షిప్పింగ్ శాఖ పేరు మారింది…

షిప్పింగ్ శాఖ పేరును మార్చుతున్నట్లుగా ప్రకటించారు ప్రధాని మోదీ. ‌షిప్పింగ్ శాఖ పేరును మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్‌, షిప్పింగ్ అండ్ వాట‌ర్‌వేస్‌గా మారుస్తున్న‌ట్లు ప్ర‌ధాని వెల్లడించారు. ఆదివారం ఉద‌యం ప్ర‌ధాని..

షిప్పింగ్ శాఖ పేరు మారింది...
Follow us
Sanjay Kasula

|

Updated on: Nov 08, 2020 | 1:42 PM

Shipping Ministry To Be Renamed : షిప్పింగ్ శాఖ పేరును మార్చుతున్నట్లుగా ప్రకటించారు ప్రధాని మోదీ. ‌షిప్పింగ్ శాఖ పేరును మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్‌, షిప్పింగ్ అండ్ వాట‌ర్‌వేస్‌గా మారుస్తున్న‌ట్లు ప్ర‌ధాని వెల్లడించారు. ఆదివారం ఉద‌యం ప్ర‌ధాని మోదీ గుజ‌రాత్‌లోని సూర‌త్‌-సౌరాష్ట్ర మ‌ధ్య రోపాక్స్ ఫెర్రీ స‌ర్వీస్‌ను వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా ప్రారంభించారు.

ఈ సంద‌ర్భంగా మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్ పేరును మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్‌, షిప్పింగ్ అండ్ వాట‌ర్‌వేస్‌గా మార్చుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంద‌ని పేర్కొన్నారు. కాగా, కేంద్ర ప్ర‌భుత్వం ఇటీవ‌ల విద్యాశాఖ‌ పేరును కూడా మార్చిన సంగతి తెలిసిందే. మినిస్ట్రీ ఆఫ్ హ్యూమ‌న్ రిసోర్స్ డెవ‌ల‌ప్‌మెంట్‌‌గా ఉన్న పేరును కేంద్ర విద్యాశాఖ‌గా మార్చారు.