అత్యంత ఎత్తైన శిఖరాలు ఏంటంటే ఎవరెస్ట్, కే2 శిఖరాలని చాలా మంది చెబుతారు. కానీ ఎవరెస్ట్ కన్నా ఎత్తైన పర్వాతాలు ఎక్కడ ఉన్నాయో తెలుసా..? మన భూమి లోపలే. అమెరికాలోని అరిజోనా స్టేట్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకలు వీటిని గుర్తించారు. భూమిపైనే కాదు భూమి లోపల కూడ భారీ పర్వతాలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఎవరెస్ట్ కంటే భూమి లోపల ఉన్న పర్వతాలు మూడు, నాలుగు రేట్లు ఎత్తుగా ఉంటాయని చెబుతున్నారు. వాస్తవానికి ఎవరెస్ట్ ఎత్తు 8.8 కిలోమీటర్ల వరకు ఉంటుంది. కానీ భూగర్భంలో ఉండే పర్వతాలు ఏకంగా 38 కిలోమీటర్ల వరుకు ఉన్నాయని తెలిపారు.
అయితే ఈ పర్వతాలు భూమికి 2900 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. వీటిని అల్ట్రా-లో వెలాసిటీ జోన్స్‌గా పిలుస్తున్నారు. అంటార్కిటికాలోని భూకంప అధ్యయన కేంద్రాల నుంచి ఇందుకు సంబంధించిన సమాచారం బయటపడిందని పరిశోధకులు తెలిపారు. వీటి ఆధారంగానే ఈ ఎత్తైన పర్వతాలను గుర్తించినట్లు వెల్లడించారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..