PM KP Sharma Oli: యోగా డే రోజున భారత్‌పై మరోసారి అక్కసు వెళ్లగక్కిన నేపాల్ ప్రధాని.. ఇంతకీ ఏమన్నారంటే..
PM KP Sharma Oli: యోగా దినోత్సవం రోజున నేపాల్ ఆపద్ధర్మ ప్రధాని కేపీ శర్మ ఓలి తన నోటి దురుసును మరోసారి ప్రదర్శించారు. భారత్‌కు...
PM KP Sharma Oli: యోగా దినోత్సవం రోజున నేపాల్ ఆపద్ధర్మ ప్రధాని కేపీ శర్మ ఓలి తన నోటి దురుసును మరోసారి ప్రదర్శించారు. భారత్‌కు యోగాకు అసలు సంబంధం లేదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. యోగా ఉద్భవించింది నేపాల్‌లో అని, యోగా పుట్టే సమయానికి భారత దేశం అసలు ఉనికిలోనే లేదని వ్యాఖ్యానించారు.
‘‘యోగా భారతదేశంలో కాదు.. నేపాల్‌లో ఉద్భవించింది. యోగా ఉనికిలోకి వచ్చిన సమయంలో భారతదేశం ఉనికిలోనే లేదు. ఇప్పుడున్నది విభజిత భారతదేశం.’’ అని కేపీ శర్మ ఓలి వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా తన నివాసం బలూవతార్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఓలీ ఈ ప్రకటన చేశారు. యోగా నేపాల్ గడ్డపై పుట్టిందన్న విషయం భారతీయ నిపుణులకు తెలుసునన్న ఆయన.. వారు దీనికి సంబంధించిన వాస్తవాలను దాచిపెడుతున్నారని ఓలి ఆరోపించారు. ‘‘ఇప్పుడు ఉన్న భారతదేశం గతంలో లేదు. వర్గాలుగా విభజించబడింది. ఆ సమయంలో భారతదేశం ఒక ఖండం, ఉప ఖండంగా ఉండేది.’’ అని వ్యాఖ్యానించారు.
2014 లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో యోగా దినోత్సవంపై ప్రకటన చేసిన తరువాత.. 2015 నుండి జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రతీ ఏటా నిర్వహిస్తున్నారు. ఐక్యరాజ్య సమితి సమావేశంలో ప్రసంగించిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. యోగా డే కోసం జూన్ 21వ తేదీని సూచించారు. ఎందుకంటే.. ఇది సంవత్సరంలోనే అత్యంతపై సుధీర్ఘమైన రోజు. ఆ కారణంగా దీనిని యోగా డే గా ప్రకటించారు.
ఇదిలాఉండే.. రాముడి జన్మస్థలం అయోధ్య నేపాల్‌లో ఉందని, రాముడు నేపాలీ అని గత ఏడాది జూలైలో ఓలి సంచలన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ‘‘నిజమైన అయోధ్య బిర్గుంజ్ పశ్చిమాన ఉన్న థోరి అనే నగరంలో ఉన్నప్పటికీ, రాముడు అక్కడే జన్మించాడని భారతదేశం పేర్కొంది. ఈ నిరంతర వాదనల కారణంగా, సీత భారతీయ రాజు అయిన రాముడిని వివాహం చేసుకున్నారని మేము కూడా నమ్ముతున్నాము. అయితే, వాస్తవానికి అయోధ్య బిర్గుంజ్ పశ్చిమాన ఉన్న ఒక గ్రామం. నకిలీ అయోధ్యను సృష్టించడం ద్వారా సాంస్కృతి ఆక్రమణకు భారతదేశం పాల్పడింది.’’ అంటూ తీవ్రమైన కామెంట్స్ ఓలీ చేశారు.
Also read: