Nepal Political Crisis: నేపాల్‌ రాజకీయాల్లో హైడ్రామా.. క్షణానికో ట్విస్ట్‌.. నిమిషానికో మలుపు.. ఓలీ, విపక్షాల పవర్ ఫైట్

|

May 21, 2021 | 8:47 PM

నేపాల్​ రాజకీయం రసవత్తరంగా మారింది. రోజుకో మలుపు తిరుగుతూ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సినిమాను తలపిస్తోంది. ప్రధాని పీఠం అధికార, విపక్షాల మధ్య దోబూచులాడుతోంది.

Nepal Political Crisis: నేపాల్‌ రాజకీయాల్లో హైడ్రామా.. క్షణానికో ట్విస్ట్‌.. నిమిషానికో మలుపు.. ఓలీ, విపక్షాల పవర్ ఫైట్
Nepal Political Crisis
Follow us on

Nepal Political Crisis: నేపాల్​ రాజకీయం రసవత్తరంగా మారింది. రోజుకో మలుపు తిరుగుతూ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సినిమాను తలపిస్తోంది. ప్రధాని పీఠం అధికార, విపక్షాల మధ్య దోబూచులాడుతోంది. తాజాగా విపక్ష కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకొచ్చింది. షేర్‌ బహదూర్‌ దేవ్‌బాను ప్రధానిగా ప్రకటించాలని రాష్ట్రపతిని కోరాయి కూటమి పార్టీలు.

వారం క్రితం నేపాల్‌ పీఎంగా మళ్లీ ప్రమాణస్వీకారం చేసిన కేపీ శర్మ ఓలీ.. బలనిరూపణకు విముఖత చూపడంతో సీన్‌ మొదటికొచ్చింది. మళ్లీ బాల్‌ విపక్ష కూటమి ముందుకొచ్చింది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకొచ్చాయి కూటమి పార్టీలు. నేపాల్ కొత్త ప్రధానిగా నేపాలీ కాంగ్రెస్​ నేత షేర్​ బహదూర్​ దేవ్​బా ఎన్నిక కానున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు షేర్​ బహదూర్​ దేవ్​బాను ప్రధానిగా ప్రకటించాలని రాష్ట్రపతి విద్యా దేవీ భండారీని కోరింది విపక్ష కూటమి.

271 స్థానాలున్న నేపాల్ ప్రతినిధుల సభలో మేజిక్​ ఫిగర్​ 136. అయితే, తమకు 149 మంది సభ్యుల మద్దతు ఉందని, ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలని కోరాయి కూటమిలోని పార్టీలు. నేపాలీ కాంగ్రెస్, మావోయిస్ట్​ సెంటర్, జేఎస్​పీ, యూఎంఎల్ పార్టీలు తమ ఎంపీల సంతకాలతో కూడిన పత్రాన్ని రాష్ట్రపతికి సమర్పించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. దేవ్​బా గతంలో వేర్వేరు సందర్భాల్లో..నాలుగు సార్లు నేపాల్​ ప్రధానిగా పనిచేశారు.

ఇక అంతకుముందు నేపాల్​ కమ్యూనిస్టు పార్టీ ఛైర్మన్​ అయిన ఓలీ.. పార్లమెంటులో బలం నిరూపించలేకపోవడం వల్ల రాజీనామా చేశారు. ఆ తర్వాత ప్రభుత్వ ఏర్పాటులో మిగిలిన పార్టీలు కూడా విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 14న ఓలీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేప్టటారు. అయితే, ప్రతినిధుల సభలో బలనిరూపణకు ఓలీ వెనక్కి తగ్గారు. నెల రోజుల్లోగా పార్లమెంటులో బలాన్ని నిరూపించుకోవాల్సి ఉన్నప్పటికీ..ప్రధాని సిఫార్సు మేరకు ప్రభుత్వ ఏర్పాటుకు రావాల్సిందిగా ఇతర పార్టీలను ఆహ్వానించారు రాష్ట్రపతి విద్యా దేవీ భండారీ. ఈ నేపథ్యంలోనే షేర్‌ బహదూర్‌ దేవ్‌బాను ప్రధానిగా ప్రకటించాలని రాష్ట్రపతిని కోరాయి కూటమి పార్టీలు.

తాజాగా నేపాలీ కాంగ్రెస్ అధ్యక్షుడు షేర్ బహదూర్ డ్యూబా నివాసంలో ప్రతిపక్ష కూటమి సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి నేపాలీ కాంగ్రెస్ (ఎన్‌సి), కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (మావోయిస్ట్ సెంటర్), జనతా సమాజ్‌బాదీ పార్టీ (జెఎస్‌పి) యొక్క ఉపేంద్ర యాదవ్ నేతృత్వంలోని వర్గాలు పాల్గొన్నాయి. అధికార సిపిఎన్-యుఎంఎల్ సీనియర్ నాయకుడు మాధవ్ కుమార్ నేపాల్ కూడా ఈ సమావేశానికి డ్యూబా నివాసానికి చేరుకున్నారు. రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఓలీపై చర్యకు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు, రాష్ట్రపతిపై అభిశంసన తీర్మానం చేయాలా వద్దా అనే దానిపై కూడా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.

Read Also… Covid-19 Third Wave: కర్ణాటకలో తగ్గని కరోనా మరణాలు… థర్డ్ వేవ్ ఊహాగానాలతో వణికిపోతున్న జనం