Mysterious Illness: బాప్ రే.. ఈ గ్రామంలో జనం నెలల తరబడి నిద్రపోతారు.. నిద్ర లేస్తే గతం మర్చిపోతారు

|

Jun 10, 2022 | 4:31 PM

ఎవరైనా ఎక్కువ సమయంలో నిద్ర పోతుంటే.. వీడు కుంభకర్ణుడి తమ్ముడిలా ఉన్నాడు అంటూ కామెంట్ చేయడం సర్వసాధారణం.. అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్న గ్రామంలో ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. అనేకమంది.. నెలల తరబడి నిద్రపోతుంటారు.. ఇక్కడ ప్రజలు ఎప్పుడైనా, ఎక్కడైనా నిద్రపోతారు.

Mysterious Illness: బాప్ రే.. ఈ గ్రామంలో జనం నెలల తరబడి నిద్రపోతారు.. నిద్ర లేస్తే గతం మర్చిపోతారు
Sleeping Sickness Village
Follow us on

Mysterious Illness: ప్రకృతి సృష్టించిన ఈ ప్రపంచం అనేక వింతలతో నిండి ఉంది. ప్రపంచంలోని వివిధ దేశాలను..  సమాజాలను అధ్యయనం చేస్తే.. అనేక వింతలు విశేషాలు.. ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుంటాం.. ఒకొక్కసారి విచిత్రమైన సంఘటలు తెలిస్తే.. ఆశ్చర్యానికి కూడా గురవుతాం..అంతేకాదు కొన్ని గ్రామాల్లో చోటు చేసుకునే వింతలను.. నేటికీ మనిషి మేథస్సు ఛేదించలేదని తెలిస్తే.. షాక్ తింటాం.. ఈరోజు మనం అలాంటి ఒక గ్రామం గురించి తెలుసుకోబోతున్నాం. రామాయణం(Ramayanam) గురించి తెలిసిన వారికి రావణాసుడి (Ravanasura) తమ్ముడు కుంభకర్ణుడు(Kumbhakarna) తెలుసు.. ఎవరైనా ఎక్కువ సమయంలో నిద్ర పోతుంటే.. వీడు కుంభకర్ణుడి తమ్ముడిలా ఉన్నాడు అంటూ కామెంట్ చేయడం సర్వసాధారణం.. అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్న గ్రామంలో ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. అనేకమంది.. నెలల తరబడి నిద్రపోతుంటారు.. ఇక్కడ ప్రజలు ఎప్పుడైనా, ఎక్కడైనా నిద్రపోతారు. ఆ గ్రామం కజకిస్తాన్‌లో ఉంది.

కలాచి గ్రామంలోని ప్రజలు సుదీర్ఘంగా నిద్రపోతుంటారు. అందుకనే ఈ గ్రామాన్ని స్లీపీ హాలో అని కూడా పిలుస్తారు. ఈ విచిత్రమైన గ్రామంలో దాదాపు 600 మంది నివసిస్తున్నారు. దాదాపు 160 మంది నిద్రపోతారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే..  నిద్రపోయిన తర్వాత గ్రామస్తులు గతంలో జరిగినదంతా మర్చిపోతారు.

ఈ గ్రామంలో నివసించే ప్రజలు ఎక్కడైనా నిద్రపోతారు. బజారులోనో, స్కూల్లోనో, రోడ్డు మీదనో ఎక్కడైనా పడుకోవడం మొదలుపెడతారు. అలా చాలా రోజులు నిద్రపోతూనే ఉంటారు. ప్రపంచం నలుమూలల నుండి చాలా మంది శాస్త్రవేత్తలు ఈ గ్రామానికి సంబంధించిన ఈ మిస్టరీని ఛేదించడానికి ప్రయత్నించినప్పటికీ, ఇప్పటి వరకు ఎవరూ ఈ నిద్ర రహస్యాన్ని ఛేదించలేకపోయారు. కొంతమంది శాస్త్రవేత్తలు ఖచ్చితంగా ఈ నిద్రను ఒక ప్రత్యేక రకమైన వ్యాధికి ఆపాదించినదని చెబుతున్నారు. అయిపోతే శాస్త్రజ్ఞులు తమ వాదనకు ఎటువంటి బలమైన సాక్ష్యాలను చూపించలేకపోతున్నారు.

ఇవి కూడా చదవండి

కజకిస్తాన్‌లోని ఈ గ్రామానికి సమీపంలో ఒక యురేనియం గని ఉండేదని, అది ఇప్పుడు మూసివేసినట్లు తెలుస్తోంది. ఈ గని నుంచి విషపు రేడియేషన్ వచ్చేది. దీని కారణంగా ప్రజలు ఇలాంటి వింత వ్యాధి బారిన పడ్డారని కొంతమంది వాదిస్తుంటారు. అయితే ఇప్పుడు ఈ గ్రామంలో ఇంకా చెప్పుకోదగ్గ స్థాయిలో రేడియేషన్ లేదు. అయినప్పటికీ .. ఈ వ్యాధికి కారణం యురేనియం గనులు కాదని పరిశోధకులు చెబుతున్నారు. ఈ నిద్ర రుగ్మతకు కారణం ఇక్కడ నీటిలోని కార్బన్ మోనాక్సైడ్ వాయువని అంటున్నారు.. అందుకనే ఇక్కడ ప్రజలు నెలల తరబడి నిద్రపోతారని పేర్కొంటున్నారు. కానీ శాస్త్రీయ కారణాలు మాత్రం సరైనవి చూపించడం లేదు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గ్రామాల్లో ఈ గ్రామం కూడా మిస్టరి గ్రామంగా మిగిలిపోయింది. (Source)

మరిన్నిహ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..