డబుల్ గుడ్‌న్యూస్

ALSO READ: వాడికి ఉరేస్తేనే మాకు ఆత్మసంతృప్తి.. దివ్య పేరెంట్స్ సంచలన కామెంట్స్

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu