AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mother’s Day 2023: ‘మాతృత్వం కూడా ఓ ఉద్యోగమైతే ప్రపంచంలో అత్యధిక జీతం అమ్మకే ఇవ్వాలి’

ఈ సృష్టిలో అమ్మకన్నా గొప్పది ఇంకోటి లేదు.. సృష్టిని సృష్టించిదే అమ్మ..అమ్మే లేకపోతే మనమెవరమూ లేము. మనల్ని నవమాసాలు మోసి, కని పెంచి కంటికి రెప్పలా కాపాడి మన ఆలనా పాలనా చూసి, పెంచి పెద్ద చేస్తుంది అమ్మ. సమాజంలో జనులకు మనల్ని పరిచయం చేస్తుంది అమ్మ..

Mother's Day 2023: 'మాతృత్వం కూడా ఓ ఉద్యోగమైతే ప్రపంచంలో అత్యధిక జీతం అమ్మకే ఇవ్వాలి'
Mother's Day
Subhash Goud
|

Updated on: May 13, 2023 | 9:29 PM

Share

ఈ సృష్టిలో అమ్మకన్నా గొప్పది ఇంకోటి లేదు.. సృష్టిని సృష్టించిదే అమ్మ..అమ్మే లేకపోతే మనమెవరమూ లేము. మనల్ని నవమాసాలు మోసి, కని పెంచి కంటికి రెప్పలా కాపాడి మన ఆలనా పాలనా చూసి, పెంచి పెద్ద చేస్తుంది అమ్మ. సమాజంలో జనులకు మనల్ని పరిచయం చేస్తుంది అమ్మ. మరి అలాంటి అమ్మకి మనం ఏమి చేసినా తక్కువే. ఆదివారం ‘మదర్స్‌ డే’ సందర్భంగా ప్రపంచంలోని అమ్మలందరికి మాతృదినోత్సవం శుభాకాంక్షలు చెబుదాం.

మదర్స్ డే అంటే…

అమ్మ అన్న దేవత లేకపోతే ఇది రాస్తున్న నేనూ లేను. చదువుతున్న మీరూ ఉండరు. రోజూ తలచుకోవాల్సిన ఈ దేవతను ఏదో ఒకనాడయినా తలచుకునేందుకు ఈ నాటి నాగరికత మనకో ‘రోజు’ను ఇచ్చింది. అదే ‘మదర్స్ డే’ మాతృమూర్తి దినోత్సవం. దేశదేశాల్లో ఈ ఉత్సవాన్ని జరుపుకోవడం ఇప్పుడు ఆనవాయితీగా తయారైంది. అయితే, భారత దేశంతో సహా అనేక దేశాలలో ఈనెలలోనే అదీ రెండో ఆదివారం నాడే ఈ ఉత్సవాన్ని జరుపుకుంటూ తమకు జన్మ ఇచ్చిన మాతృదేవతలను స్మరించుకుంటున్నారు. కానుకలిచ్చి కన్నరుణం తీర్చుకుంటున్నారు.

తల్లులను ఏడాదిలో ఒకరోజయినా గుర్తుంచుకుని పండగ చేసుకునే ఈ సంప్రదాయ మూలాలు మనకు విదేశాల నుంచే దిగుమతి అయ్యాయి. సంవత్సరంలో ఒక రోజుని ‘మదర్స్ డే’ గా గుర్తింపు సాధించడానికి దాదాపు నూట ఇరవై ఏళ్ళ క్రితమే అమెరికాలో ఒక మహిళ ఏళ్ళ తరబడి పోరాటం చేయాల్సి వచ్చిందంటే .. తల్లులపట్ల సమాజానికి ఉన్న చిన్న చూపు ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

‘అమ్మ’ సృష్టికే మూలం..

‘అమ్మ’ త్యాగాలకు రూపం, ప్రతిరూపం.. సృష్టికి మూలం.. మమతానురాగాల ప్రతిరూపం.. తరగనిది తల్లి రుణం.. ఎన్ని జన్మలెత్తినా అమ్మ ఋణం మనం తీర్చుకోలేం.. మన జీవితానికి మూలం.. ఇలా ఎన్ని చెప్పుకున్న అమ్మ గురించి తక్కువే. మహిళలకు మాతృత్వపు మాధుర్యాన్ని మించిన ఆనందం, ఆస్తి మరొకటి ఉండదు. పిల్లల ఎదుగుదలకు, సంరక్షణ కోసం ఎంతో శ్రమిస్తుంది. పిల్లలనే తన ప్రపంచంగా మార్చుకునే గొప్ప ఔదార్యం ఒక తల్లిలోనే ఉందంటే అతిశయోక్తికాదు.

తప్పులను కూడా ఒప్పులుగా భరిస్తూ..

పేగు తెంచుకున్న పుట్టిన బిడ్డ తెలిసి, తెలియక చేసిన తప్పులను కూడా తన కడుపులోనే పెట్టుకుని క్షమించేస్తుంది తల్లి. మరోసారి ఆ తప్పులను చేయకుండా.. బిడ్డలను సరైన దారిలో నడిపిస్తోంది. పదిమంది ప్రభోదకుల కంటే విజ్ఞానము అందించే ఓ ఉపాధ్యాయుడు ముఖ్యమయిన వ్యక్తి . పది మంది తండ్రుల కంటే తల్లి ముఖ్యమైనది . తల్లికి మించిన గురువు ఇంకెవరూ ఉండరు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!